జనసేన పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు
రంగవల్లులు అందంగా తీర్చి దిద్దిన మహిళలు
సుపరిపాలన పేరు తో వేడుకలు ఘనంగా నిర్వహించిన జనసేన
సుపరిపాలన మొదలయ్యి ఏడాది పూర్తయిన సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రికొణిదల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు చిలకలూరిపేట నియోజకవర్గంలో గ్రామాలలో, వాడ వాడలలో ప్రజలు స్వచ్ఛందంగా వేడుకలు నిర్వహించి, సంక్రాంతి ముగ్గులు వేసి సంబరాలు నిర్వహించారు.
ఈ వేడుకలలో స్థానిక సమన్వయకర్త తోట రాజా రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాజా రమేష్ మాట్లాడుతూ ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావడంతో ప్రజలు స్వచ్ఛందంగా, ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. గడిచిన వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రజలు అణిచివేతకు గురయ్యారని వారి ఆర్థిక స్థితిగతులు క్షీణించాయని, తీవ్ర నిరాశకు గురై గడిచిన సార్వత్రిక ఎన్నికలలో కూటమి పార్టీలకు 164 స్థానాలు కట్టబెట్టి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారని అన్నారు. ఎవరిని ఎవరు వెన్నుపోటు పొడిచరో రాష్ట్ర ప్రజలు తెలుసుకొని వైసీపీని తుక్కుతుక్కుగా ఓడించారని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం నేడు వెన్నుపోటు అని డ్రామాలు ఆడుతున్నారని వైసిపి పార్టీపై ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామాలు, పల్లెలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని అన్నారు. జగన్ హయాంలో గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని, పంచాయతీరాజ్ వ్యవస్థను చిన్న భిన్నం చేశారని, అటవీ భూములను అన్యక్రాంతంగా ఆక్రమించుకొని రాష్ట్రాన్ని లూటీ చేశారని అన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారు. గత వైసిపి పాలకుల అవినీతిని, అక్రమాలను, దౌర్జన్యాలను తట్టుకోలేక ప్రజలు చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా కూటమి అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు గారికి 33,500 ఓట్ల మెజారిటీతో గెలిపించారని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు చిలకలూరిపేట జనసేన పార్టీ ప్రజాసేవ చేస్తుందని అన్నారు. అనంతరం స్వీట్లు పంచుకొని సంబరాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి సుభాని, పట్టణ , మండల అధ్యక్షులు మునీర్ హాసన్, ఖాదర్ భాష, కూర పాటి శివశంకర్, దడదాసుల శరత్, నరసింహారావు, రవి, జనసేన పార్టీ వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.