పలనాడు జిల్లా  చిలకలూరిపేట పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశం




 ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్ జి  మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువకులం పాదయాత్రలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మెడికల్ సీట్లు అమ్ముకుంటుందని, ఫీజు రీయింబర్స్మెంట్ చేయకుండా విద్యార్థులకు ఇబ్బందులు పెడుతున్నదని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని ఆనాడు లోకేష్ విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వంద రోజుల్లో అన్ని హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చిన నేటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీలను గాలికి వదిలేసారని ఆయన దుయ్యబట్టారు. కూటం ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటి సంవత్సరమైనా ఇంతవరకు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వచ్చే నెల నుండి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు  చేపడుతామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు మేకపోతుల నాగేశ్వరరావు, నాయకులు నాయుడు సాయి శ్రీనాథ్, గుడిపల్లి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply