దేశం ఆశ్చర్యపోయేలా, మోదీ గర్వించేలా ‘యోగాంధ్ర’ చరిత్రలో నిలవాలి : ప్రత్తిపాటి

  • తనకు అప్పగించిన పని చంద్రబాబు సమర్థవంతంగా చేస్తారని మోదీ నమ్మకం : ప్రత్తిపాటి.
  • చంద్రబాబు, లోకేశ్ ప్రతిష్ఠ పెరిగితే రాష్ట్రానికే మేలు : ప్రత్తిపాటి.
  • తల్లికి వందనంతో చంద్రబాబు చరిత్ర సృష్టించారు. సూపర్-6 అమలుతో జగన్ అడ్రస్ గల్లంతే : ప్రత్తిపాటి

దేశం గర్వించేలా, రాష్ట్ర ప్రతిష్ఠ ఇనుమడించేలా చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ ల పేరు ప్రఖ్యాతులు పెంచేలా జూన్ 21న సాగరతీరాన జరిగే యోగాంధ్ర కార్యక్రమం చరిత్రలో నిలిచిపోవాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. యోగాంధ్ర నిర్వహణ విజయవంతంపై ఆదివారం ఆయన విశాఖపట్నంలోని గురజాడ కళాపరిషత్, స్థానిక వీ.ఆర్.డీ.ఎం.ఏ కార్యాలయంలో కూటమిపార్టీల శ్రేణులు, డ్వాక్రా, మెప్మా సంఘాల మహిళలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. యోగాంధ్ర బహిరంగ సభా నిర్వహణలో భాగంగా విశాఖపట్నం నార్త్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతల నిర్వహణకు ప్రతి ఒక్కరి సహాకారం కావాలని ఈ సందర్భంగా ప్రత్తిపాటి కోరారు.

సూపర్-6 అమలుతో జగన్ అడ్రస్ గల్లంతే…
తల్లికి వందనం అమలుతో చంద్రబాబు చరిత్ర సృష్టించారని, సూపర్ -6 అమలైతే జగన్ అడ్రస్సే గల్లంతవుతుందని, ప్రభుత్వ పథకాల ఫలాలు అందాక ప్రజలు వైసీపీని పూర్తిగా మర్చిపోతారని ఈ సందర్భంగా ప్రత్తిపాటి పేర్కొన్నారు. కూటమిప్రభుత్వ ఏడాది పాలన ప్రజలకు ఎంతో మేలుచేసిందని, చంద్రబాబు.. పవన్ కల్యాణ్ నాయకత్వం రాష్ట్రానికి ఎలా దోహదపడుతుందో ప్రజలు ఆలోచించాలని ప్రత్తిపాటి సూచించారు. విద్యాశాఖ మంత్రిగా లోకేశ్ ప్రతి తల్లి కళ్లల్లో ఆనందం నింపాడని, ప్రతి విద్యార్థి జీవితం నిలబెట్టాడని ప్రత్తిపాటి తెలిపారు. మోదీ భారతీయ యోగాను ప్రపంచానికి పరిచయం చేసి, దేశఖ్యాతిని పెంచారని, యోగా ప్రయోజనాలు, ఫలితాల గురించి అందరూ అవగాహన పెంచుకోవాలని ప్రత్తిపాటి సూచించారు.

తనకు అప్పగించిన పని చంద్రబాబు సమర్థవంతంగా నిర్వహిస్తాడని మోదీకి నమ్మకం…

తనకు అప్పగించిన పని, బాధ్యతల్ని చంద్రబాబు సమర్థవంతంగా నిర్వహిస్తాడనే నమ్మకం ప్రధాని మోదీకి ఉందన్న ప్రత్తిపాటి. ఆ నమ్మకంతోనే అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణ భాధ్యతల్ని మన నాయకుడికి అప్పగించారన్నారు. కేంద్రంలో చంద్రబాబు, లోకేశ్ ప్రతిష్ఠ పెరిగితే, అది రాష్ట్రప్రగతికి ఎంతగానో ఉపకరిస్తుందనే విషయాన్ని అందరూ గ్రహించాలని ప్రత్తిపాటి సూచించారు. యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకోవాలని, నిత్యయోగాతో అనారోగ్యం దరిచేరదని, ఆసుపత్రులు..మందులతో పని ఉండదని ప్రత్తిపాటి చెప్పారు. విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందన్నారు. యోగా అభ్యాసం అనేది చంద్రబాబుకోసమో.. పవన్ కల్యాణ్ కోసమో అని కాకుండా మన ఆరోగ్యం కోసమనే అవగాహన ప్రతిఒక్కరిలో ఉండాలని ప్రత్తిపాటి తెలియచేశారు. సాగర తీరాన సముద్రానికి పోటీకీ మరో జనసముద్రం ప్రధానికి కనిపించాలని, ఏపీ ప్రభుత్వం నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ రికార్డుతో పాటు, మరెన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు సాధిస్తుందని ప్రత్తిపాటి ఆశాభావం వ్యక్తంచేశారు.

సమీక్ష సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, వీ.ఆర్.డీ.ఎం.ఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, మెప్పా, డ్వాక్రా సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply