Author: chilakaluripetalocalnews@gmail.com

ఇంట్లో కరెంట్ షాక్ తగిలి మహిళ మృతి కూలి పనికి వెళ్లి కానరాని లోకాలకు వెళ్లిన మహిళ అవిశాయి పాలెం గ్రామంలో ఘటననాదెండ్ల మండలం అమిన్ సాహెబ్ పాలెం మలో విద్యుధాఘాతంతో మహిళా మృతి. గ్రామానికి చెందిన ఎస్టీ మహిళ రాపూరి చెంచమ్మ (45) వేరోకరి ఇంట్లో పనిచేస్తుండగా కరెంట్ షాక్ కు గురైంది. అక్కడికక్కడే మృతి చెందింది.

Read More

మొక్కలు నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం: ప్రభుత్వ చీఫ్ విప్ జీవి గారు పర్యావరణ దినోత్సవ సందర్భంగా వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన హరితాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు శ్రీ జీవీ ఆంజనేయులు గారు ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని కోరారు. ప్రతి తమ ఇల్లు, పరిసరాల్లో మొక్కలు నాటాలని సూచించారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధించి, నారసంచులను ఉపయోగించి పర్యావరణాన్ని ప్రతి ఒక్కరు పరిరక్షించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, కూటమి నాయకులు నాగ శ్రీను రాయల్ గారు తదితరులు పాల్గొన్నారు.

Read More

పార్టీ కార్యాలయంలో విజయోత్సవ దినాన్ని ఘనంగా నిర్వహించిన పార్టీ శ్రేణులు2019 నుండి 2024 వరకూ జరిగిన విధ్వంసకర పాలన నుండి రాష్ట్ర ప్రజలకు విమోచన కలిగి,అభివృధి వైపు పయనించే ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్న రోజుగా జూన్ 4 వ తేదీని విజయోత్సవ దినంగా పార్టీ శ్రేణులు నిర్ణయించడం జరిగింది.2024 జూన్ 4 వ తేదీన యావత్తు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం తీసుకున్న చారిత్రక నిర్ణయం రాష్ట్ర చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు విజయోత్సవ దినాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ కరిముల్లా మరియు పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్ లు విజయోత్సవానికి గుర్తుగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేయడం జరిగింది.

Read More

నాదెండ్ల మండల నూతన అధికారిణి గా బాధ్యతలు నాదెండ్ల మండల తహసీల్దార్ కార్యాలయంలో పి.సంతోషకుమారి మండల రెవిన్యూ ఇన్ స్పెక్టరు, గా బుధవారం బాధ్యదతలు స్వీకరించారు. ఈమె నిన్నటి వరకు వినుకొండ మండల తహశీల్దారు వారి కార్యాలయము నందు సీనియర్ సహాయకులుగా పనిచేసియున్నారు. పదోన్నతి పై సంతోషి కుమారి నాదెండ్ల తహశీల్దార్ కార్యాలయానికి వచ్చారు. పలువురు VRO లు, సిబ్బంది ఆమెకు అభినందనలు తెలిపారు

Read More

జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ విద్య అమలు చేయాలి – పల్నాడు జిల్లా కలెక్టర్ కి APUWJ జర్నలిస్టుల వినతి. వెంటనే స్పందించిన కలెక్టర్ విద్య శాఖ అధికారులు కు ఆదేశాలు జారీ పల్నాడు జిల్లాలో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు సమాజానికి, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి — నిస్వార్థంగా ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టులు (APUWJ) పేర్కొన్నారు. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో 50%ఫీజు రాయితీ విద్యను కల్పించేందుకు ఈ అంశంపై పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం లోపల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు కు వినతిపత్రాన్ని అందజేశారు. దీనికి కలెక్టర్ వెంటనే సానుకూలంగా స్పందించి జిల్లావిద్యా శాఖ అధికారులకు 50%ఫీజు రాయితీ పై ఆదేశాలు ఇచ్చారు . ఈ విషియం పై పల్నాడు జిల్లా APUWJ నాయకులు హర్షం వ్యక్తం చేసి జర్నలిస్ట్…

Read More

గుడిలో సీసీకెమెరాల ధ్వంసంపై కేసు నమోదు ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు రంగంలోకి దిగిన యడ్లపాడు పోలీసులు ఠానాలో ఫిర్యాదు చేసిన గ్రామస్తులు యడ్లపాడుమండలంలింగారావుపాలెంలో గ్రామదేవత గుడిలో సీసీ కెమెరాల ధ్వంసంపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..గ్రామంలోని గంగమ్మ తల్లి గుడిలో ఇటీవల కొలుపులు నిర్వహించారు. అయితే వీటకి సంబంధించి కొందరు ఈనెల 2వ తేదీన గుడిలో దీపారాధన చేశారు. ఈ విషయంపై సదరు గుడికి చెందిన మరికొందరితో దీపారాధన చేసిన వారితో వాగ్వాదం జరిగింది. ఇదే తరహాలో గతంలోనూ ఒకమారు వాగ్వాదం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు ఇరువర్గాల వారిని పిలిపించి సఖ్యత చేసి పంపించినా ఫలితం లేకపోవడం, ఆ తర్వాత గుడిలో సీసీకెమెరాలను ధ్వంసం చేయడం జరిగింది. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ టి శివరామకృష్ణ తెలిపారు

Read More

జనసేన పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు రంగవల్లులు అందంగా తీర్చి దిద్దిన మహిళలు సుపరిపాలన పేరు తో వేడుకలు ఘనంగా నిర్వహించిన జనసేన సుపరిపాలన మొదలయ్యి ఏడాది పూర్తయిన సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రికొణిదల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు చిలకలూరిపేట నియోజకవర్గంలో గ్రామాలలో, వాడ వాడలలో ప్రజలు స్వచ్ఛందంగా వేడుకలు నిర్వహించి, సంక్రాంతి ముగ్గులు వేసి సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలలో స్థానిక సమన్వయకర్త తోట రాజా రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజా రమేష్ మాట్లాడుతూ ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావడంతో ప్రజలు స్వచ్ఛందంగా, ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. గడిచిన వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రజలు అణిచివేతకు గురయ్యారని వారి ఆర్థిక స్థితిగతులు క్షీణించాయని, తీవ్ర నిరాశకు గురై గడిచిన సార్వత్రిక ఎన్నికలలో కూటమి పార్టీలకు 164 స్థానాలు కట్టబెట్టి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారని…

Read More

పల్నాడు జిల్లా.. సత్తెనపల్లి నియోజకవర్గ. రాజుపాలెం మండలం దేవరంపాడు అద్దంకి-నార్కట్పల్లి హైవేపై రోడ్డు ప్రమాదం… అతివేగంతో బైకును ఢీకొట్టిన కారు… బైక్ పై ప్రయాణిస్తున్న నెమలిపురి గ్రామానికి చెందిన కంకణంపాటి నరసయ్య(50)అక్కడికక్కడే మృతి… కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ కు చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలు…. క్షతగాత్రుడ్ని నరసరావుపేట లోని ప్రవేటు వైద్యశాలకు తరలింపు… మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు… కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు…

Read More

పల్నాడు: వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినం కార్యక్రమం వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ PAC మెంబర్ వినుకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీ వద్ద భారీగా పోలీసుల మోహరింపు పార్టీ నాయకుల్ని కార్యకర్తలని ర్యాలీ, చేయనీయకుండా మరియు నాయకులు మాట్లాడనీయకుండా మైక్ ను అడ్డుకున్న పోలీసులు

Read More