హామీల అమలు, రాష్ట్రాభివృద్ధే చంద్రబాబు ధ్యేయం : ప్రత్తిపాటి.

  • జగన్ లా దొంగబటన్లు నొక్కడం.. ప్రజల్ని మోసగించడం..కూటమిప్రభుత్వం చేయదు.
  • బీహార్లో రూ.400 పింఛన్ ఇస్తుంటే, చంద్రబాబు రూ.4వేలు ఇస్తున్నారు.
  • నమ్మిన ప్రజల్ని దోచుకోవడంతప్ప మాజీ అవినీతిమంత్రి ఏంచేశారు : ప్రత్తిపాటి.
  • కాస్త ఆలస్యమైనా చంద్రబాబు ప్రజలందరికీ సంక్షేమం అందిస్తారు : ఎంపీ లావు

దేశం గర్వించే నాయకుడు చంద్రబాబని, ప్రజల సంక్షేమం.. రాష్ట్రాభివృద్ధి తప్ప ఆయనకు మరో ఆలోచన ఉండదని ప్రత్తిపాటి స్పష్టంచేశారు. ఎన్ని ఆర్థిక సమస్యలున్నా.. రాష్ట్రాన్ని గత పాలకులు పూర్తిగా లూఠీ చేసినా దేశంలో ఏ ప్రభుత్వం అమలుచేయని పథకాలు ముఖ్యమంత్రి అమలుచేస్తున్నారన్నారు. పట్టణంలోని 6,7,9 వార్డుల్లో సుపరిపాలనలో తొలి అడుగు : ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి, ఎంపీ కృష్ణదేవరాయలు పాల్గొన్నారు. 9వ వార్డులో మున్సిపల్ శాఖ పరిధిలో రూ.40లక్షలతో నిర్మిస్తున్న వెహికల్ షెడ్ నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించిన అనంతరం ఇరువురూ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు.

జగన్ లా దొంగబటన్లు నొక్కి.. కూటమిప్రభుత్వం ప్రజల్ని మోసగించదు

దేశంలో రూ.4వేల పింఛన్ ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కడేనని, బీహార్లో కేవలం 400 లు మాత్రమే ఇస్తున్నారని ప్రత్తిపాటి పేర్కొన్నారు. జగన్ అందరికీ అమ్మఒడి ఇస్తానని చెప్పి మోసగించాడని, కానీ చంద్రబాబు ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం సాయం అందిస్తున్నాడన్నారు. జగన్ లాగా దొంగబటన్లు నొక్కడం.. ప్రజల్ని మోసగించడం ఈ ప్రభుత్వం చేయదని ప్రత్తిపాటి స్పష్టంచేశారు. త్వరలోనే అన్నదాతా సుఖీభవ కింద రైతులకు కూడా ఆర్థిక సాయం చేయనున్నారని, అలానే నిరుద్యోగభృతి కూడా అందుతుందన్నారు. జగన్ ఖజానా ఖాళీచేసినా చంద్రబాబు ప్రజల సంతోషం కోసం ప్రతి హామీని నెరవేరుస్తున్నాడని ప్రత్తిపాటి చెప్పారు.

ఇళ్లలో లేకుంటే..వాటిని ఇతరులకు కేటాయిస్తాం.

పేదలకోసం కట్టిన టిడ్కో ఇళ్లను వచ్చే నెలలో వారికి కేటాయించబోతున్నామని, ఇళ్లు పొందిన వారు కచ్చితంగా నివాసముండాలని, అలా లేకుంటే వారికిచ్చిన ఇళ్లు రద్దుచేసి, ఇతరులకు కేటాయిస్తామని ప్రత్తిపాటి తెలిపారు. అసంపూర్తిగా 1008 ఇళ్లను పూర్తిచేయడానికి కూడా ప్రభుత్వం నిధులు మంజూరుచేసిందన్నారు. గతంలో తానే కొందరికి ఇళ్లపత్రాలు, తాళాలు అందించానన్నారు.

నమ్మిన ప్రజల్ని దోచుకోవడం తప్ప.. మాజీ అవినీతిమంత్రి చేసిందేమీ లేదు

తానెవరో తెలియకపోయినా, నమ్మి గెలిపించిన ప్రజల్ని దోచుకోవడం తప్ప.. మాజీ అవినీతి మంత్రి నియోజకవర్గానికి.. ప్రజలకు చేసిందేమీ లేదని ప్రత్తిపాటి చెప్పారు. గత పాలకులు క్షేత్రస్థాయిలో కంటే సోషల్ మీడియా.. ప్లెక్సీల్లో బాగా పనిచేశారని ప్రత్తిపాటి ఎద్దేవాచేశారు. తాను రూ.4వేలకోట్లతో చిలకలూరిపేటను అభివృద్ధిచేస్తే, గత పాలకులు ఐదేళ్లలోనే తన కష్టం మొత్తాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారన్నారు. ఈ ఏడాదిలో వేగంగా బైపాస్ నిర్మాణం పూర్తి చేయించానని, అమృత్ పథకం కింద ప్రజలకు 50 ఏళ్లపాటు తాగునీటి సమస్య లేకుండా పనులు చేయిస్తున్నట్టు ప్రత్తిపాటి చెప్పారు.

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు లోకేశ్ తప్పక ఉపాధి కల్పిస్తారు…

ఆటోనగర్ ను ఏర్పాటుచేసిందేటీడీపీ అని, దాన్ని అభివృద్ధి చేసి కార్మికులకు న్యాయం చేస్తానని ప్రత్తిపాటి హామీ ఇచ్చారు. చీరాల బైపాస్ నిర్మాణం.. ప్రభుత్వాసుపత్రి… ముస్లిం విద్యార్థినుల కోసం రూ.20కోట్లతో మైనారిటీ పాఠశాల,.. కొండవీడు కోట ఘాట్ రోడ్ తో ఇతర అభివృద్ధి పనులు చేసింది టీడీపీ ప్రభుత్వం తానేనని ప్రత్తిపాటి తెలిపారు. పీ-4లో భాగంగా బంగారు కుటుంబాల కింద పేదల్ని ఆదుకోవడానికి చంద్రబాబు కృషిచేస్తున్నారన్నారు. పెట్టుబడులు..పరిశ్రమలు వస్తే యువతకు ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయని, మంత్రి లోకేశ్ నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పించే తీరతారని ప్రత్తిపాటి స్పష్టంచేశారు. ఇప్పటికే ఇచ్చిన మాటప్రకారం మెగా డీఎస్సీతో 16వేల టీచర్ పోస్టుల భర్తీ చేశారన్నారు.

పనిచేసే ప్రభుత్వంలో ప్రజలకు ఇబ్బందులు ఉండవు : ఎంపీ లావు

చంద్రబాబు నాయకత్వంలో పనిచేసే ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, కాస్త ఆలస్యమైనా అందరికీ సుపరిపాలన… అందరి సంతోషమే లక్ష్యంగా ప్రభుత్వ ఫలాలు అందుతాయని ఎంపీ లావు కృష్ణదేవరాయలు తెలిపారు. తల్లికి వందనం డబ్బులు పడని వారు ఆందోళన చెందాల్సిన పనిలేదని, 10వ తేదీ తర్వాత రెండోవిడత నిధులు జమ చేయనున్నారని, అప్పుడు కూడా రాకపోతే సమస్యల పరిష్కారానికి స్థానిక సచివాలయాల్ని సంప్రదించాలని ఎంపీ సూచించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు నెల్లూరి సదాశివరావు, షేక్ టీడీపీ కరీముల్లా, పఠాన్ సమాధ్ ఖాన్, జవ్వాజి మధన్ మోహన్, మద్దుమలా రవి, కందుల రమణ, గంగా శ్రీనివాసరావు, ఇనగంటి జగదీష్, షేక్ బాజీ, ఏలూరి తిరుపతయ్య, అరె మల్లి, వార్డు నాయకులు, తెలుగు మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply