పసుమర్రు లో దొంగలు హల్ చల్ నివాసగృహల్లో చోరీ… బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లిన దుండగులు ఘటన స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు చెపట్టిన SI అనీల్ చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామ నివాసి, ఎలగాల అనసూయమ్మ భర్త పున్నయ్య 52 సంవత్సరాలు C/ యాదవ, Dt.06/05/2025 న ఉదయం 10 గంటల సమయంలో తన బంధువుల ఇంటికని వేల్చూరుకు వెళ్లి తిరిగి 11/05/2025. రాత్రి సుమారు 9 గంటల సమయానికి ఇంటికి రాగా ఇంటి తలుపులు పగలగొట్టి బీరువాలో బంగారు వస్తువులు మరియు, ఇంట్లోని సామాన్లు, రాగి బిందెలు రెండు, రాగి చెంబు ఒకటే ఇత్తడిచెంబు ఒకటి, వెండి గ్లాసు ఒకటి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తాను ఇంటిలో లేని సమయంలో చూసి. దొంగిలించుకుని పోయిన విషయానికి గాను ఇచ్చిన రిపోర్ట్ మేరకు చిలకలూరిపేట రూరల్ ఎస్సై జి. అనిల్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Author: chilakaluripetalocalnews@gmail.com
వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అరెస్టులు సక్రమమా…. చట్టప్రకారం ఇప్పుడు చేసేవి అక్రమమా? : టీడీపీనేతలు చిలకలూరిపేట నియోజకవర్గంలో రజనీ చేసిన అవినీతి, ప్రజలకు చేసిన మంచిపై ఆమె బహిరంగ చర్చకు రావాలన్న టీడీపీనేతలు ఏ నోటీసులు ఇచ్చి గతంలో చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేశారో రజనీ చెప్పాలి : షేక్ కరిముల్లా (టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి) తప్పుడు పనులు చేసిన వారిని కాపాడేందుకు మాజీమంత్రి రజనీ ప్రయత్నించడం సిగ్గుచేటని, వైసీపీ ప్రభుత్వం గతంలో ఏ నిబంధనల ప్రకారం తప్పుచేయని టీడీపీ నేతల్ని అన్యాయంగా అరెస్ట్ చేసిందో రజనీ చెప్పాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ కరిముల్లా ప్రశ్నించారు. మాజీముఖ్యమంత్రి అని కూడా చూడకుండా చంద్రబాబు అరెస్ట్ సమయంలో వైసీపీ ఎంత నిరంకుశత్వంగా వ్యవహరించిందో రాష్ట్ర ప్రజానీకం చూసిందన్నారు. పల్నాడు జిల్లా ఆత్మకూరుకు వెళ్లకుండా చంద్రబాబును అడ్డుకొని ఆయన ఇంటి గేటుకు తాళాలు వేయించింది మీరు కాదా అని కరిముల్లా…
చిలకలూరిపేట పట్టణం, పురుషోత్తపట్నం నందు ఈరోజు ఉదయంఆశ రక్షక ప్రసాద్(51) మృతిచెందగా అక్కడకి విచ్చేసి వారి పార్థివ దేహానికి ఘన నివాళులర్పించిన మాజీ మంత్రివర్యులు, చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు, ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తోట రాజా రమేష్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఇనగంటి జగదీష్ గారు, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్ గారు, గట్టి నేనీ రమేష్ గారు, తోట బ్రహ్మ స్వాములు గారు పలువురు నివాళులర్పించారు.
చిలకలూరిపేట పట్టణం, ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, 20వ వార్డు అధ్యక్షులు మద్ది శివశంకర గుప్తా గారు ఇటీవల మృతి చెందగా ఈరోజు పెద్దకర్మ కార్యక్రమం సందర్భంగా అక్కడికి విచ్చేసి ఘన నివాళులర్పించిన మాజీ మంత్రివర్యులు, చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఇనగంటి జగదీష్ గారు, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్ గారు, గట్టి నేనీ రమేష్ గారు, గంజి పోలయ్య గారు,చేవూరు కృష్ణమూర్తి గారు, రాచుమల్లు సూర్య రావు గారు, షేక్ రఫీ, షేక్ భాషా తదితరులు ఉన్నారు.
నల్ల బర్లి రైతుల ఆందోళన– రూ 15 వేలు కనీస ధర కల్పించాలని డిమాండ్_ ఎడ్లపాడు రెవిన్యూ కార్యాలయం వద్ద ధర్నా_ తాసిల్దార్ కు వినతి అందజేత నల్ల బర్లి పొగాకు రైతులు సోమవారం గిట్టుబాటు ధర కోసం ఎడ్లపాడు తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా రైతులు నినాదాలు చేస్తూ తమ ఆవేదనను వ్యక్తపరిచారు. కంపెనీలు, ప్రభుత్వం నాణ్యత పేరుతో దిగుబడులను తిరస్కరిస్తూ, ప్రైవేట్ వ్యాపారులకు సైతం విక్రయించనీయకుండా చేస్తున్న చర్యలను నిరసిస్తూ రైతులు తీవ్రంగా విమర్శించారు. రైతు సంఘాలు, ప్రజా సంఘాలు ఈ ఆందోళనకు మద్దతు తెలుపుతూ ధర్నాలో పాల్గొన్నాయి. రైతులకు న్యాయం జరిగే వరకు తమ సంఘాలు భరోసాగా వెన్నంటే ఉంటాయని ఆయా సంఘాల నాయకులు హామీ ఇచ్చారు. గత రెండేళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పెట్టుబడి, శ్రమకు సరైన లాభం లేని పరిస్థితులను నాయకులు వివరించారు. ఈ సందర్భంగా నల్లమడ రైతు…
SP కంచి శ్రీనివాస్ రావు ను కలిసి న పల్నాడు కో -ఆపరేట్ సొసైటీ బ్యాంక్ ఖాతదారులు చిలకలూరిపేట లో భారీ మోసం 60లక్షల రూపాయలు కట్టించుకొని చేతులెత్తేసిన బ్యాంక్ ఆందోళన వ్యక్త పరుస్తున్న భాదితులు పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక, ఆస్తి తగాదాలు,మోసం మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 75 ఫిర్యాదులు అందాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులవెల్లువ చిలకలూరిపేట పట్టణమునకు చెందిన సువర్ణ లక్ష్మి ఆమె చిలకలూరిపేట కు చెందిన డీకొండ హరి శంకర్ అనే వ్యక్తి (మిలటరీ నందు పని చేసి రిటైర్డ్ అయినాడు) పల్నాడు- కో- ఆపరేట్ – సొసైటీ బ్యాంక్ ఏర్పాటు…
చిలకలూరిపేట 100 పడకల ఆసుపత్రికి నూతనంగా సూపర్డెంట్ గా నియమితులు అయిన డాక్టర్ శ్రీనివాసరావు ఈరోజు మాజీమంత్రి, శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సమావేశంలో ప్రత్తిపాటి మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ఆసుపత్రికి తరచుగా ఆసుపత్రి యొక్క స్థితి గతులు తెలుసుకొని డాక్టర్స్ కి , స్టాఫ్ కి ఉన్న సిబ్బంది కి వచ్చే పేషెంట్లు, ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటూ అవసరం అయిన వైద్య సేవలు అందించాలని తెలిపారు. అలానే ఆసుపత్రికి అవసరం అయిన స్టాఫ్ మరియు వైద్య పరికరాలు గురించి పై అధికారులతో మాట్లాడి అతి త్వరలోనే అందజేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇన్నర్‌వీల్ క్లబ్ ఆధ్వర్యంలో నీటి సమస్యకు చెక్ యడ్లపాడు మండలంలో చెంఘీజ్‌ఖాన్‌పేట పంచాయతీ బున్నీనగర్‌లో ఇన్నర్‌వీల్ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట ఆధ్వర్యాన జరిగిన సేవా కార్యక్రమంలో క్లబ్ డిస్ట్రిక్ చైర్మన్ ప్రేమలత హాజరయ్యారు. సోమవారం కాలనీ వాసులకు నీటి సమస్యకు పరిష్కారంగా అసిస్ట్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన బోర్‌వెల్‌ను ప్రేమలత ప్రారంభించారు. అనంతరం క్లబ్ బ్రాండింగ్‌లో భాగంగా ఇన్నర్‌వీల్ క్లబ్ చిహ్నాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. సమాజ సేవ..పేదరిక నిర్మూలనే లక్ష్యంగా చిలకలూరిపేట ఇన్నర్‌వీల్ క్లబ్ పనిచేస్తుందని ప్రేమలత పేర్కొన్నారు. క్లబ్ అధ్యక్షురాలు గట్టు సరోజిని మాట్లాడుతూ, విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల కల్పన, మహిళాభివృద్ధి కోసం క్లబ్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. రానున్న రోజుల్లో సేవా కార్యక్రమాల విస్తరణకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో దాతలు జాస్టి ప్రమీల, మద్ది లలిత, డాక్టర్ గట్టు రంగారావు, డిస్ట్రిక్ట్ సెక్రటరీ జయశ్రీ, డిస్ట్రిక్ట్ ఎడిటర్ సుభాషిణి, పీడీఎస్ కోలా విజయలక్ష్మి,…
చిలకలూరిపేట రూరల్ మండలం, కావూరు గ్రామంలో గుమ్మడితల వీరయ్య గారి కుమారుని వివాహం సందర్భంగా అక్కడికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు, చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు, ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ కోడె హనుమంతరావు గారు, బీసీ నాయకులు తుపాకుల అప్పారావు గారు, నాగేశ్వరరావు గారు పలువురు గ్రామ నాయకులు విచ్చేశారు.
చిలకలూరిపేట పట్టణం, 21 వ వార్డు నందు తెలుగుదేశం పార్టీ నాయకులు మద్ది రామకృష్ణ గారి ఆరోగ్య నిమిత్తం వారి ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పి యోగక్షేమాలు తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు, చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు, ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు తుపాకుల అప్పారావు గార, నాగేశ్వరరావు గారు మరియు 21 వ వార్డు కౌన్సిలర్ కరమర్లపూడి లక్ష్మీ తిరుమల గారు, అయినవోలు రాధా గారు,రాచమల్లు సూర్య రావు గారు పలువురు నాయకులు విచ్చేశారు.









