నిషేధిత గుట్కా, పొగాకు అమ్మితే కఠిన చర్యలు: అర్బన్ సీఐ రమేష్

చిలకలూరిపేట పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలల వద్దనిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులను అమ్మినట్లయితే సంబంధిత షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని గురువారం చిలకలూరిపేట పట్టణ స్టేషన్లో సీఐ రమేష్ తెలిపారు. సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్’ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. ప్రతి స్కూలు, కాలేజీలకు 100 మీటర్ల సమీప దూరంలో ఉన్న దుకాణాలలో తనిఖీలు చేపడుతున్నామని చెప్పారు. పొగాకు సంబంధించిన చుట్ట బీడీ సిగరెట్లు దుకాణాల్లో అమ్మవద్దని పొగాకు వలన విద్యార్థుల జీవితాలు చెడు వ్యసనాలకు బానిసగా మార్చే అవకాశం కలుగుతుందని విద్యార్థులను మంచి మార్గంలో నడవాలంటే వారి పాఠశాల చుట్టూపక్కలనుంచిమంచి.వాతావరణంఉండాలని ఆయన కోరారు విద్యార్థులు పట్టణ ప్రజలు చెడు వ్యసనాలకు అలవాటు పడి యువత వారి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. డ్రగ్స్ సేవించినా విక్రయించిన వారి వద్ద కలిగి ఉన్న రవాణా చేస్తున్న చట్టరీత్యా నేరమని ఆయన పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ వీటిని నిషేధించాలని అన్నారు.పట్టణంలోని ఎవరైనా కలిగి ఉన్న తమకు సమాచారం అందించాలని వారి యొక్క వివరాలను గోపిగా ఉంచుతామని సీఐ పట్టణ ప్రజలను కోరారు.

Share.
Leave A Reply