జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులకు,మండల అధ్యక్షులకు మరియు పట్టణ నాయకులకు గ్రామ అధ్యక్షులకు,కార్యకర్తలకు నమస్కారం
జనసేన పార్టీ అధిష్టానం… డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదలై ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా సుపరిపాలన మొదలై ఏడాది – పీడా విరగడై ఏడాది అనే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సంక్రాంతి – దీపావళి పండుగలను కలిపి చేసుకోవాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఉదయం పూట ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేసి అలాగే ముగ్గుల పోటీలు నిర్వహించి మరియు సాయంత్రం పూట దీపాలు వెలిగించి టపాకాయలు పేల్చవలసిందిగా పార్టీ అధిష్టానం ఈ ఉదయం వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ కొంజేటి నాగ శ్రీను రాయల్ గారికి పిలుపునివ్వడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని స్థానిక నాయకులందరితో కలిసి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము.