పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించిన పల్నాడు జిల్లా జనతా వారధి టీం
రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు పలనాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరు శశి కుమార్ గారి అనుమతితో ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది
ఈ కార్యక్రమంలో పలనాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మరియు పల్నాడు జిల్లా జనతా వారిది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు పలనాడు జిల్లా జనతా భారతి మీడియా ఇన్ఛార్జి కోమటి వాసు మరియు పల్నాడు జిల్లా బిజెపి నాయకులు పాల్గొనడం జరిగింది
ఈ విషయంపై స్పందించిన డిఆర్ఓ గారు అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సుభాని గారికి ఈ విషయాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది
విషయం
రాష్ట్రంలోని నిర్మాణ కార్మికులకు జారీ చేస్తున్న AP Labour Card / BOCW Card నమోదు, రెన్యువల్, క్లెయిమ్, అవగాహన, శాఖల సమన్వయం వంటి అంశాలను సరళీకృతం చేసి నిజమైన లబ్ధి అందించాలనే వినతి
రాష్ట్ర అభివృద్ధికి పునాది వేసే నిర్మాణ కార్మికులు తమ చెమటతో రోడ్లు, ఇళ్లు, కార్యాలయాలు, భారీ భవనాలు నిర్మిస్తున్నారు. అయితే అదే కార్మికుడు తన హక్కు కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడటం బాధాకరం.
ఆంధ్రప్రదేశ్ లో ఆదర్శమైన అభివృద్ధి సంక్షేమం లక్ష్యసాధనతో సమిష్టిగా పని చేస్తున్న కూటమి ప్రభుత్వ సేవలు ప్రతి అర్హుడికి చేరాలి. పారదర్శకమైన పాలన అందాలి. అనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ గ్రామాలు, నగరాలను సందర్శిస్తూ ప్రజా సమస్యలను అధ్యయనం చేస్తోంది. ప్రతి శుక్రవారం BJP కార్యాలయాల్లో ప్రజల నుంచి సమస్యలను స్వీకరిస్తూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తోంది. ప్రతి సోమవారం ఆయా అధికారుల ద్వారా ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకువెళ్లి సూచనలు, సలహాలు అందిస్తోంది. అవసరమైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే బాధ్యతను కూడా నిర్వర్తిస్తోంది.
ఈ క్రమంలో భవన నిర్మాణ కార్మికులు, పేద కూలీల నుంచి అనేక వినతిపత్రాలు అందాయి.
వారి సమస్యలను పరిశీలించినప్పుడు….,
గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు తీరని అన్యాయం చేసింది. కార్మికుల కోట్ల రూపాయలు దారి మల్లించింది అని బాధపడుతున్నారు.
లేబర్ కార్డు ప్రయోజనాలపై అవగాహన లేకపోవడం, అర్హులైన వారు కూడా లబ్ధి పొందకపోవడం, తమకు ఉన్న హక్కులపై స్పష్టత లేకపోవడం, మధ్యవర్తుల చేతుల్లో BOCW Card నలిగిపోవడం, పేదవాడి హక్కు చిరునామా లేకుండా తిరుగుతున్న పరిస్థితి కనిపించింది. ఇది అత్యంత బాధాకరం.
ప్రభుత్వం 18 లక్షల మంది కార్మికులు BOCW Card / labour Card కోసం నమోదు అయ్యారు అని చెబుతోంది. అయితే, ఎంతమందికి కార్డు జారీ చేశారు? ఎంతమందికి నిజంగా లబ్ధి అందింది? ఏ పథకం ద్వారా ఎంతమందికి సహాయం అందింది? ఇందులో నిర్మాణ రంగంలో ఉన్న నిజమైన కార్మికులు ఎంతమంది? అనే విషయాల్లో స్పష్టత లేదు.
AP Labour Card / BOCW Card అంటే Andhra Pradesh Building and Other Construction Workers Welfare Board ద్వారా నిర్మాణ కార్మికులకు జారీ చేసే సంక్షేమ గుర్తింపు కార్డు. ఈ కార్డు ద్వారా కార్మికుడు ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం అర్హత పొందుతాడు.
వయస్సు 18 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. గత 12 నెలల్లో కనీసం 90 రోజులు నిర్మాణ పనిలో పనిచేసి ఉండాలి అనేది అర్హత.
ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, మొబైల్ నంబర్, పని ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తదితర డాక్యుమెంట్స్ ఉండాలి. గ్రామ / వార్డు సచివాలయం, MeeSeva కేంద్రాలు, Labour Office, అధికారిక పోర్టల్ లలో నమోదు చేసుకోవాలి.
ప్రమాద మరణం / శాశ్వత వికలాంగత్వం జరిగితే ₹5,00,000 వరకు, సహజ మరణం కు ₹60,000 వరకు, అంత్యక్రియల సాయం గా ₹20,000 వరకు, ప్రసూతి సహకారం కోసం ₹20,000 వరకు, వివాహ సాయం ₹40,000 వరకు, పిల్లల విద్యా సాయం / స్కాలర్‌షిప్, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ప్రయోజనాలు కార్డు ద్వారా పొందుతారు.
ప్రమాదం అయితే FIR / ఆసుపత్రి రికార్డు, మరణం అయితే Death సర్టిఫికెట్, ప్రసూతి కి ఆసుపత్రి ధృవీకరణ, వివాహం కోసం వివాహ ధృవీకరణ, విద్యా సాయం కోసం Bonafide / మార్కుల మెమో అవసరం అవుతాయి.
ఈ విధివిధానాలు పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యుత్తమమైన లేబర్ సంక్షేమ పథకాన్ని రూపొందించింది. పథకం గొప్పది కానీ ప్రచారం అమలు బలహీనంగా ఉంది.
ఈ లేబర్ కార్డు హక్కులు సమర్థంగా అమలు కావాలంటే Labour Department , APBOCW Welfare Board, గ్రామ / వార్డు సచివాలయ శాఖ, పోలీస్ శాఖ, ఆరోగ్య శాఖ / ఆసుపత్రులు, Revenue శాఖ, MeeSeva / IT శాఖ, విద్యాశాఖ లు సమన్వయం తో పని చేయాలి. కానీ వాస్తవంగా ఈ శాఖల మధ్య సమన్వయం కనిపించడం లేదు. నిర్లక్ష్యం మరియు నిర్లిప్తత కనిపిస్తోంది.
రిజిస్ట్రేషన్ ఉంది. కానీ లబ్ధి తక్కువ, అవగాహన లేదు, సంఘాల పేరుతో మధ్యవర్తులు పెరిగారు, కార్మికుడు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాడు, Renewal విధానంలో లోపాలు వున్నాయి. ప్రతి సంవత్సరం 90 రోజుల పని ధృవీకరణ, పత్రాల సమర్పణ వల్ల కార్మికుడు ఇబ్బంది పడుతున్నాడు. చాలా చోట్ల యాజమాన్యం పని ధృవీకరణ ఇవ్వడం లేదు.
కేంద్ర ప్రభుత్వం Pradhan Mantri Suraksha Bima Yojana, Pradhan Mantri Shram Yogi Maandhan, Ayushman Bharath లాంటి సంక్షేమ పధకాలు ఇస్తుంది.
కేంద్ర ప్రభుత్వం నేరుగా చట్టం, డేటాబేస్, బీమా, నిధుల వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. e-Shram Portal ద్వారా అసంఘటిత కార్మికుల జాతీయ డేటాబేస్ ఇస్తుంది. Building and Other Construction Workers Act, 1996, Building and Other Construction Workers Welfare Cess Act, 1996 ఈ చట్టాల ద్వారా రాష్ట్రాలు Welfare Board ఏర్పాటు చేయాలి. Welfare Board లకు Grants , loans ఇస్తున్నది. Chief Labour Commissioner పర్యవేక్షించాలి. మోడీ ప్రభుత్వం వచ్చాక భవన నిర్మాణ ఖర్చుపై 1% నుంచి 2% వరకు cess వసూలు పై కేంద్ర చట్టం చేసి ఆ నిధులు రాష్ట్రానికే అవకాశం ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో 1% బిల్డింగ్ సెస్ వసూలు చేస్తున్నారు. ఒక భవనం నిర్మాణ ఖర్చు ₹50 లక్షలు అయితే
సుమారు ₹50,000 Labour Cess ను Builders, కాంట్రాక్టర్స్, Apartment / Commercial నిర్మాణ యజమానులు కొన్ని సందర్భాల్లో ఇల్లు కట్టుకునే వ్యక్తులు కూడా చెల్లిస్తున్నారు.
ఈ డబ్బు నేరుగా కేంద్రానికి కాకుండా
State Welfare Board Fund లోకి వెళ్లే ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం చేసింది. అందుకే ఈ నిధులన్నీ Andhra Pradesh Building and Other Construction Workers Welfare Board దగ్గరికి వెళ్తున్నాయి.
ఈ నిధుల నుంచి మరణ సాయం, ప్రమాద సాయం, ప్రసూతి విద్యా సాయం, స్కాలర్‌షిప్, నైపుణ్య శిక్షణ అందించాలి.
“రాష్ట్రంలో కోట్ల రూపాయల Building Cess వసూలు అవుతోంది. ఆ మొత్తంలో ఎంత కార్మికుడికి చేరింది?”
అధికారుల్లో “Cess వసూలు చేయడంలో ఉన్న వేగం Claim సెటిల్ చేయడంలో ఎందుకు లేదు??
ఎంత cess వసూలు చేస్తున్నారు? ఎంత ఖర్చు చేస్తున్నారు ? ఎంత బ్యాలెన్స్ ఉంది? అనే విషయాల్లోకి వెళ్తే వేల కోట్ల బిల్డింగ్ సెస్ వాడకుండా పడిఉండటం లేదా ఇతర విషయాలకు వినియోగించడం జరిరుగుతుంది. గత ప్రభుత్వం ఈ నిధులు మల్లించి భవనకార్మికులకు తీరని అన్యాయం చేసింది.
Aadhaar, e-Shram, PF/ESI, Secretariat Data ద్వారా Auto Renewal చేయాలి. Single Window Claim System అమలు చేయాలి. ఒక ప్రమాదం జరిగితే ఆసుపత్రి, పోలీస్, Labour Board, Secretariat , Approval DBT ఈ మొత్తం ప్రక్రియ ఒకే సిస్టమ్‌లో జరగాలి అని మేము స్పష్టం చేస్తున్నాం.
ఈ క్రింది అంశాలు విన్నవిస్తున్నాము.
- Registration సరళీకృతం చేయాలి
- Auto Renewal అమలు చేయాలి
- Single Window Claim System తీసుకురావాలి
- శాఖల డేటా ఇంటిగ్రేషన్ చేయాలి
- గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలి
- లబ్ధిదారుల డేటా పబ్లిక్ చేయాలి
- Doorstep సేవలు ఇవ్వాలి
- WhatsApp / App / Toll Free Claim సౌకర్యం కల్పించాలి
- మధ్యవర్తులను అరికట్టాలి
- నిర్మాణ రంగం మరియు ఇతర రంగాల యాజమాన్యాలు అసంఘటిత కార్మికుల వివరాలు సక్రమంగా ఇవ్వాలి
- ప్రతి నెల ప్రగతి నివేదిక విడుదల చేయాలి
కార్మికుని కష్టానికి విలువ ఉండాలి.
ఒక కూలీ తన హక్కు కోసం తిరగకూడదు.
ప్రభుత్వమే కార్మికుని దగ్గరకు వెళ్లాలి.
రాష్ట్ర ప్రభుత్వం లేబర్ కార్డు ద్వారా ఇస్తున్న పథకాల ఉన్నత లక్ష్యాన్ని మేము అభినందిస్తున్నాము.
అయితే వాటి అమలులో అధికారులు నిర్లక్ష్యం విడిచి పనిచేయాలి అని భారతీయ జనతా పార్టీ విన్నావుస్తుంది.
జనతా వారధి పల్నాడు జిల్లా జట్టు



