Author: chilakaluripetalocalnews@gmail.com

విజయవాడలో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న పల్నాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మరియు జనతా వారధి కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు ప్రజల పక్షాన బీజేపీ – “జనతా వారధి” విజయపథం ​ విజయవాడలోని బిజెపి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో, గౌరవనీయులు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారు అధ్యక్షతన నిర్వహించిన “జనతా వారధి” రివ్యూ సమావేశానికి పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరావు హాజరుకావడం జరిగింది సమీక్షా సమావేశంలో పల్నాడు జిల్లాలో ఇప్పటివరకు జరిగిన జనతా వారది కార్యక్రమాల గురించి పూర్తి వివరాలు రాష్ట్ర జట్టుకు అందించడం జరిగింది . వాటిని పరిశీలించిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరావు ను సభాముఖంగా అభినందించడం జరిగింది ​ఈ సందర్భంగా మాధవ్ గారు “జనతా వారధి” కార్యక్రమ పురోగతిని సమీక్షించి, ప్రజల…

Read More

’విశాఖ రైల్వే జోన్’…. ముఖ్యమంత్రి అభివృద్ధి ఆలోచనల కార్యరూపంలో మరో ప్రధాన అడుగు : ప్రత్తిపాటి కొత్త జోన్ తో ప్రధాన పోర్టులు, పారిశ్రామిక హబ్ లకు అనుసంధానిస్తూ ధృఢమైన రైల్వే కారిడార్కొత్త జోన్ తో పాటు.. ప్రత్యేక వందే భారత్, అమృత్ భారత్ రైళ్ల కేటాయింపుతో రాష్ట్ర రైల్వే వ్యవస్థ మునుపెన్నడూ లేని విధంగా బలోపేతం అవనుంది. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలతో పాటు.. పారిశ్రామిక అభివృద్ధికి మార్గం సుగమం కానుంది. రాష్ట్రంలోని ప్రధాన పోర్టులు, పారిశ్రామిక హబ్ లను అనుసంధానిస్తూ ధృఢమైన, విశాలమైన సరికొత్త రైల్వే కారిడార్ ఏర్పడనుంది.చౌకైన, సౌకర్యవంతమైన, మెరుగైన రైల్వే ప్రయాణ సౌకర్యంతో పాటు భారీ సరుకు రవాణా వ్యవస్థ ప్రజలకు అందుబాటులోకి రానుంది. కొత్త జోన్ పరిధిలో 74 స్టేషన్ల ఆధునికీకరణతో పాటు.. 1039 కి.మీ. మేర కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కానుంది.” అని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు మంగళవారం…

Read More

పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించిన పల్నాడు జిల్లా జనతా వారధి టీం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు పలనాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరు శశి కుమార్ గారి అనుమతితో ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పలనాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మరియు పల్నాడు జిల్లా జనతా వారిది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు పలనాడు జిల్లా జనతా భారతి మీడియా ఇన్ఛార్జి కోమటి వాసు మరియు పల్నాడు జిల్లా బిజెపి నాయకులు పాల్గొనడం జరిగింది ఈ విషయంపై స్పందించిన డిఆర్ఓ గారు అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సుభాని గారికి ఈ విషయాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది విషయంరాష్ట్రంలోని నిర్మాణ కార్మికులకు జారీ చేస్తున్న AP Labour Card / BOCW Card నమోదు,…

Read More

’పేదల సేవలో’ … చంద్రబాబు పేదలకు అందిస్తున్న గొప్ప ప్రజా కర్షక పథకం : ప్రత్తిపాటి పేదల సేవలో పేరిట ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు ప్రతినెలా 1వ తేదీన పేదల ఇళ్లకు వెళ్లిమరీ సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, ఈ విధంగా గొప్పగా అమలవుతున్న ప్రజాకర్షక పథకం ఏపీలో తప్ప దేశంలో మరెక్కడా లేదని శాసనసభ్యులు, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పేదల సేవలో భాగంగా శుక్రవారం ఆయన పట్టణంలోని 13వ వార్డు (మద్దినగర్), 14వ వార్డు (రహమత్ నగర్) లతో పాటు చిలకలూరిపేట మండలం పసుమర్రు, నాదెండ్ల మండలం గణపవరం, యడ్లపాడు మండల కేంద్రంలో లబ్ధిదారులకు స్వయంగా సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రదేశాల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం ప్రత్తిపాటి విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిస్తూ పేదలకు ఆర్థిక భద్రత కల్పిస్తున్నారు.రాష్ట్రం…

Read More

ముఖ్యమంత్రి సహాయ నిధి… ప్రజలకు గొప్ప ఆరోగ్య రక్షణ నిధి: ప్రత్తిపాటి ఆపదలో ఉన్న పేద, మధ్య తరగతి కుటుంబాలవారు ఎదుర్కొనే అనారోగ్య సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తగిన సాయం అందిస్తోందని శాసనసభ్యులు, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన స్థానిక క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ నగదు చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 23 మంది లబ్ధిదారులకు రూ.14.70 లక్షల విలువైన చెక్కుల్ని స్వయంగా అందచేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడిన ప్రత్తిపాటి, ప్రభుత్వ పథకాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు వారికి అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపత్కాలంలో ప్రజలకు అండగా నిలిచే, వారి ఆరోగ్యాన్ని రక్షించే గొప్ప నిధి అని, వారికి ఎంతగానో ఉపయోగపడే గొప్ప సాయమని ప్రత్తిపాటి చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్…

Read More

పొలంలో మంటలు అంటుకుని వృద్ధురాలు దుర్మరణం.. వ్యవసాయ పొలంలో వ్యర్థాలను తగులబెట్టే క్రమంలో జరిగిన ప్రమాదంలో ఒక వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలోచోటుచేసుకుంది.​స్థానిక గ్రామస్తులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాపురం గ్రామానికి చెందిన పావులూరి పిచ్చమ్మ (70) అనే మహిళకు గ్రామంలో వ్యవసాయ పొలం ఉంది. బుధవారం మధ్యాహ్నం సుమారు 3:00 గంటల సమయంలో ఆమె తన పొలానికి వెళ్లింది. మొక్కజొన్న పంట కోత పూర్తయిన తర్వాత పొలంలో మిగిలిపోయిన ఎండిన మొక్కలను (చెత్తను) తొలగించేందుకు ఆమె వాటికి నిప్పు పెట్టింది.​ఎండ తీవ్రతకు తోడు గాలి వీస్తుండటంతో మంటలు ఒక్కసారిగా పక్కనే ఉన్న పొలానికి వ్యాపించాయి. మంటలు విస్తరించడాన్ని గమనించిన పిచ్చమ్మ, వాటిని అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది.ఈ క్రమంలో ఆమె చీరకూ నిప్పు అంటుకుంది. మంటలు క్షణాల్లో శరీరం అంతా వ్యాపించడంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది.​​సమాచారం…

Read More

ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాసరావుకు తోట రాజా రమేష్ మరియు మండలనేని చరణ్ తేజ ఆధ్వర్యంలో ఘన స్వాగతం చిలకలూరిపేట: వినుకొండ నియోజకవర్గంలో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాసరావుకు చిలకలూరిపేట పట్టణ బైపాస్ రోడ్డు వద్ద జనసేన నాయకులు, వీర మహిళలు,కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జనసేన పార్టీ నియోజకవర్గ యువ నాయకులు ప్రదాత మండలనేని చరణ్ తేజ ఆధ్వర్యంలో వీర మహిళలు, పార్టీ శ్రేణులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించారు. అనంతరం అక్కడ నుండి భారీ ర్యాలీగా నరసరావుపేటలోని జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకుని, పల్నాడు జిల్లా సమన్వయకర్తలు మరియు ముఖ్య నాయకులతో కలిసి టీ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పల్నాడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ స్థితిగతులపై ముఖ్యంగా చర్చ జరిగింది. చిలకలూరిపేట నియోజకవర్గంలో పార్టీ ఎదుగుదల, పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు చేపట్టిన…

Read More

చిలకలూరిపేట రూరల్ పరిధిలో పేకాట శిబిరాలపై దాడులు: 11 మంది అరెస్ట్ చిలకలూరిపేట:మండల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై రూరల్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. బుధవారం మండలంలోని పసుమర్రు మరియు మానుకొండ వారిపాలెం గ్రామాల్లో నిర్వహించిన పేకాట శిబిరాలపై రూరల్ ఎస్ఐ జి. అనిల్ కుమార్ తన సిబ్బందితో కలిసి మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలు:పసుమర్రు పరిధిలో: గొర్రెల మండి రోడ్డులో కోత ముక్క పేకాటాడుతున్న ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి ₹2,200 నగదు మరియు 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మానుకొండవారిపాలెం పొలాల్లో: పొలాల్లో రహస్యంగా పేకాటాడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి ₹3,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా కోడిపందాలు, పేకాట…

Read More

విలేఖరి జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా ఏపీయూడబ్ల్యూజే, ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో తాసిల్దారికి వినతి పత్రం చిలకలూరిపేట: చిత్తూరు జిల్లా వి.కోట మండల ఆంధ్రజ్యోతి (ABN) విలేఖరి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కిరాతక దాడిని, ఆయన హత్యను నిరసిస్తూ చిలకలూరిపేటలో పాత్రికేయ సంఘాలు గళమెత్తాయి. ఏపీయూడబ్ల్యూజే, ఏపీఈఎంజేఏ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తహసిల్దార్ మొహమ్మద్ హుస్సేన్‌కు వినతిపత్రం అందజేశారు.మంగళవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లి వస్తున్న జగన్మోహన్ రెడ్డిని దుండగులు వేటకొడవళ్లతో వెంటాడి అత్యంత హేయంగా హత్య చేయడంపై జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా శ్రీగంధం చెట్ల అక్రమ రవాణాపై ఆయన రాసిన వార్తలే ఈ హత్యకు ప్రేరణగా నిలిచాయని, వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న పాత్రికేయుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు వంటివని…

Read More

చిత్తూరు జిల్లా లొ ఆంధ్రజ్యోతి పత్రిక విలేకరి దారుణ హత్యను ఖండించిన కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు చిత్తూరు జిల్లాలో ఓ పత్రికా విలేకరిని చంపేశారు. వి.కోట మండలం ఆంధ్రజ్యోతి విలేకరి దారుణ హత్యకు గురయ్యారు. ఉదయాన్నే ఆయన వాకింగ్ చేసే సమయంలో కొంతమంది వ్యక్తులు వెంటాడి ఇంటికి సమీపంలోనే కత్తులతో నరికి చంపేశారు. ఈ సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. వివరాలు సేకరిస్తున్నారు..ఇలాంటోళ్ళు నెల్లూరు రూరల్ మండలం లో MLA మాదిరిగా చెలరేగి పోతున్నారు ఈ దారుణ హత్యకు పాల్పడ్డ వ్యక్తులు ఎటువంటి వారైనా సరే వదిలిపెట్టకుండా పోలీసు వారు తగు చర్యలు వెంటనే తీసుకోవాలని కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు

Read More