జి డి సి సి బ్యాంక్ మాజీ చైర్మన్ మానం వెంకటేశ్వర్లు కు మాతృ వియోగం.. చిలకలూరిపేట మాజీ జి. డి. సి. సి.బ్యాంక్ చైర్మన్ మానం వెంకటేశ్వర్లు మాతృమూర్తి మానం మాణిక్యమ్మ గారు(89) ఆదివారం స్వర్గస్తులైనారు ఆమె అంతిమయాత్ర సోమవారం ఉదయం 10 గంటలకు గుంటూరు నగరంలోని ఏట్కూరు రోడ్డుకు సమీపంలోని హుడా రోడ్ లో గల కమ్మ శేషయ్య గ్రౌండ్ నందుగల మానం వెంకటేశ్వర్లు సోదరుడి నివాసం నుండి బయలుదేరును . ఈ విషయాన్ని తెలియపరచమైనది…ఇట్లు , కుమారులు మానం వెంకటేశ్వర్లుమానం కోటేశ్వరరావు మానం నారాయణస్వామి.
Author: chilakaluripetalocalnews@gmail.com
జాతీయ రహదారిపై డివైడర్ ను ఢీకొని ఒరిస్సా కార్మికుడు దుర్మరణం మరొకరికి తీవ్ర గాయాలు. గణపవరం జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘటన మృతిని స్నేహితుడు లిట్టును తీవ్ర గాయాలు. తిమ్మాపురం గ్రామ పరిధిలో ఉన్న తిరుమల స్పిన్నింగ్ మిల్లు లో పని చేసే ప్రీతం మాలిక్ (24)తన సోదరుడు తో కలిసి కంపెనీ వసతి గృహంలో ఉంటున్నాడు. గత రెండు సంవత్సరాలు గా కంపెనీ లో పని చేస్తున్నాడు. తన స్నేహితుడు లిట్టు తో కలిసి ప్రీతం మాలిక్ బైక్ పై చిలకలూరిపేట వచ్చి వెళుతున్న సమయంలో బైక్ అదుపుతప్పి డివైడర్ ను వేగంగా ఢీకొనడంతో ప్రీతం మాలిక్ అక్కడికక్కడే మృతి చెందాడు. తన స్నేహితుడు లిట్టుకు తీవ్రగాయాలయ్యాయి… లిట్టును గుంటూరు వైద్యశాల కు తరలించారు. ఘటన స్థలాన్ని నాదెండ్ల SI పుల్లారావు పరిశీలించి కేసు నమోదు చేశారు.
చిలకలూరిపేట రూరల్ పోలీసు స్టేషన్లో ASI వెంకటేశ్వర్లు ఉద్యోగ విరమణ గత కొన్ని నెలలు నుంచి రూరల్ సర్కిల్ లో ASI గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు ఘనంగా అభినందించిన పల్నాడు జిల్లా SP శ్రీనివాసరావు ఉద్యోగ విరమణ పొందిన పోలీసు సిబ్బందిని సన్మానించి, అత్మీయ వీడ్కోలు పలికిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఉద్యోగ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించిన ఎస్పీ
క్వారీలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం నాదెండ్ల పోలీసులు ఈ మృతదేహాన్ని గుర్తించారు. గణపవరం గ్రామంలోనిక్వారీ గుంతలో మృతదేహం లభ్యం కావడంతో, ఇది ఆత్మహత్యా లేక హత్య చేసి క్వారీలో పడేశారా అనే కోణంలో ఎస్ఐ పుల్లారావు బృందం విచారణ చేపట్టింది. ఈ ఘటన మూడు రోజుల క్రితం జరిగి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.
నాదెండ్ల మండలం లో పోలీసులు మెరుపు దాడులు కోడి పందాల స్థావరాలపై నాదెండ్ల పోలీసులు దాడులు చందవరం – సాతులూరు మధ్య (చందవరం వైపు) గల పొలాల్లో కోడిపందేల స్థావరంపై పోలీసులు దాడి నాదెండ్ల ఎస్సై పుల్లారావు సారథ్యంలో జరిగిన మెరుపు దాడి. భారీగా పట్టుబడిన ద్విచక్రవాహనాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సుమారు మూడు గంటల పాటు సాగిన దాడులు
రాష్ట్రానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టెటివ్ కమిటీ చైర్మన్ నియామకం FCI కమిటీ AP చైర్మన్ గా ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ను నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు FCI కమిటీ AP చైర్మన్ గా వీరు రాష్ట్రంలో పర్యటించి,ఆహార,ధాన్యం సేకరణ, కొనుగోలు, ఇతర పంటల ఉత్పత్తులు,ఆహార పదార్థాలు నాణ్యత తో సహా,పలు అంశాలపై అధ్యయనం చేస్తారు. FCI కమిటీ చైర్మన్ గా నియమించడం పట్ల ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కేంద్ర ప్రభుత్వానికి,ప్రధాని మోదీ కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
జూన్ 4 – వెన్నుపోటు దినంవెన్నుపోటు దినం కార్యక్రమం విజయవంతం చేద్దాం అంటూ పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు అబద్దపు హామీలతో అధికారం లోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ జూన్ 4న వెన్నుపోటు దినాన్ని నిర్వహించనున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పల్నాడు జిల్లా వినుకొండ వైయస్ఆర్సీపీ కార్యాలయంలో వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ PAC మెంబర్ వినుకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు మరియు వైయస్ఆర్ సీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
వెన్నుపోటు దినం.. కదం తొక్కుదాం..మాజీమంత్రి విడదల రజిని పిలుపు కూటమి మోసాల్ని ఎండకట్టేందుకే నిరసన అంటూ వెల్లడిజూన్ 4న వెన్నుపోటు దినం పేరుతో చిలకలూరిపేట పట్టణంలో భారీ ర్యాలీప్రజలతో కలిసి అధికారులకు వినతి పత్రాల సమర్పణపార్టీ శ్రేణులతో కలిసి కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ చిలకలూరిపేట నియోజకవర్గంలో జూన్ 4వ తేదీన వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరగనున్న ‘వెన్నుపోటు దినం‘ కార్యక్రమ పోస్టర్ను పార్టీశ్రేణులతో కలిసి మాజీ మంత్రి విడదల రజిని వారి నివాసంలో ఆవిష్కరించారు. ప్రజల మద్దతుతో జరిగే ఈ నిరసన ర్యాలీను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ నాయకులకు కార్యక్రమ నిర్వహణపై దిశానిర్ధేశం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఏర్పాటుచేసిన మెగా జాబ్ మేళకు ముఖ్యఅతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు & వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ కొంజేటి నాగ శ్రీను రాయల్ గారు హాజరై జాబ్ మేళాను ప్రారంభించారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగ,ఉపాధి కల్పన లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ముందుకు వెళ్తున్నారని తెలిపారు. దీనిలో భాగంగానే వినుకొండలో మెగా జాబ్ మేళా నిర్వహించి వందలాదిమంది నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నిర్వహించే జాబు మేళ ను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని చీఫ్ విప్ జీవి గారు కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
చిన్నారి అక్షితను ఆశీర్వదించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ పురుషోత్తపట్నం గ్రామ ప్రముఖ నాయకులు బైరా వెంకట కోటి గారి మనుమరాలు ( ఈదుపల్లి అంకా రమేష్ గారి కుమార్తె ) నూతన వస్త్ర బహూకరణ వేడుక సాయిబాబా దేవాలయంలోని ఫంక్షన్ హాల్ నందు జరుగుచుండగా ఆ వేడుకకు హాజరై చిన్నారి అక్షితను ఆశీర్వదించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు… ఈ వేడుకలో వారితో బైరా శేషాద్రి నాయుడు గారు, బైరా శేఖర్ గారు, తోట వెంకట బ్రహ్మ స్వాములు గారు, గ్రంధి ఆంజనేయులు గారు తదితరులున్నారు.









