ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో త్వరలో పేట నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి రానున్న హెల్త్ చెక్ అప్ ATM , ప్రత్తిపాటి పుల్లారావు పై పలువురు ప్రముఖుల ప్రశంసలు
చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రజలందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో మాజీ మంత్రి వర్యులు, స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో DHOS (దండమూడి హెల్త్ ఆఫీస్ సర్వీసెస్) హెల్త్ చెక్ అప్ ATM యంత్రాన్ని త్వరలో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు.15 లక్షల రూపాయల వ్యయంతో కూడిన ఈ యంత్రం ద్వారా 43 రకాల ఆరోగ్య పరీక్షలను చేసి, నివారణా చర్యలను కూడా నిపుణులు సూచించే విధంగా , త్వరలో ప్రత్తిపాటి గార్డెన్ నందు ఈ యంత్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ యంత్రం ద్వారా షుగర్ రాండమ్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్, బీపీ, హార్ట్ బీట్, ఆక్సిజన్ లెవెల్స్ చెకప్, BMI పరీక్ష,డిజిటల్ హెల్త్ రిపోర్ట్ వంటి అధునాతన పరీక్షలను తక్కువ సమయంలో,తక్కువ ఖర్చుతో పేద ప్రజలకు అందించనున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడం, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, రోగాలను త్వరగా గుర్తించడం వంటి సేవలే లక్ష్యంగా ఈ బృహత్తర యంత్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.
DHOS యంత్ర పనితీరును సందర్శించి, ప్రత్తిపాటి సేవలను ప్రశంసించిన పలువురు ప్రముఖులు
DHOS హెల్త్ చెక్ అప్ ATM యంత్రాన్ని పలువురు ప్రముఖులు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా యంత్ర పనితీరును పరిశీలించిన ప్రతీ ఒక్కరూ ప్రత్తిపాటి పుల్లారావు గారి సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. అతి తక్కువ సమయంలో 43 రకాల పరీక్షలను చేయడం, అలాగే ఆ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను నిముషాల వ్యవధిలో అందించే ఇటువంటి అధునాతన యంత్రాన్ని ఏర్పాటు చేసిన ప్రత్తిపాటి పుల్లారావు అభినందనీయుడని DSP నాగేశ్వరరావు తెలిపారు. అలాగే మాజీ శాసన సభ్యురాలు డాక్టర్ కందిమళ్ల జయమ్మ, తహసీల్దారు హుస్సేన్, పట్టణ c.i P.రమేష్, రూరల్ c.i B. సుబ్బా నాయుడు, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ముద్దన రమేష్, రాష్ట్ర పార్టీ డాక్టర్స్ సెల్ ఉపాధ్యక్షులు డాక్టర్ ముప్పాళ్ల హనుమంతరావు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ చిగురుపాటి రామారావు, ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ రామకృష్ణ , ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, న్యూట్రిషనిస్ట్ మారెళ్ల ఇందిర తదితరులు యంత్రాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు. ఈ సేవలను త్వరలో ప్రత్తిపాటి గార్డెన్ నందు ఏర్పాటు చేయబోతున్నట్లు హెల్త్ క్యాంపుల ఆర్గనైజర్ కంచర్ల శ్రీనివాసరావు తెలిపారు.



