చిలకలూరిపేట నియోజకవర్గ బిజెపి విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం
చిలకలూరిపేట నియోజకవర్గ విస్తృత సమావేశం జోనల్ ఇంచార్జ్ దయాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్తలకు ఏ విధంగా పనిచేయాలో పలు సూచనలు అందించారు. పలు అంశాలను చర్చించి బిజెపిపార్టీని లోపేతం చేయటానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. కూటమి ప్రభుత్వంలో జరుగుచున్న విధానాల గురించి చర్చించి కార్యకర్తలను అభిప్రాయాలను తెలుసుకొని పార్టీ దృష్టికి తీసుకువెళతానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్, జిల్లా ఇన్చార్జి కొక్కెర శ్రీనివాస్ యాదవ్, జిల్లా నాయకులు కేతనబోయిన హనుమంతరావు, బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు పోట్రు పూర్ణచందర్రావు, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు రంజిత్, జిల్లా కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వరరావు, నియోజకవర్గ కన్వీనర్ తాటిపర్తి జయరాం రెడ్డి, నియోజకవర్గ కో కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు పవన్ కుమార్ గాంధీ, ఎడ్లపాడు మండల అధ్యక్షులు తులాబందుల సత్యనారాయణ మరియు మండల అధ్యక్షులు నియోజకవర్గ కార్యకర్తలు క్రియాశీలక సభ్యులు పాల్గొన్నారు.



