పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ అరుణ్ బాబు గారు నేడు (04.06.2025) వెల్దుర్తి గ్రామాన్ని సందర్శించి ప్రజా సమస్యల పరిష్కారంపై దాఖలైన ఫిర్యాదుల (PGRS) నాణ్యతను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై గ్రామస్థులతో ప్రత్యక్షంగా చర్చించారు.

  1. మాండ్లి సుబ్బారావుతో త్రాగు నీటి సమస్యపై చర్చించారు.వెల్దుర్తి గ్రామంలో చెంచు కాలనీ లో త్రాగునీటి సరఫరాలో అంతరాయాలు వస్తున్నట్లు సుబ్బారావు కలెక్టర్ గారికి తెలియజేశారు. దీనిపై కలెక్టర్ గారు RWS అసిస్టెంట్ ఇంజనీర్‌ను ఉద్దేశించి త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ ప్రజలకు నిరంతర నీటి సరఫరా నిర్ధారించేందుకు తగిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
  2. జులకంటి అంజిరెడ్డి – ప్రధానమంత్రి కిసాన్ నిధుల చెల్లింపు సమస్య పై గ్రామానికి చెందిన జులకంటి అంజిరెడ్డి ఇప్పటివరకు ప్రధాన్ మంత్రీ కిసాన్ నిధులను పొందలేదని కలెక్టర్ గారిని కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ గారు వ్యవసాయ శాఖ అధికారులతో చర్చించి ఆ రైతు యొక్క e-KYC ప్రక్రియను వెంటనే పూర్తి చేసి, పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల కు ప్రయత్నం చేయాలని సూచించారు. రైతులకు సహాయపడే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు వేగంగా స్పందించాలని ఆదేశించారు.
  3. వెల్దుర్తి కి చెందిన దేశం శ్రీనివాసరెడ్డి తరచూ వివిధ సమస్యల పేరుతో కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదులు సమర్పించడం పై ఇక నుండి జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి రాకుండా, ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా అవి సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలోనే వ్రాతపూర్వకంగా ఇవ్వాలని ఆదేశించారు. కలెక్టర్ గారు అధికారులతో కలిసి గ్రామంలో అభివృద్ధి పనుల పురోగతిని, ప్రజల సమస్యలను స్వయంగా సమీక్షిస్తూ పారదర్శక, స్పందనాత్మక పాలనకు నూతన దిశగా చర్యలు చేపడుతున్నారు. ప్రజలు ప్రభుత్వంపై నమ్మకం పెంచుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు
Share.
Leave A Reply