ఘనంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 102 వ జయంతి వేడుకలు
చిలకలూరిపేట: మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలువేసిఘననివాళులర్పించారు అనంతరం నెహ్రు నగర్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాన నివాళులర్పించారు, అనంతరం ఎన్ ఆర్ టి. సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు, అనంతరం 27వ వార్డులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కానీ విశ్వనాథ్ సెంటర్లో కేక్ కట్ చేసి ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ముప్పాళ్ళ హనుమంతరావు , మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నెల్లూరీ సదాశివరావు మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, మున్సిపల్ ప్రతిపక్ష మాజీ నాయకుడు జమాల్ బాషా, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఎస్ఎస్ సుభాని, తూబాటి శ్రీహరి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు దగ్గు మల్లి సాంబశివరావు, అబ్దుల్ మజీద్, షేక్ అజారుద్దీన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నజురునిసా బేగం, కౌన్సిలర్లు జంగా సుజాత, కునాల ప్రమిల,బేరింగ్ మౌలాలి,నల్లమోతు సాంబశివరావు, మాజీ కౌన్సిలర్ మారుబోయిన శ్రీనివాసరావు, జానీ మేస్త్రి.ఐటీడీపీ పట్టణ అధ్యక్షుడు అమరామణి. ఐ టీడీపీ ప్రధాన ప్రధాన కార్యదర్శి మహమ్మద్ రఫీ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు గట్టుపల్లి మాణిక్యాలరావు, ఫ్రాన్సిస్,బడే మియా ,దాసు,బొల్లయ్య,
రూరల్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలి, పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు,నాయకులు వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర జిల్లా పట్టణ మహిళా నాయకులు పాల్గొని ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం విజయవంతం చేశారు.



