నేరాల నియంత్రణే ధ్యేయంగా కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు…. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్…
పల్నాడు జిల్లా నరసరావు పేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి నందు శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించి ప్రజలకు మేమున్నాము అనే భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు.
పమిడిమర్రు గ్రామంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా శ్రీ ఎస్పీ గారి ఆదేశాల మేరకు కార్డెన్ & సెర్చ్ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నందు రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్, పాత కేసుల్లోని నిందితులపై ప్రత్యేక నిఘా ... ఇళ్లు, పరిసర ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీ లలో సరైన పత్రాలు లేని 63 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలు, గొడ్డళ్లు, కర్రలు, పలుగులు మారణాయుధాలు స్వాధీనపర్చుకోవడమైనది.
ఫుట్ పెట్రోలింగ్, గ్రామస్తులతో సమావేశాలు నిర్వహించి వివిధ అంశాలపై అవగాహన చేశారు.
అంతేకాకుండా… రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్, అనుమానితులు మరియు పాత కేసుల్లోని నిందితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
గ్రామంలో నాటు సారా, గుట్కా నియంత్రణ కోసం అనుమానితుల/ పాత కేసుల్లోని నిందితుల ఇళ్లల్లో… పశువుల పాకలు, గడ్డి వాము ప్రాంతాలు, దుకాణాలు, బడ్డీ కొట్లలో క్షుణ్ణంగా తనిఖీలు కొనసాగించారు.
అక్రమ మద్యం జోలికి వెళితే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.
పాత కేసుల్లో నిందితుల తో సమావేశమై పాత పంథా కొనసాగించకుండా సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ పసుపులేటి రామకృష్ణ , రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై కిషోర్, నరసరావుపేట ఒకటవ పట్టణ సిఐ పోలీస్ స్టేషన్ MV.చరణ్ , నరసరావుపేట ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్సై వంశీకృష్ణ , నరసరావుపేట రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ హైమా రావు , నరసరావుపేట రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ ఐ అశోక్ , చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అనిల్ , రొంపిచర్ల ఎస్సై మణి కృష్ణ ,ANS RI యువ రాజ్ మరియు ANS సిబ్బంది మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలపై ఉక్కు పాదం మోపండి! ..లోక్ సత్తా పార్టీ రాష్ట్ర నాయకులు మాదాసు భాను ప్రసాద్..
తెనాలిలో గంజాయి మత్తులో పోలీస్ కానిస్టేబుల్ పై దాడి సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఇకనైనా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్టమైన చర్యలను తీసుకొని నేరాలు జరగకుండా చూడాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మాదాసు భాను ప్రసాద్ కోరారు.
గంజాయి మత్తులో పోలీస్ కానిస్టేబుల్ పై రౌడీ షీటర్ అనుచరులు చేసిన దాడిని మాత్రమే డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకుంటే సరిపోదని, గంజాయి ఇతర మత్తు పదార్థాల వలన నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని అనేక కుటుంబాలు నరకయాతన అనుభవిస్తున్నాయని విషయాన్ని గుర్తించి, గంజాయి క్రయవిక్రయాలను జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.



