కొండవీడులో మొహర్రం ఉత్సవాల్లో పాల్గొన్న ప్రత్తిపాటి
- పీర్ల ఊరేగింపు ప్రారంభించిన ఎమ్మెల్యే
మొహరాన్ని పురస్కరించుకొని యడ్లపాడు మండలం కొండవీడులో చేపట్టిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పాల్గొన్నారు. త్యాగానికి ప్రతీక అయిన మొహరం వేడుకలు ముస్లింలకు అత్యంత ముఖ్యమైనవని ప్రత్తిపాటి చెప్పారు. మొహమ్మద్ ప్రవక్త మనవడు హుస్సేనీ ఆత్మత్యాగానికి గుర్తుగా ముస్లిం సోదరులు జరుపుకునే సంతాప కార్యక్రమాల్లో భాగమైన పీర్ల ఊరేగింపును ప్రత్తిపాటి ప్రారంభించారు. ఊరేగింపును జాగ్రత్తగా గమనించాలని, పూర్తయ్యేవరకు ఎక్కడా ఎలాంటి ఘటనలు లేకుండా చూడాలని స్థానిక పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, కామినేని సాయిబాబు, బండారుపల్లి సత్యనారాయణ, పలువురు గ్రామ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.



