’విశాఖ రైల్వే జోన్’…. ముఖ్యమంత్రి అభివృద్ధి ఆలోచనల కార్యరూపంలో మరో ప్రధాన అడుగు : ప్రత్తిపాటి
- నూతన రైల్వే జోన్ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు…. పారిశ్రామిక అభివృద్ధికి మార్గం సుగమం : ప్రత్తిపాటి
- కొత్త జోన్ పరిధిలో 74 స్టేషన్ల ఆధునికీకరణతో పాటు.. 1039 కి.మీ. మేర కొత్త రైల్వే లైన్ ఏర్పాటు : ప్రత్తిపాటి
- ప్రధాన పోర్టులు, పారిశ్రామిక హబ్ లను అనుసంధానిస్తూ ధృఢమైన, విశాలమైన్ రైల్వే కారిడార్ : ప్రత్తిపాటి “నిన్న అమరావతికి చట్టబద్ధత.. నేడు విశాఖ రైల్వే జోన్ కు గెజిట్ నోటిఫికేషన్, ఇవి రెండూ డబుల్ ఇంజిన్ సర్కార్..రాకెట్ స్పీడ్ వేగానికి, దిల్లీ, అమరావతి పాలకుల వేగవంతమైన సుస్థిర పాలనకు గీటురాళ్లు అనే చెప్పాలి. కొత్త రైల్వే జోన్ తో, రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్ గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి ఆలోచనల కార్యరూపంలో మరో ప్రధాన అడుగు పడినట్టైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కృషి, పరస్పర సహకారం వల్లే 1 జూన్ 2026 నుంచి అమల్లోకి విశాఖ డివిజన్ కేంద్రంగా నూతన రైల్వే జోన్. 2014 విభజన చట్టం హామీల్లో మరో ప్రధాన వాగ్ధానం అమలుపై ప్రజల్లో హర్షాతిరేకాలు. ఈ తరహా రవాణా వ్యవస్థలతో పాటు.. కేంద్రం ఇబ్బడిముబ్బడిగా రాష్ట్ర ప్రగతికి అవసరమైన ఆర్థిక సహయం అందించాలని, అప్పుడే ప్రధాని మోదీ చిరకాల స్వప్నమైన వికసిత్ భారత్ లో ఏపీ కీలక భూమిక పోషించగలుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు.
కొత్త జోన్ తో ప్రధాన పోర్టులు, పారిశ్రామిక హబ్ లకు అనుసంధానిస్తూ ధృఢమైన రైల్వే కారిడార్
కొత్త జోన్ తో పాటు.. ప్రత్యేక వందే భారత్, అమృత్ భారత్ రైళ్ల కేటాయింపుతో రాష్ట్ర రైల్వే వ్యవస్థ మునుపెన్నడూ లేని విధంగా బలోపేతం అవనుంది. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలతో పాటు.. పారిశ్రామిక అభివృద్ధికి మార్గం సుగమం కానుంది. రాష్ట్రంలోని ప్రధాన పోర్టులు, పారిశ్రామిక హబ్ లను అనుసంధానిస్తూ ధృఢమైన, విశాలమైన సరికొత్త రైల్వే కారిడార్ ఏర్పడనుంది.
చౌకైన, సౌకర్యవంతమైన, మెరుగైన రైల్వే ప్రయాణ సౌకర్యంతో పాటు భారీ సరుకు రవాణా వ్యవస్థ ప్రజలకు అందుబాటులోకి రానుంది. కొత్త జోన్ పరిధిలో 74 స్టేషన్ల ఆధునికీకరణతో పాటు.. 1039 కి.మీ. మేర కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కానుంది.” అని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.



