ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి గారు ఆ క్రమంలో గుంటూరు అభివృద్ధి కోసం నిధులు కేటాయించగా ఆ అభివృద్ధి ఫలాలలో భాగమైన గుంటూరు లో కేంద్రప్రభుత్వ నిధులు సుమారు 200కోట్ల రూపాయలు తో గుంటూరు నగరానికే తలమనికం అయినా శంకరవిలాస్ బ్రడ్జి నిర్మాణం కోసం కేటాయించి శంకుస్థాపన కార్యక్రమం సందర్బంగా కాంట్రాక్టర్ న్యూస్ పేపర్స్ లో ఇచ్చిన యాడ్స్ లో బీజేపీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి ఫోటో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెసిడెంట్ దగ్గుబాటి పురందేశ్వరి గారి ఫోటో లు లేకుండా యాడ్స్ ఇచ్చిన లక్ష్మి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కాంటాక్ట్ వెంటనే రద్దు చేసి బె షరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గ కో కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు
Author: chilakaluripetalocalnews
జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధన సందర్భంగా పులిహార, మజ్జిగ , పంపిణీ చేసిన మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు – చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం జయ జయ సాయి ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ పూసపాటి బాలాజీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఈరోజు జగద్గురు కాలజ్ఞానకర్త భూత భవిష్యత్ వర్తమానాలను ప్రపంచానికి కొన్ని వందల సంవత్సరాల క్రితమే తెలియజేసిన శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధన సందర్భంగా ఈరోజు పట్టణంలో గడియార స్తంభం సెంటర్ దగ్గర ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరి బాబు గారు పాల్గొని భక్తులకు ప్రజలకు పులిహారన్న ప్రసాదము మజ్జిగ పంపిణీ చేశారు అనంతరం వీరబ్రహ్మేంద్రస్వామి వారి స్టిక్కర్లను ఆవిష్కరించి భక్తులకు అందజేశారు, ఆయన మాట్లాడుతూ గొప్ప ఆధ్యాత్మిక సామాజిక సేవా సంఘసంస్కర్త శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారు అని…
రాధా రంగా మిత్ర మండలి చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్ గా అచ్చు కోల మురళీకృష్ణ నిమయక పత్రం అందించిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రెసిడెంట్ జనసేన నాయకులు చలికొండ ధర్మారావు (బుల్లెట్ ధర్మారావు)రాష్ట్ర కాపు సంఘ కమిటీ గోవింద్ శంకర్రావురావు ఆధ్వర్యంలో అచ్చు కోల మురళీకృష్ణ కి ఇస్తూ ఆయన మాట్లాడుతూ నియోజకవర్గానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని అలాంటి వారికి నిమయక పత్రం ఇవ్వటం ఎంతో సంతోషకరమని చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ అచ్చుకోల మురళీకృష్ణ కి కృషితో సేవా కార్యక్రమాలు అందరికీ సుపరిచితురుల పనిచేస్తూ అందరిలో కలిసిపోయే వారి తత్వం కలిగిన వారు అందరూ ఎన్నంట ఉండి పనిచేసేవారు వారికి నిమాయక పత్రం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. రాధా రంగా మిత్రమండలి చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్ అర్చకుల మురళీకృష్ణ మాట్లాడుతూ రాధా రంగ…
చిలకలూరిపేట నియోజకవర్గం, నాదెండ్ల మండలం, కనపర్రు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు షేక్ బషీర్ గారి సోదరుడు షేక్ షమీర్ గారి కుమారుని బారసాల కార్యక్రమానికి హాజరై, ఆ చిన్నారిని ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు… ఈ వేడుకలో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరి సదాశివరావు గారు, బండారుపల్లి సత్యన్నారాయణ గారు, జవ్వాజి మదన్ గారు, సింగయ్య గారు, జయప్రసాద్ గారు, మరియు మండల, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు…
పలనాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్ జి మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువకులం పాదయాత్రలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మెడికల్ సీట్లు అమ్ముకుంటుందని, ఫీజు రీయింబర్స్మెంట్ చేయకుండా విద్యార్థులకు ఇబ్బందులు పెడుతున్నదని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని ఆనాడు లోకేష్ విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వంద రోజుల్లో అన్ని హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చిన నేటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీలను గాలికి వదిలేసారని ఆయన దుయ్యబట్టారు. కూటం ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటి సంవత్సరమైనా ఇంతవరకు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వచ్చే నెల…
చిలకలూరిపేట పట్టణ నూతన ఎస్ఐగా పి హాజరత్తయ్య గారు బాధ్యతలు చేపట్టారు. అనంతరం మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేశారు, ఈ సందర్బంగా హాజరత్తయ్య గారిని పుల్లారావు గారు అభినందించారు…
గిరిజనుల్లో విప్లవ స్ఫూర్తిని నింపిన అల్లూరి వర్ధంతికి ఘన నివాళి.విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రపటానికి ఘన నివాళి.ప్రజా సంఘాల నాయకులు.చిలకలూరిపేట:గిరిజనుల్లో విప్లవ స్ఫూర్తి రగిలించేటమే కాకుండా వారిలో ఉన్న మూఢవిశ్వాసాలను తొలగింప చేసి ఉద్యమం వైపు నడిపించిన ధీరుడు అల్లూరి సీతారామరాజు అని నాయకులు కొనియాడారు.బుధవారం పట్టణ ములోని యనార్టీ సెంటర్ లో ఉన్న ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి, రవీంద్రనాద్ ఠాకూర్ జయంతిల సందర్భంగా వీరి చిత్ర పాఠాలకు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడు, మన్యం వీరుడు, అగ్గి పిడుగు అల్లూరి సీతారామరాజు మన్యం ప్రజల హక్కుల కోసం, స్వాతంత్య్రం కోసం పోరాడి 27 ఏళ్ల చిన్న వయసులోనే ప్రాణ త్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి అని నాయకులు ఉద్ఘాటించారు. సీతారామరాజు 1897 జులై 4న విశాఖపట్నం జిల్లా పాండ్రంగిలో జన్మించారన్నారని నాయకులు…
చిలకలూరిపేట మున్సిపల్ శాఖ సరికొత్త విన్యాసాలు మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం ఏప్రిల్ నెలలో 30వ తేదీన జరిగిన కౌన్సిల్ తీర్మానం ఐటెం నెంబర్ 9 లో విచిత్ర విన్యాసాలు..పసుమూరు గ్రామ సర్వేనెంబర్ 750/c 754/a 753/e మరియు 753/f నెంబర్ గల అనధికార లేఔట్లలో భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 21 నందు పొందుపరిచిన విధంగా అనధికార లేఔట్లలో ఇల్లు కట్టుకొనుటకు ప్లాన్లు మంజూరు చేయవలసిందిగా కోరుతూ తీర్మానం చేయడం జరిగింది. ఇందులో ఒక విచిత్ర సంఘటన ఏమిటంటే ప్లాట్లు కొన్న యజమానులకు అవి అనాధికార లేఔట్లని తెలియక కొన్నారు అని ఉదాహరించినారు. కౌన్సిల్ తీర్మానం ఏప్రిల్ 30వ తారీకు నా తీర్మానం జరిగితే మరి 754 /a సర్వే నెంబర్ లో ఈరోజు అనగా ఆరు ఐదు 2025వ తారీఖున కూడా సిమెంటు రోడ్లు వేస్తా ఉన్నారు మరి ఇందులో ప్లాట్లు కొనేవారికి ఇది అనధికారాలు లే అవుట్ తెలియకపోవడం ఎంత…
వేసవి సెలవులలో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి … ఏఐఎస్ఎఫ్ డిమాండ్చిలకలూరిపేట : ప్రభుత్వ విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా వేసవికాలంలో పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రైవేటు , కార్పొరేటు విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం చిలకలూరిపేట ఎంఈఓ సుబ్బారావుకు ఎంఈఓ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ వేసవికాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వలన ప్రతి సంవత్సరం విద్యార్థులకు ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటిస్తుంది. కానీ కొన్ని ప్రైవేటు ,కార్పొరేట్ విద్య సంస్థల యాజమాన్యాలు ర్యాంకుల కోసం, అడ్మిషన్స్ పెంచుకోవడం కోసం, డబ్బులను దండుకోవడం కోసం వేసవి సెలవుల్లో కూడా విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులని తరగతి గదులకు పరిమితం చేస్తూ విద్యార్థులకు మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. విద్యా వ్యవస్థలలో చట్టపరమైన చర్యలు కేవలం విద్యాశాఖ అధికారుల వల్లనే జరుగుతుంది. కాబట్టి…
చలివేంద్రాల్లో మాయాజాలం..!?చిలకలూరిపేట: పట్టణ పుర ప్రజల కోసం వేసవికాలం దృష్ట్యా ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు 5 చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని మే 30వ తేదీన జరిగిన కౌన్సిల్ సమావేశం ఏజెండాలో పొందుపరిచారు. ఎన్నార్టీ సెంటర్, కళామందిర్ సెంటర్, అడ్డ రోడ్డు సెంటర్లలో చలివేంద్రాలు మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేశారు. పాత పోలీస్ స్టేషన్, గడియార స్తంభం సెంటర్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయలేదు, ఐదు సెంటర్లలో చలివేంద్రాలుఏర్పాటు చేస్తామని కౌన్సిల్ అజెండాలో పెట్టారు. ఏప్రిల్ 01 తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు చలివేంద్రం ఏర్పాటుకుగాను రూ.4.50 లక్షలు బిల్లు పెట్టారు. దీనిపై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మూడు చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఇంత పెద్ద మొత్తంలో నగదు పెట్టడం ఏంటని పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. సదరు కాంట్రాక్టర్లు వివరణ కోరగా మూడు సెంటర్లలో ఏర్పాటు చేశామని, మరో రెండు సెంటర్లో ఏర్పాటు చేయడానికి అధికారులు ఒప్పుకోలేదన్నారు.…