చిలకలూరిపేట తెలగ,కాపు,బలిజ కళ్యాణ మండపంను యనమదల (గ్రామం),యద్దనపూడి (మండలం),బాపట్ల(జిల్లా) గ్రామ వాస్తవ్యులు మన కాపు సామాజికవర్గానికి చెందిన ప్రముఖ వాస్తు సిద్ధాంతి శ్రీ.ఏలిసెట్టి రాము గారు సందర్శించి కళ్యాణ మండపం ప్రస్తుత వాస్తు పరిశీలించి వారు తమ అమూల్యమైన సలహాలు,సూచనలు తెలియజేశారు.తదుపరి కళ్యాణ మండపంలోని వాస్తులో ఉన్న లోపాలు సరిచెసి మనకు ప్లాన్ ఇస్తాను అని సహృదయంతో తెలియజేశారు.కళ్యాణ మండపమునకు సంబంధించిన వాస్తు శాస్త్రంను ఉచితంగా అందజేస్తాను అని కులం పట్ల ఉన్న అభిమానం తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చిలకలూరిపేటకు చెందిన కాపు సోదరులు పోతురాజు హరిష్,ఉసా రమేష్,ఉయ్యూరు నరసింహారావు,ఇర్రి రాఘవ,కమ్మిళి శివా రామకృష్ణ,మండలనేని జగదీష్,మిరియాలు లక్ష్మీ నారాయణ,మారెళ్ళ శ్రీను, రామిశెట్టి శివ ప్రసాద్,బందరు కృష్ణ ప్రసాద్ మరియు రామిశెట్టీ చంద్ర గార్లు పాల్గొన్నారు.

Share.
Leave A Reply