Author: chilakaluripetalocalnews@gmail.com

అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మహిళల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహణ అమరావతి రాజధాని ప్రాంత మహిళల పట్ల ఇటీవల ఒక ప్రముఖ ఛానెల్ నందు కొంత మంది వ్యక్తులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ, ఈరోజు స్థానిక మహిళా సంఘాలు, యువజన సంఘాలు మరియు సామాజిక కార్యకర్తలు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీ N.R.T సెంటర్ నందలి రైతు బజార్ వద్ద ప్రారంభమై, గడియారం స్తంభం వరకు కొనసాగింది. ర్యాలీలో పాల్గొన్నవారు ప్లే కార్డులు పట్టుకొని “మహిళలపై దుర్మార్గపు వ్యాఖ్యలు తక్షణం ఆపాలి”, “సమాజం మహిళలను గౌరవించాలి” అనే నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ,మహిళల గౌరవానికి భంగం కలిగించే ఇటువంటి వ్యాఖ్యలు క్షమార్హం కాదని,ఇటువంటి వ్యాఖ్యలను చేసేవారిని చూస్తూ,సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళా ప్రధాన…

Read More

మనవళ్లే దాడి చేశారంటూ స్టేషన్లో కేసు నమోదు యడ్లపాడు ఠానా ను ఆశ్రయించిన భాదితులు యడ్లపాడు మండలంలోని కొండవీడు గ్రామంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఒకరికి అమ్మమ్మ, మరోకరికి నాయినమ్మ అయ్యే వృద్దురాలిపై దాడి చేశారంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కొండవీదు గ్రామానికి చెందిన తోట లక్ష్మీకాంతమ్మ తన మనవళ్లు మహేష్‌బాబు, దమ్ము రామారావులకు తరచు డబ్బులు ఇస్తుంటుంది. ఈ విషయాన్ని వారి తల్లులకు చెప్పిందని ఆగ్రహిస్తూ ఈనె 4వ తేదీన మహేష్‌బాబు తన నాయినమ్మపై గొడవపడి జుట్టుపట్టుకుని కొట్టాడంటూ ఫిర్యాదులో ఫిర్యాదులో పేర్కొంది. దాడి చేయగానే ఆమె కొండవీడు నుంచి చిలకలూరిపేటలో నివాసం ఉంటున్న తన కుమార్తె మాధవి వద్దకు వెళ్లింది. అయినా ఆమెకు ఫోన్లు చేసి మనవళ్లు వేధింపులకు గురి చేయడంతో పోలీసులను ఆశ్రయించి తన గోడును విన్నవించుకుంది. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాSప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ టి శివరామకృష్ణ తెలిపారు.

Read More

బక్రీద్ పండగ సందర్భంగా చిలకలూరిపేటలో యదేచ్ఛగా గోవధ.. బక్రీద్ పండగ సందర్భంగా చిలకలూరిపేట లో యదేచ్ఛగా గోవధ జరుగుతా ఉన్న పట్టించుకోని ప్రభుత్వ అధికారులు. చిలకలూరిపేట ఏలూరు రోడ్డులో బాలాజీ థియేటర్ సమీపంలో డంపింగ్ పాయింట్ ఏర్పాటు చేసుకొని అలాగే గణపవరం శాంతినగర్ లో మరొక డంపింగ్ పాయింట్ ఏర్పాటు చేసుకొని వాటిని వివిధ ప్రాంతాలకు తరలిస్తూ చిలకలూరిపేట రహమత్ నగర్ లో ఒక పాయింట్ రాచుమల్లు నగర్ నగర్ దగ్గర ఒక పాయింట్ గుర్రాలు చవిడి దగ్గర ఒక పాయింట్ కబేళా బజార్లో ఒక పాయింట్ పెట్టి నాలుగు ప్రాంతాలలో ఏదేచ్ఛగా గోవధ చేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో విచ్చలవిడిగా పశువుల అక్రమ రవాణా జరుగుతా ఉన్న పట్టించుకోని ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా పశువుల సంతల ద్వారా అక్రమ రవాణా అవుతున్న వాటిపై వెంటనే తగు చర్యలు తీసుకొని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద ఉద్యమం చేయాల్సిన…

Read More

పేటలో గోవధ పై అధికారులు పేపర్ స్టేట్మెంట్లకే పరిమితం, చర్యలు శూన్యం చిలకలూరిపేట:గోవధ నివారణకు ప్రభుత్వాలు, అధికారులు ఎంతగానో కృషి చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ముఖ్యంగా అధికారుల సమన్వయం లోపబూయిష్టముగాను ఉన్నదీ చిలకలూరిపేట నియోజకవర్గంలో గోవధ నిరాటంకంగా కొనసాగుతోంది. అధికారులు పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు తప్ప, వాస్తవానికి చర్యలు శూన్యమని గోరక్షకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోని మున్సిపల్ కమిషనర్ చిలకలూరిపేటలో గోవధపై అనేక ఫిర్యాదులు వస్తున్నా, మున్సిపల్ కమిషనర్ వాటిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.ఫిర్యాదులు అందినా, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల గోవధకు పాల్పడుతున్న వారిలో భయం లేకుండా పోయిందని, ఇది మరింతగా రెచ్చిపోవడానికి దారితీస్తోందని బాధితులు చెబుతున్నారు. అధికారులు తమ బాధ్యతలను విస్మరించడం వల్ల పవిత్రమైన గోజాతికి అన్యాయం జరుగుతోందని పలువురు వాపోతున్నారు. కమిటీల ఏర్పాటుపై అస్పష్టత గోవధకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కమిటీలు…

Read More

జూన్ 8న సీనియర్ సిటిజెన్లతో యోగాంధ్ర: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు నరసరావు పేట,జిల్లా కేంద్రం నరసరావు పేటతో పాటు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల పట్టణాలలో జూన్ 08న సీనియర్ సిటిజెన్లతో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు తెలిపారు. వృద్ధుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్న యోగాంధ్ర కార్యక్రమంపై అధికారులతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 9 సోమవారం గ్రామాలు, మండల కేంద్రాలు, మున్సిపాలిటీలలో యోగాంధ్ర ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, జిల్లా వ్యాప్తంగా 5,000 ప్రాంతాల్లో ఏకకాలంలో యోగా కార్యక్రమాలు నిర్వహించేందుకు స్థలాలను ఎంపిక చేసి, ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు.

Read More

అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం : రూరల్ ఎస్సై అనిల్ చిలకలూరిపేట రూరల్ ఎస్సై అనిల్ కుమార్ పసుమర్రు గ్రామంలో పర్యటించి గ్రామస్తులకు పలు సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై అనిల్ హెచ్చరించారు. పల్లె నిద్ర, అవగాహన కార్యక్రమం పోలీసుల బృందం పసుమర్రు గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించి గ్రామస్తులతో మమేకమయ్యారు. నేటి సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం. చర్చించిన ముఖ్య అంశాలు ఎస్సై అనిల్ గ్రామస్తులతో రోడ్డు ప్రమాదాలు, సైబర్ క్రైమ్, ఆస్తి గొడవలు, ఆత్మహత్యలు, గంజాయి స్మగ్లింగ్ వంటి వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ అంశాలపై ప్రజలకు ఉన్న సందేహాలను నివృత్తి చేసి, తీసుకోవాల్సిన జాగ్రత్తలనువివరించారు. పోలీసులకు సమాచారం…

Read More

ఈ నెల 10 నుంచి పొగాకు కొనుగోలు కేంద్రాలు పర్చూరు, ,చిలకలూరిపేట, మార్టూరు, మద్దిపాడు,ఇంకొల్లులలో కేంద్రాలు కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై మార్కెఫెడ్ డీఎం సమీక్ష పొగాకు కొంటామని ముందుకొచ్చిన ప్రభుత్వం మొత్తం పొగాకు కొంటామన్న కలెక్టర్ వెంకట మురళి మార్కెఫెడ్ ఆధ్వర్యంలో బ్లాక్ బర్లీ కొనుగోలు త్వరలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు సన్నాహాలు ఆరు కొనుగోలు కేంద్రాల నుంచి పొగాకు రైతులు వద్ద నుంచి కొనే అవకాశం క్వింటాకు 12000 తగ్గకుండా పొగాకు కొంటామన్నా అధికారులు ఫలించిన పొగాకు రైతులుదీక్ష,పోరాటాలు

Read More

కిశోరిబాలికలకు క్రీడలపై అవగాహన ర్యాలీ యడ్లపాడు ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కిశోరి వికాసం వేసవి శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో ఈ అవగాహన ర్యాలీని ఎంపీపీ ఝాన్సీ సాగర్, ఎంపీడీవో వి. హేమలతాదేవి బెలూన్లు ఎగురవేసి ప్రారంభించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీలో వారు మాట్లాడుతూ, పిల్లలను టీవీలు, సెల్‌ఫోన్లకు దూరంగా ఉంచి శారీరక శ్రమ కలిగించే క్రీడల్లో పాల్గొనేటట్లు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. క్రీడల ద్వారా మానసిక ఒత్తిడి తగ్గి, ఆరోగ్యవంతమైన జీవనశైలి అలవడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ కార్యకర్తలు, కిశోర బాలికలు పాల్గొన్నారు.

Read More

త్యాగం, క్షమకు కట్టుబడి ప్రతి ఒక్కరూ తమలోని స్వార్థాన్ని త్యజించాలన్నదే బక్రీద్ ప్రధానోద్దేశం : మాజీమంత్రి ప్రత్తిపాటి

Read More

పేట అభివృద్ధికి ప్రత్తిపాటి పుల్లారావు కృషి: మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని చిలకలూరిపేట పురపాలక సంఘం మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, తన చాంబర్‌లో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయిందని, ఈ కాలంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు నియోజకవర్గ ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం సాగర్ నుండి చిలకలూరిపేట మంచినీటి చెరువుకి నేరుగా పైప్‌లైన్ వేయించడం చాలా గొప్ప విషయమని, ఈ విషయంలో ప్రత్తిపాటి పుల్లారావుకు మున్సిపల్ చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు. గత సంవత్సర కాలంగా, కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి పురపాలక సంఘంలో పారిశుద్ధ్యం మరియు తాగునీటి విషయంలో చాలా కట్టుదిట్టంగా వ్యవహరించడం గొప్ప విషయమని ఆయన అన్నారు. పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహించే వారిని తొలగించాలని మున్సిపల్…

Read More