టీడీపీ ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమం ఈ ఏడాది పండుగ వాతావరణం లో, గతంలో ఎన్నడూ జరుగని విధంగా, కనివిని ఎరుగని రీతిలో మహానాడు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

ఈ మేరకు మహానాడు కు సంబంధించి కమిటీ లు నియమించారు.

జనసమీకరణ కమిటీ లో19మందిని నియమిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

ఈ19మంది లో చిలకలూరిపేట శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ను నియమించారు.

మహానాడు పండుగ కు లక్షల లో జనసమికరణ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ పని ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి కి అప్పగించారు.

దీంతో చిలకలూరిపేట నియోజకవర్గ టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.

Share.
Leave A Reply