ప్రజా సమస్యల కంటే.. జగన్ ఎజెండానే వైసీపీ సభ్యులకు ముఖ్యమైపోయింది : ప్రత్తిపాటి

  • వైసీపీ ఎమ్మెల్సీల ధోరణిపై సొంతపార్టీ శ్రేణులే తలలు పట్టుకుంటున్నారు : ప్రత్తిపాటి
  • జగన్ కుంభకోణాలు, దోపిడీలపై ప్రజల్లో చర్చ జరగకూడదన్నదే వైసీపీ సభ్యుల అంతిమ లక్ష్యం : ప్రత్తిపాటి.
  • టీటీడీకి నెయ్యి సరఫరా చేయడం లేదని హెరిటేజ్ స్పష్టంగా చెప్పినా.. వైసీపీ సభ్యులు కుక్కతోక పట్టుకొని గోదారి ఈదే ప్రయత్నం చేస్తున్నారు. :ప్రత్తిపాటి
  • తన కొలంబో పర్యటనపై వైసీపీ అవినీతి మీడియా దుష్ప్రచారానికి లోకేశ్ సమాధానం కుక్కకాటుకు చెప్పుదెబ్బలా ఉంది. : ప్రత్తిపాటి

“ మంత్రి నారా లోకేశ్ కొలంబో పర్యటనపై పనిగట్టుకొని మరీ దుష్ప్రచారం చేయడం సాక్షి మీడియా బరి తెగింపునకు పరాకాష్ట. సొంత ఖర్చులతో క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్లడాన్ని తప్పుపడుతూ.. అవినీతి మీడియా తన అవాస్తవాలను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేసింది. జగన్ సంతోషం కోసం… జనం మనసుల్లో విషబీజాలు నాటే దినచర్యలో వైసీపీ నేతలు.. సాక్షి మీడియా బరితెగించి ప్రవర్తిస్తున్నారు. కుక్కకాటుకు చెప్పుదెబ్బలా … సాక్షి దుష్ప్రచారాన్ని లోకేశ్ తనదైన శైలిలో తిప్పికొట్టారు. అవినీతి మీడియా విషపురాతల సృష్టికర్తలకు.. లోకేశ్ సమాధానం కుక్కకాటుకు చెప్పుదెబ్బలా గట్టిగా తగిలిందనే చెప్పాలి. గతంలో లోకేశ్ పై హద్దులు మీరి చేసిన దుష్ప్రచారానికి, కోర్టుల్లో క్షమాపణలు చెప్పుకునే దుస్థితి కల్పించినా.. సాక్షి రాతల్లో మార్పురాలేదు.

రచ్చ చేయడానికే సభకు వస్తున్నారు..
వైసీపీ ఎమ్మెల్సీలు మండలికి వస్తున్నది ప్రజాసమస్యలపై చర్చకు.. రాష్ట్రానికి మేలు చేసే అంశాలపై ప్రభుత్వానికి సలహాలు..సూచనలు ఇవ్వడానికి కాదని వారి వైఖరిని బట్టే అర్థమవుతోంది. కేవలం ఒక ఎజెండా ప్రకారం..సభను అడ్డుకోవాలి.. రచ్చ చేయాలి అన్నదే వారి లక్ష్యంగా కనిపిస్తోంది. టీటీడీకి నెయ్యి సరఫరా చేయడం లేదని హెరిటేజ్ సంస్థ స్పష్టంగా ఆధారాలు బహిర్గతం చేసినా కూడా.. వైసీపీనేతలు ఆ సంస్థను బదనాం చేయడం కుక్కతోక పట్టుకొని గోదారి ఈదడమే అవుతుంది. జగన్ సాగించిన కుంభకోణాలు. దోపిడీలపై కూటమిప్రభుత్వం చేపట్టిన విచారణ.. రోజురోజుకీ బయటకొస్తున్న నాటి వైసీపీ ప్రభుత్వ అవినీతి వ్యవహారాలపై ప్రజల్లో చర్చ జరగకూడదు.. వారి మనసుల్లో ఎక్కడా జగన్ దుర్మార్గాలు ఎస్టాబ్లిష్ అవకూడదన్న ఏకైక లక్ష్యంతోనే వైసీపీ సభ్యులు అడుగడుగునా సభా నిర్వహణకు అడ్డు తగులుతున్నారు. కల్తీ నెయ్యి స్కామ్ లో జగన్ సహా నాటి టీటీడీ పెద్దల పాత్ర ప్రజలకు తెలియకూడదన్న దురుద్దేశంతోనే, వైసీపీ సభ్యులు హెరిటేజ్ డెయిరీపై బురదజల్లుతున్నారు

వైసీపీ సభ్యుల తీరుపై సొంతపార్టీ శ్రేణులే తలలు పట్టుకుంటున్నారు
పెద్దలసభను వైసీపీ సభ్యులు కావాలనే పెడదారి పట్టిస్తున్నారు.
ఎవరికి వారే యమునా తీరే అంటున్న వైసీపీసభ్యుల ప్రవర్తనపై సొంత కార్యకర్తలే తలలు పట్టుకుంటున్నారు. ఆధిపత్య భావజాలంతో తమలే తాము కలహించుకంటూ.. పెద్దల సభ గౌరవప్రతిష్టల్ని బజారుకీడుస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే అంశాల కంటే.. తమ నాయకుడి ఆదేశాలే తమకు మిన్న అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. మండలి మర్యాదను మంటగలపాలన్న ఆరాటం తప్ప… ప్రభుత్వ విధానాలపై చర్చించాలన్న ఆలోచన వైసీపీసభ్యులకు లేకపోవడం విచారకరం.” అని మాజీమంత్రి ప్రత్తిపాటి బుధవారం ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు.

Share.
Leave A Reply