Author: chilakaluripetalocalnews@gmail.com

మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలంలో.. ముటుకూరు గ్రామం నుండి చంద్ర కుంట తండా వెళ్లే రోడ్డు.. రాళ్లు రప్పలతో, ముళ్ళ కంపలతో మూసుకుపోయి రాకపోకలకు వీలు లేక ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం టిడిపి ఫ్లోర్ లీడర్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు నిర్వహిస్తున్న గ్రామాల్లోని పొలాలు డొంకలు అభివృద్ధిలో భాగంగా.. ఈ రహదారికి మోక్షం కలిగింది. ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు గారు, మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు, నాయకులు, రైతులు ప్రోద్బలంతో.. సుమారు 6కి. మీ మేర గ్రావెల్ రోడ్డు గా సర్వాంగ సుందరంగా అభివృద్ధి చెందింది. ఈ రెండు గ్రామాలకు మధ్య కనెక్టివిటీ పెరిగి ప్రజలకు మార్గం ఏర్పడింది.

Read More

ఈ నెల 22, 23 తేదీల్లో పొగాకు కొనుగోలు కేంద్రాలు చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో కొనుగోలు కేంద్రాలు వెల్లడించిన మార్కెట్ యార్డ్ కార్యదర్శి దేవరకొండ తిరుపతి రాయుడు మొదటగా ఈ నెల 18 న ప్రారంభం కావాల్సిన కొనుగోలు కేంద్రాలు…. కొన్ని అనివార్య కారణాల రీత్యా… వాయిదా పడింది. ఈ నెల 22,23 తేదీ లలో చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో పొగాకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపిన కార్యదర్శి తిరుపతి రాయుడు . ప్రారంభం కాగానే రైతులు పొగాకు మార్కెట్ యార్డ్ కు తీసుకురావచ్చని కోరిన కార్యదర్శి తిరుపతి రాయుడు

Read More

భక్త మహాశయులకు విజ్ఞప్తి మన పోలిరెడ్డి పాలెం గ్రామంలోని చేసి ఉన్న శ్రీ సిద్ధి బుద్ధి సమేత విజ్ఞేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ఈరోజు అనగా ది 18 .6. 2025. బుధవారము స్వామి వారి యొక్క జన్మ నక్షత్రము పూర్వాభాద్ర నక్షత్రం పురస్కరించుకొని ఉదయము ఎనిమిది గంటల 30 నిమిషాల నుండి స్వామివారికి పంచామృతాభిషేకములు పూజా మహోత్సవ కార్యక్రమం జరుగును తదుపరి తీర్థ ప్రసాద వినియోగం జరుగును మధ్యాహ్నము 12:30 నుండి స్వామి వారి యొక్క మహా అన్నప్రసాద వికరణ జరుగును కావున భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము.ఇట్లు శ్రీ అభయాంజనేయ స్వామి వారి భక్త బృందం పోలిరెడ్డి పాలెం

Read More

గత ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల ఫలితాలే ఈ బలవన్మరణాలు – తెదేపా నేతలునాదెండ్ల గ్రామం మరియు నాదెండ్ల మండలంలోని తుబాడు గ్రామంలో ఇరువురు రైతులు సోమవారం బలవన్మరణానికి పాల్పడటానికి కారణం గత వైకాపా ప్రభుత్వం పాలించిన 5 సంవత్సరాలలో , వారు అవలంబించిన రైతు వ్యతిరేక విధానాలే కారణం అని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. మాజీ మంత్రి విడదల రజిని మరియు వైకాపా నేతలు ఇటివల కొద్ది కాలం నుండి శవ రాజకీయాలు మొదలు పెట్టారని, గత 5,6 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తూ, నష్టాల పాలై అప్పుల ఊబిలోకి కూరుకుపోయి, తప్పని పరిస్థితులలో ఆత్మహత్యకు పాల్పడిన రైతులకు ఏ విధంగా సాయం అందించి ఆదుకోవాలి అనే స్పృహ కోల్పోయి, కేవలం పబ్లిసిటీ స్టంట్ లో భాగంగా ఎవరూ చనిపోయిన రైతులను పరామర్శించలేదు, ఆదుకోలేదు అని అవాకులు, చవాకులు పెడుతుందని వారు తెలిపారు. ఇరువురు రైతుల ఆత్మహత్యల పట్ల మాజీ…

Read More

ఇటు సంక్షేమం… అటు రాష్ట్రాభివృద్ధి..లక్ష్యాలతో..సుపరిపాలన తో దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వం తల్లికి వందనం తో ప్రజల్లో విశ్వాసం పెంచిన కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం తో హర్షం వ్యక్తం చేస్తున్నా మహిళలు సూపర్ సిక్స్ లోతల్లికి వందనం… సూపర్ సక్సస్ అవడంతో కూటమి ప్రభుత్వానికి భారీ గా పెరిగిన మైలేజ్ చిలకలూరిపేట పట్టణంలో ఇప్పటి వరకు 9827 మందికి చేరుకూరిన తల్లికి వందనం లబ్ది ఈ 9827 మంది విద్యార్థులు కు ఒక్కొక్కరికి 13000 చొప్పున 12,77,5100 రూపాయలు వారి తల్లుల ఖాతాల్లో జమ అత్యధికంగా మద్దినగర్ ఏరియాలో 747 మంది విద్యార్థులు కు…. అత్యల్పంగా పండరీ పురం ఏరియాలో 85మంది విద్యార్థులు కు లబ్ది వార్డులవారీగా …సచివాలయాల ద్వారా లబ్ది పొందిన విద్యార్థులు వారి వివరాలు మొత్తం పట్టణ పరిధిలో34వార్డులకు గాను …. 29 సచివాలయాలు ఉన్నాయి… సచివాలయం 1పరిధిలోకుమార కాలనీ, ఎన్టీఆర్ కాలనీఈ ప్రాంతంలో…

Read More

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కి కృషి చేయాలి:మాజీ మంత్రి వర్యులు,పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులువిడదల రజిని… వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు పొందిన నాయకులు పార్టీ పటిష్టత కి కృషి చెయ్యాలని మాజీ మంత్రి విడదల రజిని సూచించారు.ఈ రోజు చిలకలూరిపేట పట్టణ అధ్యక్షుడుగా షేక్ దరియవలి,రూరల్ మండలం అధ్యక్షుడుగా దేవినేని శంకర్ రావు,నాదెండ్ల మండలం అధ్యక్షుడుగా మంగు ఏడుకొండలు,యడ్లపాడు మండలం అధ్యక్షుడుగా వడేపల్లి నరసింహా రావు{రాజు}నియమితుపైన సందర్బంగా ఈరోజు మాజీ మంత్రి విడదల రజిని ని వారి నివాసంలో కలసి వారువివిధహోదాల్లోనియమించినందుకు కృతజ్ఞతలు తెలియచేశారు.ఈ సందర్భంగా రజిని మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీ నమ్ముకొని కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు మరియు జగనన్న హయంలో మనం ప్రజలకి చేసిన మేలు,ప్రజల పట్ల మనం చూపిన ప్రేమ నేడు ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం లో కరువయ్యాయని,మనం చేసిన మంచి ప్రజల్లో చిరస్థాయిగా…

Read More

హత్య కేసును చేదించిన చిలక లూరిపేట రూరల్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించిన చిలకలూరిపేట రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి. సుబ్బానాయుడు, సిబ్బందిని అభినందించిన పల్నాడు జిల్లా ఎస్పీ కేసు వివరాలు క్రైమ్ నంబర్: Cr.No.57/2025 u/s 103(1) BNSపోలీస్ స్టేషన్: యడ్లపాడుమృతుడుపేరు: తుని కులదీప్ W/o జగర్నాథ్ కులదీప్వయసు: 35 సంవత్సరాలుకులం: హరిచిరునామా: ఘటిగూడ, నబరంగ్‌పూర్, ఒడిశా రాష్ట్రం. ప్రస్తుతం శ్రీ మంజునాథ్ స్పిన్నింగ్ మిల్, తిమ్మాపురం గ్రామం, యడ్లపాడు మండలం. నిందితుడు పేరు: మంగులు S/o ఆదీలంకవయసు: 25 సంవత్సరాలుకులం: అలీయాచిరునామా: బోలోసరా గ్రామం, ముక్త మలసాహి మండలం, గంజాం జిల్లా, ఒడిశా రాష్ట్రం. ప్రస్తుతం శ్రీ మంజునాథ స్పిన్నింగ్ మిల్, తిమ్మాపురం గ్రామం, యడ్లపాడు మండలం.జరిగిన సంఘటనఈ కేసులో ఫిర్యాది అయిన రుని జగన్నాథ్ (జగన్నాథ్ కులదీప్ భార్య) తన భర్తతో కలిసి యడ్లపాడు మండలం, తిమ్మాపురం గ్రామంలోని శ్రీ మంజునాథ్ స్పిన్నింగ్ మిల్ లో…

Read More

ఎడ్లపాడులో విద్యుత్ సరఫరా నిలిపి ప్రాంతాలు 17-06-25మంగళవారం యడ్లపాడు మండలం లోని సొలస, చంగిజ్ ఖాన్ పేట, లింగారావు పాలెం, పుట్టకోట, కొండవీడు, కోట గ్రామములకు ట్రాన్స్ఫార్మర్, లైన్ల మరమ్మత్తుల కారణంగా ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు…. ఆర్ అశోక్ కుమార్,డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, విద్యుత్ శాఖ,చిలకలూరి పేట.

Read More

పల్నాడు జిల్లా, పోలీసు కార్యాలయంనరసరావుపేట. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్… ★ ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక,ఆస్తి తగాదాలు,మోసం మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 81 ఫిర్యాదులు అందాయి. ★ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని శ్రీ ఎస్పీ గారు సూచించారు. ★ రాజుపాలెం మండలం కోట నెమలిపురి గ్రామానికి చెందిన సరికొండ శివ రంగనాయకుల రాజు పిడుగురాళ్ల కు చెందిన జానీ మస్తాన్ అను రియల్ ఎస్టేట్ బ్రోకర్ల…

Read More

చిలకలూరిపేట తెలగ,కాపు,బలిజ కళ్యాణ మండపంను యనమదల (గ్రామం),యద్దనపూడి (మండలం),బాపట్ల(జిల్లా) గ్రామ వాస్తవ్యులు మన కాపు సామాజికవర్గానికి చెందిన ప్రముఖ వాస్తు సిద్ధాంతి శ్రీ.ఏలిసెట్టి రాము గారు సందర్శించి కళ్యాణ మండపం ప్రస్తుత వాస్తు పరిశీలించి వారు తమ అమూల్యమైన సలహాలు,సూచనలు తెలియజేశారు.తదుపరి కళ్యాణ మండపంలోని వాస్తులో ఉన్న లోపాలు సరిచెసి మనకు ప్లాన్ ఇస్తాను అని సహృదయంతో తెలియజేశారు.కళ్యాణ మండపమునకు సంబంధించిన వాస్తు శాస్త్రంను ఉచితంగా అందజేస్తాను అని కులం పట్ల ఉన్న అభిమానం తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చిలకలూరిపేటకు చెందిన కాపు సోదరులు పోతురాజు హరిష్,ఉసా రమేష్,ఉయ్యూరు నరసింహారావు,ఇర్రి రాఘవ,కమ్మిళి శివా రామకృష్ణ,మండలనేని జగదీష్,మిరియాలు లక్ష్మీ నారాయణ,మారెళ్ళ శ్రీను, రామిశెట్టి శివ ప్రసాద్,బందరు కృష్ణ ప్రసాద్ మరియు రామిశెట్టీ చంద్ర గార్లు పాల్గొన్నారు.

Read More