చిలకలూరిపేట: పట్టణ పుర ప్రజల కోసం వేసవికాలం దృష్ట్యా ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు 5 చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని మే 30వ తేదీన జరిగిన కౌన్సిల్ సమావేశం ఏజెండాలో పొందుపరిచారు. ఎన్నార్టీ సెంటర్, కళామందిర్ సెంటర్, అడ్డ రోడ్డు సెంటర్లలో చలివేంద్రాలు మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేశారు. పాత పోలీస్ స్టేషన్, గడియార స్తంభం సెంటర్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయలేదు, ఐదు సెంటర్లలో చలివేంద్రాలుఏర్పాటు చేస్తామని కౌన్సిల్ అజెండాలో పెట్టారు. ఏప్రిల్ 01 తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు చలివేంద్రం ఏర్పాటుకుగాను రూ.4.50 లక్షలు బిల్లు పెట్టారు. దీనిపై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మూడు చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఇంత పెద్ద మొత్తంలో నగదు పెట్టడం ఏంటని పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. సదరు కాంట్రాక్టర్లు వివరణ కోరగా మూడు సెంటర్లలో ఏర్పాటు చేశామని, మరో రెండు సెంటర్లో ఏర్పాటు చేయడానికి అధికారులు ఒప్పుకోలేదన్నారు. చలివేంద్రాల్లో మంచినీరు పోసే వ్యక్తికి రూ.300 వందలు రోజువారిగా అందజేస్తున్నామని పేర్కొన్నారు.గత వైసీపీ ప్రభుత్వంలో 6 చలి వేంద్రాలకు రూ.1.50లక్షల కు చలి వేంద్రాలు ఏర్పాటు చేశారు.దీనికి బిన్నంగా కౌన్సిల్ అజెండాలో పొందుపరిచే విధంగా సదరు కాంట్రాక్టర్ కు ఐదు చదివేంద్రాలకు నగదు ఏర్పాటు చేస్తారా.. మూడు చలివేంద్రాలకు మాత్రమే బిల్లు ఇస్తారా… ఒక్కొక్క చలివేంద్రాలకు ఎన్ని మంచి నీటి క్యాన్లు తీసుకొస్తున్నారనేది దీనికి లెక్క, పత్రాలు రాసుకుటుంన్నారా లేద అనేది అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపైన అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.
Trending
- భోగిపండ్లు పోయడం వెనుక ఆచారం చాలా ఆసక్యంగా ఉంటుంది.
- వైసీపీ నేతలు దహనం చేయాల్సింది జీవోలు కాదు.. తమలోని విద్వేష లక్షణాలు.. వినాశనకర ఆలోచనల్ని: ప్రత్తిపాటి
- భోగి పండగ గురించి
- చిలకలూరిపేట అగ్ని హర్షిదాతు ఎం.ఎస్.ఎం.ఈ పార్కుకు ఆమోదం : జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా.
- బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు
- పల్నాడు జిల్లా…. జనతా వారిది కార్యక్రమంలో సమస్యలతో వచ్చిన బాధితులను తీసుకొని పరిష్కార దిశగా జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అధికారులను కలవడం జరిగింది
- ఘనంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహించిన బిజెపి నాయకులు
- సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహించిన చిలకలూరిపేట బిజెపి పార్టీ



