Author: chilakaluripetalocalnews@gmail.com
పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ అరుణ్ బాబు గారు నేడు (04.06.2025) వెల్దుర్తి గ్రామాన్ని సందర్శించి ప్రజా సమస్యల పరిష్కారంపై దాఖలైన ఫిర్యాదుల (PGRS) నాణ్యతను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై గ్రామస్థులతో ప్రత్యక్షంగా చర్చించారు.
విధ్వంస పాలనకు ప్రతిస్పందనగా గత ఏడాది ఇదే రోజు ప్రజా చైతన్యానికి నాంది. చరిత్ర తిరగరాసిన ప్రజా తీర్పు.. గత సంవత్సరం ఇదే రోజున కూటమి ప్రభుత్వం, నన్ను నాలుగవ సారి మీ ఆదరణతో భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీ పంపారు. అది కావటం ఓటు కాదు.. మీ విశ్వాసం, మద్దతు, ప్రేమ, ఆశీర్వాదం! మీ నమ్మకానికి విలువనిచ్చేలా పనిచేయడం నా బాధ్యత, నా కర్తవ్యంగా భావస్తున్నాను. చిలకలూరిపేట నియోజకవర్గం అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడతాను.ప్రతి క్షణం, ప్రతి అడుగు – ప్రజల కోసం, ప్రగతి కోసం..
పాత గవర్నమెంట్ హాస్పటల్ స్థలంలో ప్రభుత్వ చిన్నపిల్లల హాస్పిటల్ నిర్మించాలని ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన నాయకులు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావును కలిసిన ప్రభుత్వ చిన్న పిల్లల హాస్పిటల్ సాధన అఖిలపక్ష కమిటీ సానుకూలంగా స్పందించిన శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట టౌన్ :చిలకలూరిపేట పట్టణంలోని రిజిస్టర్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి పాత గవర్నమెంట్ హాస్పిటల్ స్థలంలో ప్రభుత్వ చిన్నపిల్లల హాస్పిటల్ నిర్మించాలని కోరుతూ హాస్పటల్ సాధన అఖిలపక్ష కమిటీ నాయకులు సోమవారం సాయంత్రం మాజీమంత్రి , శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావును వారి క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షులు టిడిపి సీనియర్ నాయకులు షేక్ జమాల్ బాషా, అధ్యక్షులు చేవూరి కృష్ణమూర్తి, కార్యదర్శి నాయుడు శివకుమార్, కమిటీ నాయకులు పేలూరి రామారావు, నాగభైరు రామసుబ్బాయమ్మ, మాదాసు భాను ప్రసాద్, రిటైర్డ్ ఎక్సైజ్ సీఐ గోరంట్ల నారాయణ యాదవ్, కొప్పురావురి…
జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం నాగార్జునసాగర్ యోగా స్పూర్తి తో వికసించింది. ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకూ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు…
చిలకలూరిపేట వైస్సార్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి తరలివచ్చిన వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు కూటమి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేసిన వైస్సార్సీపీ నాయకులు ర్యాలీలో పాల్గొన్నా మాజీ మంత్రి విడదల రజిని జూన్ 4వ తేదీకి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయినా…. ఇంత వరకు పథకాలు అమలు చేయలేదని,మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. వైస్సార్సీపీ ప్రజల పక్షాన నిలబడి ఉందని… కూటమి నేతల మోసల్ని తిప్పి కొడతామని… రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వ తీరు కు వ్యతిరేకంగా పోరాట కార్యక్రమాలు చేపడతామని విడదల రజిని తెలిపారు. నరసరావుపేట రోడ్ లోని రజిని ఇంటి వద్ద నుంచి ఈ ర్యాలీ బయలుదేరి…. NRT సెంటర్, భాస్కర్ సెంటర్, చౌత్ర, కళామందిర్,గడియార స్తంభం, విశ్వనాద్ సెంటర్ మీదగా తహశీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. చిలకలూరిపేట తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు
పురుగుల మందు తాగి భర్త ఆత్మహత్య ..దూరం పెట్టిందని తీవ్ర మనస్తాపం చిలకలూరిపేట రూరల్ మురికిపూడి విషాదంచోటుచేసుకుంది. పెళ్లైన నెల రోజులకే భార్య తనను దగ్గరకు రానివ్వడం లేదనే తీవ్ర మనస్తాపంతో ఓ భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మురికిపూడి గ్రామంలో జరిగింది.మురికిపూడికి చెందిన బొమ్మన బోయిన వీరాంజనేయులు (23) అదే గ్రామానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నారు. పెళ్లై నెల రోజులు గడుస్తున్నా భార్య తనను దగ్గరకు రానివ్వకపోవడంతో వీరాంజనేయులు తీవ్రంగా కుమిలిపోయేవారు. ఇదే విషయాన్ని పదేపదే గుర్తు చేసుకుంటూ పొలంలోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.పురుగుల మందు తాగిన విషయాన్ని వీరాంజనేయులు తన స్నేహితులకు తెలియజేశారు. వెంటనే వారు వీరాంజనేయులును పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న చిలకలూరిపేట రూరల్ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని మరణ వాంగ్మూలం నమోదు చేసుకున్నారు.తన భార్య మరొక వ్యక్తిని ప్రేమించిన కారణంగా…
ఈజిప్టులో పర్యటిస్తున్న బృందం ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు వ్యూహాత్మక ప్రణాళికతో ప్రపంచ పర్యటన నిర్వహిస్తున్న అఖిలపక్ష బృందాల్లో ఒకటైన సుప్రియా సులే నేతృత్వంలోని బృందం ఈజిప్టులో పర్యటిస్తోంది. ముందుగా కైరోలోని జమాలెక్లోని అల్-హోర్రెయా పార్కులో మహాత్మా గాంధీ గారికి ఈ ప్రతినిధి బృందం నివాళులర్పించింది. ఈ బృందం ఆ దేశంలోని ప్రస్తుత, మాజీ మంత్రులు, ప్రముఖ రచయితలు, సమాజకర్తలు, నాయకులతో సహా ఈజిప్టులోని కీలక సంభాషణకర్తలతో కూడా చర్చలు జరుపుతోంది. ఉగ్రవాద నిరోధకతపై సన్నిహిత ద్వైపాక్షిక సహకారం గురించి వివరిస్తూ, దేశ సహకారాన్ని కోరారు.ఈ బృందంలో :ఎంపీలు.. సుప్రియా సులే, లావు శ్రీకృష్ణ దేవరాయలు, రాజీవ్ ప్రతాప్ రూడీ, మనీష్ తివారీ, అనురాగ్ సింగ్ ఠాకూర్, విక్రమ్జీత్ సింగ్ సాహ్నే, ఆనంద్ శర్మ, వి. మురళీధరన్, సయ్యద్ అక్బరుద్దీన్ (ఐక్యరాజ్యసమితికి భారతదేశ మాజీ శాశ్వత ప్రతినిధి) ఉన్నారు.
నాగర్జునసాగర్ డ్యామ్ కాంగ్రెస్ పార్టీ కట్టిందనో, జవహర్ లాల్ నెహ్రు కట్టాడనో అనుకుంటున్నారు కదూ. కానీ అది పూర్తిగా తప్పు నాగర్జున సాగర్ డ్యామ్ ను నిర్మించింది వల్లుట్ల (గోత్రం) వాసిరెడ్డి గృహనామానికి చెందిన ముక్త్యాల సంస్థానానికి చెందిన శ్రీ రాజా వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ …. వీరి విగ్రహం కూడా ఈ డ్యామ్ పరిసరాల్లో నేటికీ ఉంటుంది. అసలు ఈ డ్యామ్ ను కట్టాలని ఆనాటి ప్రభుత్వానికి ఎంత మాత్రం ఆశక్తి లేదు. రాజా వారు లక్షల ఎకరాలు, కోటి రూపాయల డబ్బు ప్రభుత్వానికి దానంగా ఇచ్చేసరికి చివరికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. మాచర్ల అటవీ ప్రాంతంలో ప్రభుత్వ అధికారులు వెళ్ళడానికి రోడ్డు వేయించారు రాజా వారు. ప్రజలకు మంచి చెయ్యటం కోసం చరిత్రలో ఎన్నో లక్షల ఎకరాల భూములు, ఎంతో సంపదను దానం చేశారు. ముక్త్యాల రాజా అనబడు వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ ఆంధ్రదేశంలో పేరు…
ప్రమాదంలో చనిపోయిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుని కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కు అందజేత.చిలకలూరిపేట, నాదెండ్ల మండలం, గణపవరం గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశ్రీలక సభ్యుడు గజ్జ. శ్రీకాంత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. అతడు జనసేన పార్టీ క్రియా శిలక సభ్యత్వం ఉండటం వలన పార్టీ నుండి ఐదు లక్షల ప్రమాద బీమా చెక్కును వారి కుటుంబ సభ్యులకు సోమవారం మంగళగిరిలోని ఆర్ ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్ వేదికగా ఎమ్మెల్సీ శ్రీ కె .నాగబాబు గారు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో శ్రీకాంత్ కుటుంబ సభ్యులు జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్ గారిని కలిసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగ రాజా రమేష్ మాట్లాడుతూ దేశంలోనే రాజకీయ పార్టీల కార్యకర్తల బాగోగులు గురించి ఆలోచించే పార్టీ జనసేన అని…









