Author: chilakaluripetalocalnews@gmail.com

నూతన ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట:పసుమర్రులో పర్యటించిన శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అధికారులతో కలిసి నూతన ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇకనుంచి పేదలు రేషన్ సరుకులను రేషన్ దుకాణాల వద్దే తీసుకోవాలని స్పష్టం చేశారు.ప్రజా పంపిణీ వ్యవస్థలో అవకతవకలకు తావులేకుండా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుందని ఎమ్మెల్యే పుల్లారావు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ రేషన్ సరఫరా జరగలేదని, ఇంటింటికీ రేషన్ సరుకులు పేరుతో ప్రజలను మోసం చేసిన ఘనత జగన్‌దే అని ఆయన విమర్శించారు.అయితే, 65 సంవత్సరాల వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం రేషన్ డీలర్లు ఇంటి వద్దకే వచ్చి సరుకులు అందజేస్తారని ఎమ్మెల్యే పుల్లారావు వెల్లడించారు. రేషన్ డీలర్లు ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Read More

చిలకలూరిపేట నియోజకవర్గం, రూరల్ మండలం, వేలూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వేణు గారి తల్లి గారైనా కట్టా కిష్టాయమ్మ గారు ఇటీవల మరణించడం జరిగింది, ఈరోజు వారింటికి వెళ్లి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా గారు, నెల్లూరి సదాశివరావు గారు, జవ్వాజి మదన్ గారు, మురకొండ మల్లిబాబు గారు, షేక్ జానీ బాషా గారు, షేక్ అజార్ గారు మరియు మండల, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు..

Read More

జి డి సి సి బ్యాంక్ మాజీ చైర్మన్ మానం వెంకటేశ్వర్లు కు మాతృ వియోగం.. చిలకలూరిపేట మాజీ జి. డి. సి. సి.బ్యాంక్ చైర్మన్ మానం వెంకటేశ్వర్లు మాతృమూర్తి మానం మాణిక్యమ్మ గారు(89) ఆదివారం స్వర్గస్తులైనారు ఆమె అంతిమయాత్ర సోమవారం ఉదయం 10 గంటలకు గుంటూరు నగరంలోని ఏట్కూరు రోడ్డుకు సమీపంలోని హుడా రోడ్ లో గల కమ్మ శేషయ్య గ్రౌండ్ నందుగల మానం వెంకటేశ్వర్లు సోదరుడి నివాసం నుండి బయలుదేరును . ఈ విషయాన్ని తెలియపరచమైనది…ఇట్లు , కుమారులు మానం వెంకటేశ్వర్లుమానం కోటేశ్వరరావు మానం నారాయణస్వామి.

Read More

జాతీయ రహదారిపై డివైడర్ ను ఢీకొని ఒరిస్సా కార్మికుడు దుర్మరణం మరొకరికి తీవ్ర గాయాలు. గణపవరం జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘటన మృతిని స్నేహితుడు లిట్టును తీవ్ర గాయాలు. తిమ్మాపురం గ్రామ పరిధిలో ఉన్న తిరుమల స్పిన్నింగ్ మిల్లు లో పని చేసే ప్రీతం మాలిక్ (24)తన సోదరుడు తో కలిసి కంపెనీ వసతి గృహంలో ఉంటున్నాడు. గత రెండు సంవత్సరాలు గా కంపెనీ లో పని చేస్తున్నాడు. తన స్నేహితుడు లిట్టు తో కలిసి ప్రీతం మాలిక్ బైక్ పై చిలకలూరిపేట వచ్చి వెళుతున్న సమయంలో బైక్ అదుపుతప్పి డివైడర్ ను వేగంగా ఢీకొనడంతో ప్రీతం మాలిక్ అక్కడికక్కడే మృతి చెందాడు. తన స్నేహితుడు లిట్టుకు తీవ్రగాయాలయ్యాయి… లిట్టును గుంటూరు వైద్యశాల కు తరలించారు. ఘటన స్థలాన్ని నాదెండ్ల SI పుల్లారావు పరిశీలించి కేసు నమోదు చేశారు.

Read More

చిలకలూరిపేట రూరల్ పోలీసు స్టేషన్లో ASI వెంకటేశ్వర్లు ఉద్యోగ విరమణ గత కొన్ని నెలలు నుంచి రూరల్ సర్కిల్ లో ASI గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు ఘనంగా అభినందించిన పల్నాడు జిల్లా SP శ్రీనివాసరావు ఉద్యోగ విరమణ పొందిన పోలీసు సిబ్బందిని సన్మానించి, అత్మీయ వీడ్కోలు పలికిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఉద్యోగ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించిన ఎస్పీ

Read More

క్వారీలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం నాదెండ్ల పోలీసులు ఈ మృతదేహాన్ని గుర్తించారు. గణపవరం గ్రామంలోనిక్వారీ గుంతలో మృతదేహం లభ్యం కావడంతో, ఇది ఆత్మహత్యా లేక హత్య చేసి క్వారీలో పడేశారా అనే కోణంలో ఎస్ఐ పుల్లారావు బృందం విచారణ చేపట్టింది. ఈ ఘటన మూడు రోజుల క్రితం జరిగి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.

Read More

నాదెండ్ల మండలం లో పోలీసులు మెరుపు దాడులు కోడి పందాల స్థావరాలపై నాదెండ్ల పోలీసులు దాడులు చందవరం – సాతులూరు మధ్య (చందవరం వైపు) గల పొలాల్లో కోడిపందేల స్థావరంపై పోలీసులు దాడి నాదెండ్ల ఎస్సై పుల్లారావు సారథ్యంలో జరిగిన మెరుపు దాడి. భారీగా పట్టుబడిన ద్విచక్రవాహనాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సుమారు మూడు గంటల పాటు సాగిన దాడులు

Read More

రాష్ట్రానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టెటివ్ కమిటీ చైర్మన్ నియామకం FCI కమిటీ AP చైర్మన్ గా ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ను నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు FCI కమిటీ AP చైర్మన్ గా వీరు రాష్ట్రంలో పర్యటించి,ఆహార,ధాన్యం సేకరణ, కొనుగోలు, ఇతర పంటల ఉత్పత్తులు,ఆహార పదార్థాలు నాణ్యత తో సహా,పలు అంశాలపై అధ్యయనం చేస్తారు. FCI కమిటీ చైర్మన్ గా నియమించడం పట్ల ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కేంద్ర ప్రభుత్వానికి,ప్రధాని మోదీ కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Read More

జూన్ 4 – వెన్నుపోటు దినంవెన్నుపోటు దినం కార్యక్రమం విజయవంతం చేద్దాం అంటూ పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు అబద్దపు హామీలతో అధికారం లోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ జూన్ 4న వెన్నుపోటు దినాన్ని నిర్వహించనున్న వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ. పల్నాడు జిల్లా వినుకొండ వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో వెన్నుపోటు దినం పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ PAC మెంబర్ వినుకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు మరియు వైయస్ఆర్ సీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Read More

వెన్నుపోటు దినం.. కదం తొక్కుదాం..మాజీమంత్రి విడదల రజిని పిలుపు కూటమి మోసాల్ని ఎండకట్టేందుకే నిరసన అంటూ వెల్లడిజూన్‌ 4న వెన్నుపోటు దినం పేరుతో చిలకలూరిపేట పట్టణంలో భారీ ర్యాలీప్రజలతో కలిసి అధికారులకు వినతి పత్రాల సమర్పణపార్టీ శ్రేణులతో కలిసి కార్యక్రమం పోస్టర్‌ ఆవిష్కరణ చిలకలూరిపేట నియోజకవర్గంలో జూన్‌ 4వ తేదీన వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరగనున్న ‘వెన్నుపోటు దినం‘ కార్యక్రమ పోస్టర్‌ను పార్టీశ్రేణులతో కలిసి మాజీ మంత్రి విడదల రజిని వారి నివాసంలో ఆవిష్కరించారు. ప్రజల మద్దతుతో జరిగే ఈ నిరసన ర్యాలీను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ నాయకులకు కార్యక్రమ నిర్వహణపై దిశానిర్ధేశం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More