జాతీయ బీసీ సంక్షేమ సంఘం చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షులుగా త్రిపురం సాయి….
చిలకలూరిపేట.. పట్టణంలోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కార్యాలయంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన త్రిపురం హరికృష్ణ ( సాయి ) ని నియోజకవర్గ యువజన అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సాయి నియామిక పత్రాన్ని పల్నాడు జిల్లా లిగల్ సెల్ చైర్మన్ పమిడి రాజకుమార్, పల్నాడు జిల్లా యువజన అధ్యక్షులు మాదాసు పృథ్విరాజ్ ( సాయి ) చేతుల మీదగా అందుకోవడం జరిగింది . ఈ సందర్భంగా పమిడి రాజ్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో నీ బీసీ సామాజిక వర్గ యువతకు అందుబాటులో ఉండి అతి త్వరలో కమిటీలు పూర్తి చేయాలని అలానే ఇలాంటి పదవులు మరెన్నో పొందాలని ఆయన అన్నారు. పృధ్వీరాజ్ సాయి మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు దీటుగా బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతానికి కృషి చేస్తామని బీసీల పట్ల ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకి పరిష్కారం చేసేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నక్కా వెంకటేష్, చొప్ప వీరనారాయణ, అన్నపురెడ్డి మహేష్, పెద్దవరపు నరసింహ , రవి, నక్క నరసింహ , నిడుమూల అనిల్ కుమార్ , మరి కొంతమంది బీసీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని తిరుపురం సాయికి అభినందనలు తెలిపారు….



