వినుకొండ : ప్రభుత్వ చీప్ విప్ మరియు వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు వినుకొండ మున్సిపల్ కమిషనర్ సూచనలతో రాబోయే వర్షాభావ పరిస్థితులను దృష్టి నందు ఉంచుకొని పురపాలక సంఘ పరిధిలో ఎటువంటి వరదలు సంభవించకుండా, రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా నివారించేందుకు దుర్గం దాన్ని తొలగించుటకు, దోమల పెరుగుదలను అరికట్టేందుకు పట్టణ పరిధిలో ఉన్న అన్ని మేజర్ డ్రైనేజీలు డీసిల్టేషన్ చేయించవలసిందిగా నిర్ణయించి ఉన్నారు. దీనిలో భాగంగా బిపిఎస్ 2019 మరియు ఎల్ఆర్ఎస్ 2020 నియమాలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం పట్టణానికి కేటాయించిన 44.59 లక్షల నిధులతో పలు విడతలుగా కాలువ పూడిక తీసివేత ప్రారంభించి ఉన్నారు. ఇందులో భాగంగా గత రెండు రోజులుగా పట్టణంలోని వివిధ వార్డుల యందు అనగా అంబేద్కర్ కాలనీ, శృంగారపు వనం, పల్నాడు రోడ్డు మెయిన్ డ్రైనేజీ, మార్కాపురం రోడ్డు మెయిన్ డ్రైన్ డబ్బా స్తంభం సెంటర్,కోట్నాల్స బజార్ మొదలగు ప్రాంతాల్లో డీసిల్టేషన్ పనులు మొదలుపెట్టి ఉన్నారు. ఈ పనులను మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ , మున్సిపల్ ఇంజనీర్ ఆదినారాయణ మరియు శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ తదితరులు పర్యవేక్షిస్తూ పట్టణ ప్రజలు మరియు వ్యాపారస్తులు డీసిల్టేషన్ చేసే సమయంలో డీసిల్టేషన్ సిబ్బందికి సహకరించాలని ఎటువంటి అడ్డంకులు ఉన్న తొలగించాలని తగు సూచనలు ఇవ్వడం జరిగింది.
Trending
- ఎడ్లపాడు మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఆదివాసీల ఆరాధ్య దైవం భగవాన్ బిర్సా ముండా గారి 150వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డది.
- సంబరాలు చేసుకుంటున్న భారతీయ జనతా పార్టీ చిలకలూరిపేట నాయకులు
- చిలకలూరిపేట నియోజవర్గ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరిగిన గ్రీవెన్స్ లో పాల్గొన్న బిజెపి బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు
- చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కార వేదిక లొ పిర్యాదుల వెల్లువ
- వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పాల్గొన్న చిలకలూరిపేట బిజెపి నాయకులు
- గణపవరం గ్రామంలో బిజెపి మండల ప్రవాస్ యోజన కార్యక్రమం
- రూరల్ మండలాల్లో బిజెపి మండల ప్రవాస్ యోజన కార్యక్రమం
- చిలకలూరిపేట బిజెపి ఆధ్వర్యంలో మండల ప్రవాస్ యోజన కార్యక్రమం



