జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధన సందర్భంగా పులిహార, మజ్జిగ , పంపిణీ చేసిన మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు – చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం జయ జయ సాయి ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ పూసపాటి బాలాజీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఈరోజు జగద్గురు కాలజ్ఞానకర్త భూత  భవిష్యత్ వర్తమానాలను ప్రపంచానికి కొన్ని వందల సంవత్సరాల క్రితమే తెలియజేసిన శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధన సందర్భంగా ఈరోజు పట్టణంలో గడియార స్తంభం సెంటర్ దగ్గర ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరి బాబు గారు పాల్గొని భక్తులకు ప్రజలకు పులిహారన్న ప్రసాదము మజ్జిగ పంపిణీ చేశారు అనంతరం వీరబ్రహ్మేంద్రస్వామి వారి స్టిక్కర్లను ఆవిష్కరించి భక్తులకు అందజేశారు, ఆయన మాట్లాడుతూ గొప్ప ఆధ్యాత్మిక సామాజిక సేవా సంఘసంస్కర్త శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారు అని అనేక మహిమలు చూపి ప్రజలకు తత్వ జ్ఞానబోధలు చేసిన తపోసంపన్నులని తెలియజేశారు, ట్రస్ట్ చేస్తున్న ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను ప్రశంసించారు, మరో అతిథిగా కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి పాల్గొని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ముస్లిం మతస్థుడైన సిద్దయ్యను, మాదిగ కులస్తుడైన కక్కయ్యను చేరదీసి , కుల మతాలకు అతీతంగావారికి ఆత్మ బోధను చేశారని తెలిపారు, ఈ కార్యక్రమంలో పట్టణ పుర ప్రముఖులు జంపని భాస్కరరావు, రిటైర్డ్ ఎండోమెంట్ ఆఫీసర్ కారుమంచి శివరావు, రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ జిసి పెంచలయ్య, గోగినేని నాగేశ్వరరావు, తుర్లపాటి సుబ్బారావు, శానంపూడి ఆంజనేయులు, కొత్తూరి హనుమంతరావు, బహునాథం వెంకటాచారి, కనుమల్లపూడి నాగేశ్వరరావు తదితరులు పాల్గొని భక్తులకు ప్రజలకు పాదచారులకు పులిహార, మజ్జిగ, వీరబ్రహ్మేంద్రస్వామి వారి స్టిక్కర్లను పంపిణీ చేశారు

Share.
Leave A Reply