జగన్ చేయాల్సింది పశ్చాత్తాప, ప్రాయశ్చిత్త, సంతాప దినాలు : మాజీమంత్రి ప్రత్తిపాటి
- గత ఏడాది జూన్ 4న ప్రజలు తనకు వెన్నుపోటు పొడిచారన్నది జగన్ ఉద్దేశమా? – ప్రత్తిపాటి.
- తండ్రికి వెన్నుపోటు.. బాబాయ్ కి గొడ్డలిపోటు.. తన కోడికత్తి గాటు..గులకరాయి గీటు.. ఇవే జగన్ రాజకీయాలు – ప్రత్తిపాటి
- జగన్ మాజీ ముఖ్యమంత్రిలా కాకుండా మాజీ ఖైదీలానే ఆలోచిస్తున్నాడు ః ప్రత్తిపాటి “4వ తేదీన జగన్ ఎందుకు వెన్నుపోటు దినానికి పిలుపునిచ్చాడో చెప్పాలి. తనను, తన పార్టీని దారుణంగా ఓడించి, 11 సీట్లకు పరిమితం చేసి ప్రజలు తనకు వెన్నుపోటు పొడిచారన్నది జగన్ ఉద్దేశమా? ప్రజాస్వామ్యంలో ప్రజల్ని గౌరవించని, వారి అభిప్రాయాలు.. ఆలోచనలకు విలువ ఇవ్వని ఏకైక రాజకీయ నాయకుడిగా జగన్ చరిత్రలో నిలిచిపోతాడు. నిర్మాణాత్మక సూచనలు, వివరణాత్మక చర్యలతో రాష్ట్రాభివృద్ధికి సహకరిద్దాం.. పాలకపక్షానికి మంచి సూచనలు, సలహాలు ఇద్దామనే కనీస ఆలోచన కూడా జగన్ కు లేకపోవడం విచారకరం.