వ్యాపారులారా, ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ పేరుతో మోసగాళ్ల బారిన పడకండి

మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు

చిలకలూరిపేటలో కొందరు మోసగాళ్లు మున్సిపల్ కమిషనర్ పేరుతో ఫోన్‌లు చేసి వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ట్రేడ్ లైసెన్స్‌ల రెన్యూవల్ చేసుకోవాలని, లేనిపక్షంలో దుకాణాలను సీజ్ చేస్తామని చెప్పి భయపెడుతున్నారు. చాలా మంది వ్యాపారులు ఈ బెదిరింపులకు భయపడి, వారు సూచించిన నంబర్‌కు ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపిస్తున్నారు.
ఈ విషయం మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు దృష్టికి రావడంతో ఆయన తీవ్రంగా స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక

మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు మీడియాతో మాట్లాడుతూ, ట్రేడ్ లైసెన్స్ చెల్లించాలని 9121097923 నంబర్ నుండి వచ్చే ఫోన్ కాల్స్‌ను నమ్మవద్దని, వాటికి స్పందించవద్దని సూచించారు. ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చేయించుకోవాలని, మధ్యవర్తులను లేదా తన పేరుతో వచ్చే ఫోన్ కాల్స్‌ను నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు.ఇలాంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే వెంటనే పోలీసులకు ఫి

Share.
Leave A Reply