పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల గారికి పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి తరపున పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు వినతి పత్రం సమర్పించడం జరిగింది

గౌరవనీయులైన పల్నాడు జిల్లా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్న ఫిర్యాదు

హిందు సంస్కృతి మూలాలు ధ్వంసం చేయడమే జగన్ లక్ష్యం, హిందు సమాజాన్ని అవమానిస్తూ ఆనందం పొందుతున్నారు

జగన్మోహన్ రెడ్డి పాలనలో హిందూ సమాజం పై దాడి జరిగింది. తిరుమల డిక్లరేషన్ పై సంతకం చేయకుండా దర్శనానికి వెళ్లి హిందు విశ్వాశాలపై నమ్మకం లేదని తెలిపాడు. ఈ చర్య ద్వారా హిందూ దేవతలు ఆరాధనలపై విశ్వాసం లేదని అర్ధం అయ్యింది. కెమికల్ నెయ్యితో శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ చేసి తీవ్ర అపచారం చేయడమే కాకుండా శాసనమండలి సాక్షిగా చెప్పులు ధరించి కలియుగ దైవం వెంకటేశ్వర స్వాము చిత్ర పఠంతో నినాదాలు చేసి తధనంతరం ఆ ఫోటోలను అక్కడే విసిరేసి వెళ్ళిపోయారు. ఈ సంఘటన చాలా బాధాకరం.

వైఎస్సార్సీపి ప్రభుత్వంలో హిందూ సంస్కృతి మూలాల్లో కొట్టాలనే కుట్ర జరిగింది.

వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో హిందూ ఆలయాల ధ్వంసం హిందూ దేవత మూర్తుల విగ్రహాల ధ్వంసం ఆలయ రథాల దగ్ధం మరియు ధ్వంసం జరిగినది

ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి 2024 మధ్య కాలంలో హిందూ సంస్కృతి మూలాలను నాశనం చేయాలనే ప్రయత్నంలో జరిగిన దాడులపై సమగ్ర విచారణ చేయాలి అని ప్రజలు కోరుచున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో 2019 నుంచి 2024 వరకు YSRCP ప్రభుత్వ కాలంలో హిందూ ఆలయాలు, విగ్రహాలు, రథాలపై జరిగిన అనేక దాడులు ధ్వంసాలు గమనార్హం. ఈ ఘటనల్లో అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్లక్ష్య చర్యలు సమాజంలో భయాన్ని పెంచాయి. అంతే కాకుండా ఫిర్యాదు చేసినవారిపైనే తిరిగి కేసులు పెట్టి అమాయక హిందువులను వేధించారు. ఒక మత ఛాందశవాది ఇతర మత విశ్వాసాలపై గౌరవం లేనివాడు ముఖ్యమంత్రి అయితే ఎంత ప్రమాదమో ప్రజలకి అర్ధం అయ్యింది.

భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న “జనతా వారధి” కార్యక్రమంలో భాగంగా మేము ప్రజల వద్దకు వెళ్తున్నప్పుడు వారి నుంచి వస్తున్న విన్నపం “మా హిందూ ఆలయాల ధ్వంసం విగ్రహాల ధ్వంసం దగ్ధం పై చర్యలు తీసుకోవాలని ఇది కచ్చితంగా కుట్రపూరితంగా అప్పటి పాలకుల ప్రోత్సాహంతో చేశారని వారందరిపై చర్యలు తీసుకొని నేరస్తులు ఎవరో తెలియచేసి ప్రజాస్వామ్యానికి నమ్మకం కలిగించాలి” అని కోరుచున్నారు. ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల కుట్రలు దాడులు జరిగాయి. 2020 నెల్లూరులో కొండబిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి రధం ధ్వంసం చేశారు. 2020 సెప్టెంబర్ లో తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ రథాన్ని దగ్ధం చేశారు. 2024 సెప్టెంబర్ లో అనంతపురం రామాలయం రధాన్ని దగ్ధం చేశారు. 2019 మార్చిలో కాకినాడ రూరల్ లో ఒక చర్చి పాస్టర్ రెండు హిందూ ఆలయాలు ధ్వంసం చేసి అందులో విగ్రహాలను తీసుకువెళ్లిపోయారు. 2020 జనవరిలో పిఠాపురం లో పేరుగాంచిన ఆలయాల్లో దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేశారు. 2020 సెప్టెంబర్ లో చిత్తూరులో నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు. 2021 లో రాజమండ్రిలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం చేతులు నరికారు. 2021 లో విజయనగరం జిల్లా నెల్లిమర్లలో రామతీర్థం పుణ్యక్షేత్రం శ్రీరాముని విగ్రహ శిరస్సు ధ్వంసం చేశారు ఇంకా ఎన్నో దారుణాలు చేశారు.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి రోజు హిందూ మూలాలను నాశనం చేసే రచన జరిగింది. ఇప్పటికి కూడా అదే ఆలోచనలతో వున్నారు అని అర్ధం అవుతుంది. ప్రజల ముందు జగన్మోహన్ రెడ్డి ముసుగు తొలగింది. ఇది భరించలేని జగన్మోహన్ రెడ్డి తన దుర్మార్గపు అనుచరులతో కలసి సమాజన్ని కించపరుస్తున్నారు.

క్షమించరాని తప్పులు చేసి కూడా భగవంతుణ్ణి అవమానపరుస్తూ శాసనమండలిలో నిరసన పేరుతో ప్రవర్తించిన తీరుని చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం 2019 నుంచి 2024 వరకు హిందూ ఆలయాల ధ్వంసం, దేవత మూర్తుల విగ్రహాలు ధ్వంసం, రధాలు దగ్ధం రధాలు ధ్వంసం అన్ని సంఘటనలపై నిజమైన నేరస్తులను ప్రజల ముందు ఉంచి, లడ్డు ప్రసాదంలో కెమికల్ నెయ్యి నిందుతులు సహకరించిన వ్యక్తులను శిక్షించాలి. శాసనమండలిలో కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అవమానించిన సభ్యుల పై చర్యలు తీసుకోవాలని కోరుచున్నారు.
ఈ కార్యక్రమం లొ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మరియు పల్నాడు జనతా వారధి కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా జనతా వారధి మీడియా ఇంచార్జి కోమటి వాసు చిలకలూరిపేట పట్టణ ఉపాధ్యక్షులు కోట చంద్ర చిలకలూరిపేట మైనార్టీ పట్టణ అధ్యక్షులు మొహమ్మద్ సుభాని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share.
Leave A Reply