జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ విద్య అమలు చేయాలి – పల్నాడు జిల్లా కలెక్టర్ కి APUWJ జర్నలిస్టుల వినతి. వెంటనే స్పందించిన కలెక్టర్

విద్య శాఖ అధికారులు కు ఆదేశాలు జారీ

పల్నాడు జిల్లాలో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు సమాజానికి, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి — నిస్వార్థంగా ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టులు (APUWJ) పేర్కొన్నారు.

జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో 50%ఫీజు రాయితీ విద్యను కల్పించేందుకు ఈ అంశంపై పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో
పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు కు వినతిపత్రాన్ని అందజేశారు.

దీనికి కలెక్టర్ వెంటనే సానుకూలంగా స్పందించి జిల్లావిద్యా శాఖ అధికారులకు 50%ఫీజు రాయితీ పై ఆదేశాలు ఇచ్చారు .

ఈ విషియం పై పల్నాడు జిల్లా APUWJ నాయకులు హర్షం వ్యక్తం చేసి జర్నలిస్ట్ లు, APUWJ తరుపున కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు .

ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పల్నాడు జిల్లా APUWJ ముఖ్య నాయకులు పాల్గొన్నారు

Share.
Leave A Reply