జిల్లా అభివృద్ధికి సూచనలు ఇవ్వండి…

ఎమ్మెల్యేలను కోరిన జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా

పల్నాడు: స్థానిక కలెక్టరేట్ లోని ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా అభివృద్ధిపై ఎమ్మెల్యేలు, అధికారులతో ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ ఆంజనేయులు, ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, ప్రత్తిపాటి పుల్లారావు, జూలకంటి బ్రహ్మానంద రెడ్డి, చదలవాడ అరవింద బాబు, ఎస్పీ కృష్ణారావు, జాయింట్ కలెక్టర్ సంజనా సింహా, ఆర్డీవోలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

తక్కువ వ్యయంతో, కేవలం విధాన పరమైన చర్యలు తీసుకోవడం ద్వారా ఎక్కువ ప్రభావం చూపే ఆలోచనలు తమ ముందుంచాలన్నారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలో మెగా టూరిజం హబ్, కొండవీడు కోట అభివృద్ధి, పల్నాడు జిల్లాను పూర్ణోదయ పథకం పరిధిలోకి తీసుకురావడం, లింగంగుంట్ల భూముల సమస్య వంటి అంశాలను ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

Share.
Leave A Reply