Author: chilakaluripetalocalnews@gmail.com

మహా భారతంలో ఏకలవ్యుడి పాత్ర ఘనమైనది. ప్రత్తిపాటి పుల్లారావు. ఏకలవ్యుని విగ్రహాన్నికి నివాళులు అర్పించి, మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రత్తిపాటి. చిలకలూరిపేట: ఏ.పీ గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏకలవ్యుని జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ మంత్రివర్యులు, శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు పాల్గొన్నారు. ఆదివారం పట్టణములోని నరసరావుపేట సెంటర్లో గల రైతు బజార్ వద్ద గల ఏకలవ్యుడి విగ్రహాన్నికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రిబ్బన్ కట్ చేసి మహా అన్నదాన కార్యక్రమాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా తో ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ మహాభారతంలో గురు భక్తిని చాటిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఏకలవ్యుడని పేర్కొన్నారు. ద్రోణాచార్యుని గురుకులంలో విలు విద్యను అభ్యసించాలని కోరికతో ద్రోణాచార్యుని వద్దకు వెళ్లడంతో ఆయన తిరస్కరిస్తారు. ఎలాగైనా విలువిద్య నేర్చుకోవాలనే దృఢమైన సంకల్పం తో ద్రోణాచార్యుని ప్రతిమను బంకమట్టితో తయారు…

Read More

హామీల అమలు, రాష్ట్రాభివృద్ధే చంద్రబాబు ధ్యేయం : ప్రత్తిపాటి. దేశం గర్వించే నాయకుడు చంద్రబాబని, ప్రజల సంక్షేమం.. రాష్ట్రాభివృద్ధి తప్ప ఆయనకు మరో ఆలోచన ఉండదని ప్రత్తిపాటి స్పష్టంచేశారు. ఎన్ని ఆర్థిక సమస్యలున్నా.. రాష్ట్రాన్ని గత పాలకులు పూర్తిగా లూఠీ చేసినా దేశంలో ఏ ప్రభుత్వం అమలుచేయని పథకాలు ముఖ్యమంత్రి అమలుచేస్తున్నారన్నారు. పట్టణంలోని 6,7,9 వార్డుల్లో సుపరిపాలనలో తొలి అడుగు : ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి, ఎంపీ కృష్ణదేవరాయలు పాల్గొన్నారు. 9వ వార్డులో మున్సిపల్ శాఖ పరిధిలో రూ.40లక్షలతో నిర్మిస్తున్న వెహికల్ షెడ్ నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించిన అనంతరం ఇరువురూ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. జగన్ లా దొంగబటన్లు నొక్కి.. కూటమిప్రభుత్వం ప్రజల్ని మోసగించదు దేశంలో రూ.4వేల పింఛన్ ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కడేనని, బీహార్లో కేవలం 400 లు మాత్రమే ఇస్తున్నారని ప్రత్తిపాటి పేర్కొన్నారు. జగన్ అందరికీ అమ్మఒడి…

Read More

చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు భారతీయ జనసంఘ్ స్థాపకులు “డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ “గారి జయంతి ( జూలై 6) సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను.◆శ్యామా ప్రసాద్ ముఖర్జీ భారతమాత కన్న మహా సంతానంలో ఒకరు.వారి జీవితంలో ప్రతిక్షణం,శరీరంలో ప్రతి కణం మాతృభూమి సేవకే సమర్పితం అయ్యాయి.◆1901 జూలై 6వ తేదీన అసుతోష్ ముఖర్జీ ,రాణి జోగ్మయాదేవి పుణ్య దంపతులకు శ్యామాప్రసాద్ ముఖర్జీ జన్మించారు.తన తండ్రి అసుతోష్ ముఖర్జీ నుంచి అనేక గొప్ప గుణాలు పుణికి పుచ్చుకున్నారు.వాటిలో అతి ప్రముఖ గుణం అసుతోష్ ముఖర్జీ యొక్క ప్రఖరమైన, రాజీలేని జాతీయ భావన, అతడి నిర్భీక మనస్తత్వం.◆శ్యామాప్రసాద్ కు భగవంతుడు ఇచ్చిన మరో వరం అసామాన్యమైన అతడి మేధాశక్తి. అతడి తెలివితేటలు, గ్రహణశక్తి చూసి పాఠశాలలో ఉపాధ్యాయులు సైతం విస్మయం చెందుతూ ఉండేవారు. పాఠశాలలో చదువుతున్న రోజుల్లోనే శ్యామాప్రసాద్ ఎఫ్.ఏ, బి.ఏ…

Read More

మెగా పిటిఎం లో విట్నస్ అధికారి నియామక ఉత్తర్వులు రద్దు చేయాలి.ఎస్టీయూ డిమాండ్. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో పాఠశాలలో ఈనెల 10వ తేదీన జరగాల్సిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం లో విట్నస్ అధికారిని పాఠశాల ప్రధానోపాధ్యాయులే నియమించుకుని వారిచేత వీడియోలు తీయించి అప్లోడ్ చేయాలని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను తక్షణం రద్దు చేయాలని ఎస్టియూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కే కోటేశ్వరరావు రాష్ట్ర డైరీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్ధులు, తల్లిదండ్రులతో కలిసి విద్యార్థుల విద్యాభివృద్ధి మీద, పాఠశాలల్లో ఉన్న మౌళిక సదుపాయాల మీద మాట్లాడుకోవడానికి 17 రకాల కమిటీలు, ఫోటోల అప్లోడ్ లు, విట్నస్ అధికారులు ఇంత తతంగం అవసరమా? అని ప్రశ్నించారు. పి.టి.ఎం. కార్యక్రమాన్ని డాక్యుమెంట్ కార్యక్రమంగా మార్చడం సరికాదని, విద్యార్థుల విద్యాభివృద్ధి గురించి చర్చించే కార్యక్రమంగా దీనిని మార్చాలని ఎస్టీయు కోరుతున్నదని వారు పేర్కొన్నారు. ఉపాధ్యాయులను బోధనకు…

Read More

మండలనేని సుబ్బారావు గారి జన్మదినం వేల జీవితాలకు వెలుగు చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రముఖ పారిశ్రామికవేత్తగా, నిస్వార్థ సేవకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న మండలనేని సుబ్బారావు గారికి నేడు పుట్టినరోజు. కేవలం తన ఎదుగుదల కోసమే కాకుండా, వేలాది కుటుంబాలకు ఆసరాగా నిలుస్తూ, ఆపదలో ఉన్నవారికి “నేనున్నాను” అంటూ భరోసా ఇచ్చే ఆయన ప్రస్థానం ఎందరికో ఆదర్శప్రాయం. సంకల్పం, శ్రమకు ప్రతీక సుబ్బారావు జీవితం సంకల్పానికి, నిరంతర శ్రమకు నిదర్శనం. స్వయంకృషితో ఎదిగి, తన పారిశ్రామిక సామ్రాజ్యాన్ని విస్తరించడమే కాకుండా, తద్వారా వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలను కల్పించారు. ఆయన స్థాపించిన సంస్థలు కేవలం వ్యాపార సంస్థలు మాత్రమే కాకుండా, అనేక కుటుంబాలకు జీవనోపాధిని కల్పిస్తున్న జీవన మార్గాలు. ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడు కులాలకు మతాలకుఅతీతంగా ఆర్థిక సాయం సుబ్బారావు ని కేవలం ఒక పారిశ్రామికవేత్తగా చూడలేం. ఆయన ఒక సామాజిక సేవకుడు, ఆపద్బాంధవుడు. నియోజకవర్గంలో ఎవరికి…

Read More

శ్రీ దత్త సాయి సన్నిధి లో విష్ణు సహస్ర నామ పారాయణ భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం —-చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గురువారం పురస్కరించుకొని శ్రీ దత్త స్వామికి ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాలు జరిగినాయి అనంతరం మహిళా భక్తుల సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం జరిగింది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సాయికి హారతులు సమర్పించి ప్రదక్షిణలు చేసినారు అనంతరం వేములకొండ సుబ్బారావు గారి ఆర్థిక సహకారంతో వారి మనవడు చిన్మయి సహకారంతో భక్తులకు అన్నసంతర్పణగా జరిగింది అనంతరం ట్రస్టు నిర్వాహకులు పూసపాటి బాలాజీ మాట్లాడుతూ గురుపౌర్ణమి రోజు జరిగే అన్నసంతర్పణ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా ధన కనక వస్తు వాహన రూపం లో సహకరించాలని కోరారు , గురుపౌర్ణమి రోజున ఉదయం నుంచి ప్రత్యేక…

Read More

డీఎస్సీ నియామకాలను వెంటనే చేపట్టాలి -ఎస్టీయూగత నెల రోజులుగా జరిగిన డీఎస్సీ పరీక్షలు నిన్నటితో ముగిసినందున నియామకాలు వీలైనంత త్వరగా చేపట్టాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుతున్నట్లు ఎస్టీ యూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కే కోటేశ్వరరావు రాష్ట్ర డైరీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని ఎస్టియు ప్రాంతీయ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ జూన్ నెలలో జరిగిన ఉపాధ్యాయుల బదిలీలలో డీఎస్సీ ఖాళీలు కూడా చూపించి నందు వలన మారుమూల ప్రాంతాలలో ఎక్కువ ఉపాధ్యాయ ఖాళీలు ఏర్పడ్డాయి. డీఎస్సీ పరీక్షలు నిన్నటితో ముగిసినందున వీలైనంత త్వరగా మెరిట్ లిస్టు విడుదల చేసి తద్వారా సెలెక్షన్ లిస్టు తయారు చేసి వెంటనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఉపాధ్యాయ నియామక చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పాఠశాల విద్యాశాఖను కోరినట్లు ఎస్టియు నాయకులు తెలిపారు. ఉపాధ్యాయ నియామక పరీక్ష రాసిన లక్షలాదిమంది ఉద్యోగులు నిరీక్షిస్తున్నందున…

Read More

ఆగస్ట్ 15 తర్వాత సంక్షేమం అమల్లో దేశంలో ఏపీనే టాప్ : ప్రత్తిపాటి. నియోజకవర్గంలోని వాగుల్ని ఆధునికీకరించి, వ్యవసాయానికి కీలకమైన లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థల్ని బాగుచేయాలని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రికి విన్నవించానని, ప్రభుత్వం సకాలంలో స్పందించి వాగుల్లోని కంపచెట్లు, పూడికతీతకు రూ.2.50కోట్లు కేటాయించిందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు : ఇంటింటికీ తెలుగుదేశంలో భాగంగా ప్రత్తిపాటి గురువారం చిలకలూరిపేట మండలం పసుమర్రులో పర్యటించారు. స్థానిక పశువైద్యశాలలో నట్టల నివారణ మందు.. పశుగ్రాస విత్తనాల పంపిణీ ప్రారంభించిన అనంతరం, స్వయంగా ఎక్సకవేటర్ నడిపి ఓగేరు వాగు ఆధునికీకరణ పనుల్ని ప్రత్తిపాటి ప్రారంభించారు. అనంతరం గ్రామస్తుల్ని ఉద్దేశించి మాట్లాడారు. గత ప్రభుత్వంలో జరిగిన నష్టాన్ని.. గత పాలకులుచేసిన విధ్వంసాన్ని మర్చిపోతే ఎలాగన్న ప్రత్తిపాటి… ప్రజలు నేడు ప్రశాంతంగా తమ పనితాము చేసుకుంటూ కుటుంబాలతో సంతోషంగా జీవిస్తూ, హాయిగా ఉండటానికి కారణం కూటమిప్రభుత్వం చంద్రబాబు నాయకత్వమేనన్నారు. ఆగస్ట్ 15 తర్వాత…

Read More

కాపుల చిరకాల వాంఛ అయిన బీసీ రిజర్వేషన్ కోసం చిత్తూరు నుండి అమరావతి వరకు పాదయాత్ర ప్రముఖ విలేఖరి కాపు నాయకులు యువకుడు సానా ప్రసాద్ కూటమి ప్రభుత్వానికి కాపు రిజర్వేషన్ గురించి గుర్తు చేయడానికి అలాగే రిజర్వేషన్ అమలు చేయటానికి విజ్ఞాపన పత్రం ఇవ్వటానికి సానా ప్రసాద్ ఎన్నో వ్యాయ ప్రయాసలకు ఓర్చుకొని తన ఆర్థిక స్తోమతను లెక్కచేయకుండా చిత్తూరు నుండి కడప కర్నూలు ఒంగోలు మీదగా చిలకలూరిపేటకు విచ్చేయడం జరిగింది. చిలకలూరిపేటకు విచ్చేసిన సానా ప్రసాద్కు ఘనస్వాగతం తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు నాయకులు తాను చేస్తున్న ఈ పోరాటానికి పూర్తి మద్దతు తెలియజేసి చిలకలూరిపేటలో ఉన్న కీర్తిశేషులు వంగవీటి మోహనరంగా విగ్రహాలకు పూలమాలలు వేసి తాను చేస్తున్న పోరాటం గురించి చిలకలూరిపేట కాపు నాయకులకు యువకులకు మహిళలకు తన పాదయాత్ర ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు సానా ప్రసాదు తన మిత్ర బృందం…

Read More

శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ గారి తనయుడు మర్రి శ్రీనాథ్ గారి జన్మదిన సందర్భంగా పట్టణంలోని బాపూజీ వృద్ధాశ్రమం నందు మర్రి సైన్యం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మర్రి రాజశేఖర్ గారి అభిమానులు, పలువురు ప్రముఖ సీనియర్ నాయకులు పాల్గొని జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి ఫోన్ ద్వారా శ్రీనాథ్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలలో సోమేపల్లి వెంకటసుబ్బయ్య గారు, సోమేపల్లి వాసు గారు,గేరా లింకన్ గారు, బైరా వెంకట కోటి గారు , గొట్టిపాటి సాంబశివరావు గారు,AVM సుభాని గారు, మాజేటి నరేంద్ర గారు, వేజర్ల కోటేశ్వరరావు గారు, ఇమ్మడి జానకిపతి గారు, జాలాది సుబ్బారావు గారు, గడిపూడి దశరథ రామయ్య గారు, నార్నె హనుమంతరావు గారు, చింతల సింగయ్య గారు, జంజనం వెంకటరావు గారు, సయ్యద్ జమీర్ గారు, కొండెబోయిన ఆంజనేయులు గారు, షేక్ కరీముల్లా గారు,గ్రంధి…

Read More