Author: chilakaluripetalocalnews@gmail.com

రేపటి నుండి రోహిణి కార్తే ప్రారంభం..రోహిణి కార్తె అంటే ఏంటీ..!? ఎండలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి ? రోహిణి కార్తే వచ్చింది అంటే వామ్మో రోహిణి కార్తెలో ఎండలకు రోకండ్లు పగిలే ఎండలు ఉంటాయి అనే నానుడి మనలో మెదలాడుతూ ఉంటుంది. నిజమే మరి ఈ నాలుగు నెలల ఎండాకాలంలో ఎండలు తోలి రోజులలో కొద్ది కొద్దికగా ఉగాది నుండి తాపం పెరుగుతుంది. దిన దిన ప్రవర్దనమానంగా సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని మనకు చూపిస్తాడు.మాములుగా ఉండే ఎండల వేడినే తట్టుకోలేమంటే ఎండాకాలంలో చివరి కార్తె అయిన రోహిణిలో ఎండలు దద్దరిల్లుతాయి.మరి ఈ సంవత్సరం రోహిణి కార్తె ఏలా ఉంటుందో గమనిద్దాం. తేదీ. ఈ సంవత్సరం రోహిణి కార్తే మే 25 న ప్రారంభమై జూన్ 8 వరకు రోహిణి కార్తె ఉంటుంది.రోహిణి కార్తె ఫలితంగా ఈ పక్షం రోజులు అధిక వేడి గాలులు , ఎండ తీవ్రతలు , అగ్ని…

Read More

పేట లో కోదండరామాలయం వద్ద కోడిగుడ్డు అట్ల విక్రయంపై భక్తుల ఆగ్రహం – చర్యలు తీసుకోవాలని డిమాండ్ కోదండ రామాలయం ఒక వైపు చికెన్ కిచిడి పరోట కబాబ్ చిలకలూరిపేట పట్టణంలోని పాత పోస్ట్ ఆఫీస్ బజార్, మద్ది మల్లయ్య వీధి శ్రీ కోదండరామాలయం గుడి ముందు కోడిగుడ్డు అట్లు విక్రయిస్తుండటంపై భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన దేవాలయం ఆవరణలో, మరీ ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో నిషిద్ధమైన మాంసాహార పదార్థాలను విక్రయించడం తమ మనోభావాలను దెబ్బతీస్తోందని పలువురు భక్తులు మండిపడుతున్నారు. భక్తుల ఆవేదన దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు. భక్తులు పవిత్ర భావనతో ఆలయాలకు వస్తారు. అటువంటి ప్రదేశంలో, ముఖ్యంగా రామచంద్రుడు కొలువై ఉన్న గుడి ముందు కోడిగుడ్డు అట్లు వంటి ‘నీచ పదార్థాలను’ విక్రయించడం దారుణమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది దేవాలయ పవిత్రతను, భక్తుల విశ్వాసాలను అవమానించడమేనని వారు వాదిస్తున్నారు. హిందూ ధర్మంలో దేవాలయాల పరిసరాల్లో…

Read More

ఇన్న‌ర్‌వీల్ క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో చ‌ట్టాలపై అవ‌గాహ‌న‌.. దివ్యాంగురాలికి ట్రైసైకిల్ అంద‌జేత దాతృత్వంచాటుకున్న క్లబ్ సభ్యులు చిల‌క‌లూరిపేట‌:సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూనే, ప్ర‌జ‌ల‌కు ముఖ్యంగా మ‌హిళ‌ల‌కు న్యాయ ప‌రిజ్ఞానాన్ని ప‌రిచ‌యం చేస్తున్న ఇన్న‌ర్‌వీల్ క్ల‌బ్ ఆఫ్ చిల‌క‌లూరిపేట సేవ‌లు ప్ర‌శంస‌నీయ‌మైన‌వ‌ని న్యాయ‌వాదులు మాదాసు భానుప్ర‌సాద్‌, శ్రీ‌నివాస‌రావు చెప్పారు. ఇన్న‌ర్‌వీల్ క్ల‌బ్ఆఫ్ చిల‌క‌లూరిపేట ఆధ్వ‌ర్యంలో శ‌నివారం ప‌ట్ట‌ణంలోని సుగాలికాల‌నీ అంగ‌న్‌వాడీ కేంద్రం వ‌ద్ద మ‌హిళ‌ల‌కు వివిధ అంశాల‌పై న్యాయ‌వాదులు మాదాసు భానుప్ర‌సాద్‌, శ్రీ‌నివాస‌రావు అవ‌గాహ‌న క‌ల్పించారు. కార్య‌క్ర‌మానికి క్ల‌బ్ అధ్య‌క్షురాలు గ‌ట్టు స‌రోజిని అధ్య‌క్ష‌త వ‌హించారు. ఈ సంద‌ర్బంగా వారు మాట్లాడుతూ ప్ర‌తి ఒక్క‌రూ ప్రాధ‌మిక న్యాయ ప‌రిజ్ఞానం క‌లిగి ఉండాల‌ని సూచించారు. ప్రతి ఒక్కరూ చ‌ట్టాల గురించి తెలుసుకోవడం వల్ల సమాజం మెరుగవుతుందని, ప్రజలకు వారి హక్కులు తెలుసుంటే, వారు వారి హక్కులను కాపాడుకోవచ్చుని, సమాజంలో న్యాయం కోసం పోరాడవచ్చుని వెల్ల‌డించారు.

Read More

చిలకలూరిపేట పట్టణంలోని, బొందిలిపాలెం, ఓగేరు రోడ్డు నందు వేంచేసియున్నా శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానం నందు శ్రీ పోలేరమ్మ తల్లి ఏకాదశ జాతర మహోత్సవాలలో భాగంగా అమ్మవారికి ఆలయ కమిటీ వారు నిర్వహించిన పంచామృత అభిషేకములు, మరియు కమిటీ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో పాల్గొని, అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ షేక్ రఫ్ఫాని గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా గారు, నెల్లూరి సదాశివరావు గారు, జవ్వాజి మదన్ గారు, పఠాన్ సమద్ గారు, మద్దుమాల రవి గారు, ఆలయ కమిటీ సభ్యులు బీకాం శ్రీనివాస్, మిద్దెల పూర్ణ సింగ్, గిరి, హనుమాన్ సింగ్, బి.రామాంజనేయ సింగ్, ప్రతాప్ సింగ్, చేజర్ల శ్రీనివాస్ సింగ్, ఉదయ్ సింగ్ మరియు వార్డ్ నాయకులు పాల్గొన్నారు…

Read More

ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు రక్త దాన శిబిరానికి విశేష స్పందన ముందుకొచ్చి రక్తాన్ని దానం చేసిన యువత చిలకలూరిపేట ఎమ్మార్వో ఆఫీస్ లో జరిగిన రక్త దాన శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు చిలకలూరిపేట తహశీల్దార్ కార్యాలయంలో శనివారం మెగా రక్త దాన శిబిరం ఏర్పాటు చేశారు. పట్టణంలో ని పలు ప్రాంతాల నుంచి యువకులు ముందుకొచ్చి రక్తాన్ని దానం చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సహకారంతో ఈ రక్త దాన శిబిరం జరిగింది. ఆపద సమయంలో,అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక అనేక మంది ఇబ్బందులు కు గురవుతున్నారని, ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయని,అలాంటి వారి కోసం ఈ రక్త దాన శిభిరాలు ఉపయోగ పడతాయని ఎమ్మెల్యే ప్రత్తిపాటి అన్నారు. రక్తం ఇచ్చిన యువతను ఎమ్మెల్యే ప్రత్తిపాటి, ఎమ్మార్వో హుస్సేన్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి పలువురు…

Read More

విస్తృత స్థాయిలో వాహనాలు తనిఖీ చేసిన మూడు శాఖల అధికారులు భారీగా అపరాధ రుసుం వసూలు… కేసులు నమోదు చిలకలూరిపేట పట్టణంలో ని పలు ప్రాంతాల్లో క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు బృందం 18కేసులు నమోదు….5 వాహనాలు సీజ్….91,720 జరిమానా విధించిన అధికారులు చిలకలూరిపేట రవాణా శాఖ ,పోలీసు,మోటార్ వెహికిల్ అధికారులు సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన దాడులు. సరైన అనుమతి పత్రాలు లేని 18 ఆటో,సరుకు రవాణా వాహనాలపై కేసులు నమోదు ఐదు వాహనాలు సీజ్ చేసి,91720 రూపాయల అపరాధ రుసుం విధించిన అధికారులు బృందం వాహనాలు కు సంబంధించిన పలు రకాల పత్రాలు…లేని వాహనాలు పై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

Read More

ఎట్టకేలకు పోస్టింగ్ సాధించినTPO సుజాత తాడిపత్రి పట్టణ ప్రణాళిక అధికారిణి ( TPO)గా కుంజా సుజాత నిన్నటి వరకు చిలకలూరిపేట పురపాలక సంఘం TPS గా విధులు నిర్వహించిన సుజాత పదోన్నతి పై రేపల్లె కు బదిలీ కాగా…. అక్కడ కొన్ని కారణాల రీత్యా ,ఖాళీ లేక ,రేపల్లె లో చేరలేదు.. ఈ నెల14న చిలకలూరిపేట నుంచి బదిలీ అయిన సుజాత…. వారం పాటు వెయిటింగ్ లో ఉంది. ఆ తదుపరి ఈ నెల 22న శుక్రవారం సాయంత్రం తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో TPO గా భాద్యతలు స్వీకరించారు .

Read More

మున్సిపాలిటీ అవినీతి కుంభకోణంపై స‌మగ్ర విచార‌ణ నిర్వ‌హించాలి ఈ వ్య‌వ‌హారంలో సూత్ర‌ధారులెవ‌రో నిగ్గుతేల్చాలి జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజి చిల‌క‌లూరిపేట మున్సిపాలిటీ లో ల‌క్ష‌ల కుంభకోణం వెనుక దాగి ఉన్న పెద్ద మ‌నుషుల భాగోతాన్ని బ‌య‌టకు వెలికి తీయాల‌ని, ఈ అంశంపై సూత్ర‌ధారుల పాత్ర పై స‌మ‌గ్ర విచార‌ణ నిర్వ‌హించాల‌ని జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజి కోరారు. శ‌నివారం ఆయ‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో బాలాజి మాట్లాడుతూ గ‌త ప్ర‌భుత్వ హాయంలో ఔట్ సోర్సింగ్ చేసిన అవినీతికి కొంత‌మంది ఉద్యోగుల‌ను బాధ్యుల‌ను చేసి స‌స్పెండ్ చేశార‌ని, ఇదే క్ర‌మంలో ఈ ఉద్యోగి త‌ప్పు చేయ‌టానికి కార‌కులైన వారు, త‌ప్పును క‌ప్పి పుచ్చి క‌నీస విచార‌ణ కూడా జ‌ర‌గ‌కుండా సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి అడ్డుప‌డిన‌వారిపై చ‌ర్య‌లు ఏవ‌ని ప్ర‌శ్నించారు.

Read More

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పట్టిష్టమైన చర్యలు తీసుకోండి – రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ.. లోక్ సత్తా పార్టీ, మాదాసు భాను ప్రసాద్ రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మరియు అడ్వకేట్ మాదాసు భాను ప్రసాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ వ్రాశారు. చిలకలూరిపేట పట్టణంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతో మంది చనిపోయారని, ఇంకా ఎంతోమంది క్షతగాత్రులై జీవితకాలం అంగవైకల్యాన్ని అనుభవిస్తున్నారు. ఆలోచిస్తే, వీటిలో ఎక్కువ శాతం నివారించదగిన రోడ్డు ప్రమాదాలే.కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తే ఆ నష్టం ఎంత మాత్రమూ భర్తీ చేయలేనిదని మరియు ఎంత నష్ట పరిహారం ఇచ్చినా, ఇన్సూరెన్స్ ఇచ్చిననూ కుటుంబంలో ఆలోటు పూడ్చలేనిదిని లేఖలు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించుటకు కనీస ప్రమాణాలను పాటించకుండా ప్రమాదాలను అరికట్టడం సాధ్యం కాదు అనే విషయం జగమెరిగిన సత్యం. ఓవైపు శాస్త్ర సాంకేతిక…

Read More

పోక్సో కేసు లో నిందితుడు అరెస్ట్ జులై 5 వరకు రిమాండ్ విధించిన కోర్టు వివరాలు వెల్లడించిన SI శివ రామకృష్ణ గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం హౌస్‌గణేష్‌పాడు గ్రామ నివాసి ఆళ్ల కొండలు అనే వ్యక్తి, మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ బాలికను మోసపూరితంగా ఆసక్తికరమైన మాటలతో ఆకర్షించి సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన గత నెల 15వ తేదీన జరిగింది. ఈ మేరకు బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా యడ్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నరసరావుపేట డీఎస్పీ పర్యవేక్షణలో విచారణ చేపట్టిన పోలీసులు, సాంకేతిక ఆధారాలతో పాటు వాంగ్మూలాలు సేకరించారు. నిందితుడిని ఈ నెల 22వ తేదీన పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలెం గ్రామంలోని హైవే వంతెన వద్ద పట్టుకున్నారు. శుక్రవారం చిలకలూరిపేట అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి (జూనియర్‌ డివిజన్‌)…

Read More