జగన్ పాపాల పాలన ఫలితమే ప్రజల్ని పట్టి పీడిస్తున్న రెవెన్యూ, ఇతర భూ సమస్యలు. ప్రత్తిపాటి

  • ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన మాజీమంత్రి ప్రత్తిపాటి.

చిలకలూరిపేట పట్టణంలోని స్థానిక కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి, ప్రజల నుంచి అర్జీలు ప్రత్తిపాటి స్వయంగా స్వీకరించారు. జగన్ పాపాల పాలన ఫలితమే ప్రజల్ని పట్టి పీడిస్తున్న రెవెన్యూ, ఇతర భూ సమస్యలని, వాటి పరిష్కారంపై ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టారు అని తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కార వేదిక (ప్రజాదర్బార్) లో భూ వివాదాలకు సంబంధించి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రత్తిపాటి తెలిపారు. నియోజకవర్గంలో అక్రమ లేఅవుట్లకు ఆస్కారం లేకుండా రాజమార్గంలో అన్ని అనుమతులుండటమే అందరికీ మంచిదనీ అన్నారు. మాజీ అవినీతిమంత్రి, ఆమె అనుచరులు, కుటుంబసభ్యులు కాలువలు, చెరువులు, డొంకలు, జాతీయ రహదారి భూముల్ని కూడా ప్రజలకు అంటగట్టి పరారయ్యారన్నారు. ప్రజల నుండి వచ్చిన అర్జీలను పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

Share.
Leave A Reply