గిరిజనుల్లో విప్లవ స్ఫూర్తిని నింపిన అల్లూరి వర్ధంతికి ఘన నివాళి.


విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రపటానికి ఘన నివాళి.

ప్రజా సంఘాల నాయకులు.
చిలకలూరిపేట:గిరిజనుల్లో విప్లవ స్ఫూర్తి రగిలించేటమే కాకుండా వారిలో ఉన్న మూఢవిశ్వాసాలను తొలగింప చేసి ఉద్యమం వైపు నడిపించిన ధీరుడు అల్లూరి సీతారామరాజు అని నాయకులు కొనియాడారు.బుధవారం పట్టణ ములోని యనార్టీ సెంటర్ లో ఉన్న ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి, రవీంద్రనాద్ ఠాకూర్ జయంతిల సందర్భంగా వీరి చిత్ర పాఠాలకు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడు, మన్యం వీరుడు, అగ్గి పిడుగు అల్లూరి సీతారామరాజు మన్యం ప్రజల హక్కుల కోసం, స్వాతంత్య్రం కోసం పోరాడి 27 ఏళ్ల చిన్న వయసులోనే ప్రాణ త్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి అని నాయకులు ఉద్ఘాటించారు. సీతారామరాజు 1897 జులై 4న విశాఖపట్నం జిల్లా పాండ్రంగిలో జన్మించారన్నారని నాయకులు అన్నారు. 9వ తరగతి వరకు చదివిన అల్లూరి.. సంస్కృతం, జోతిష్యశాస్త్రం, జాతక శాస్త్రం, విలువిద్య, గుర్రపు స్వారీలో ప్రావీణ్యం పొందారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తిగా పోరాటాలు కొనసాగిస్తామని నాయకులు తెలిపారు. 1924 మే 7న కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చొని, ఒక పశువుల కాపరి ద్వారా తనున్న చోటును పోలీసులకు అల్లూరి కబురు పంపారు.ఏటి ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి రాజునుబంధించారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద రాజును హాజరు పరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామ రాజును ఒక చెట్టుకు కట్టివేసి ఏ విచారణ లేకుండా గుడాల్ కాల్చి చంపారు.తన తల్లికి రాజు మరణ వార్తను తెలియజేయలేదు. మే 8 న రాజు దేహాన్ని ఫొటో తీయించిన తరువాత దహనం చేశారని పేర్కొన్నారు. అతని చితా భస్మాన్ని సమీపంలో ఉన్న వరాహ నదిలో కలిపారు. ఆ విధంగా కేవలం 27 ఏళ్ళ వయసులోనే అల్లూరి సీతారామరాజు అమరవీరుడయ్యాడు. కృష్ణదేవిపేట లో అతని సమాధి ఉందని నాయకులు తెలిపారు. రవీంద్రనాథ్ ఠాకూర్ స్వాతంత్ర్య సమరయోధులే కాకుండా అనేక నాటకాలు, రచనలు నవలలు రాశారన్నారు. ఇతను రాసినటువంటి కావ్యాలలో గీతాంజలి కావ్యానికి విశ్వకవి అనే బిరుదు వచ్చిందన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో జన గణ మన అరె గేయాన్ని రచించారన్నారు. ఈ తరం యువత వారి స్ఫూర్తిని మరచిపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి.శ్రీను నాయక్, సలి కినిడి నాగ రాజు,బి.సి నాయకులు పుట్టా వెంకట బుల్లోడు,కంచర్ల శ్రీనివాసరావు, చందవరం హరిప్రసాద్, చరణ్ తేజ. శ్యాముల్ పాల్ తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
Share.
Leave A Reply