నాయకులకు, అధికారులకు కృతజ్ఞతలు, శుభాకాంక్షలు: మాదాసు భాను ప్రసాద్

పట్టణాన్ని సుందరంగా, రహదారులను సౌకర్యవంతంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత!!

పట్టణంలో లోక్ సత్తా పార్టీ నాయకులు మాదాసు భాను ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ తొలి ఏకాదశి, మొహరం శుభాకాంక్షలు తెలియజేశారు. అందరు భక్తిశ్రద్ధలతో, సంతోషంగా పండుగలను జరుపుకోవాలని ఆయన కోరారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగిందని తద్వారా ప్రజలకు సేవలు చేరువ చేయుటకు వీలు కుదురుతుంది అని అన్నారు. యువత ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉండి అవకాశాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఫ్లెక్సీలను తొలగించడం వలన ప్రజల రాకపోకలకు సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు. పోలీసు యంత్రం సీసీ కెమెరాల సాంకేతికతను సద్వినియోగం ఉపయోగించి నేరాలను, రోడ్డు ప్రమాదాలను అరికట్టాలంటే సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్న ప్రధాన కూడళ్ళలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది అని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కొరకు, సమస్య పరిష్కారానికి కృషిచేసిన జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమీషనర్, ముఖ్యంగా శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Share.
Leave A Reply