సిద్ధి గణపతి, అభయాంజనేయస్వామి వార్ల గ్రామోత్సవంలో పాల్గొన్న ప్రత్తిపాటి
శ్రీ సిద్ధిగణపతి, శ్రీ అభయాంజనేయస్వామి, సీతలాంబ తల్లి బొడ్డురాయి ప్రతిష్ఠా మహోత్సవాల్లో భాగంగా తలపెట్టిన గ్రామోత్సవాన్ని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. మంగళవారం యడ్లపాడు మండలం జగ్గాపురంలో జరిగిన గ్రామోత్సవంలో పాల్గొన్న ప్రత్తిపాటి ప్రజలతో కలిసి స్వామివార్లకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన హోమంలో పాల్గొని అర్చకుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతం ప్రతిష్ఠా మహోత్సవ ఏర్పాట్లపై గ్రామస్తులు, కార్యక్రమాల నిర్వాహకులతో మాట్లాడారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, స్వామివార్ల అనుగ్రహాం లభించేలా శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా ప్రతిష్టామహోత్సవం నిర్వహించాలని ప్రత్తిపాటి సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నెల్లూరి సదాశివరావు, కామినేని సాయిబాబు, ముద్దన నాగేశ్వరరావు, వీరారెడ్డి, శ్రీనివాసరెడ్డి, కందిమళ్ళ రఘురామారావు, సుబ్బారావు, శంకర్రావు, గట్టినేని విజయ్ సాయి, పోపూరి వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, ముద్దన పార్థసారథి, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.