కాపుల చిరకాల వాంఛ అయిన బీసీ రిజర్వేషన్ కోసం చిత్తూరు నుండి అమరావతి వరకు పాదయాత్ర
ప్రముఖ విలేఖరి కాపు నాయకులు యువకుడు సానా ప్రసాద్ కూటమి ప్రభుత్వానికి కాపు రిజర్వేషన్ గురించి గుర్తు చేయడానికి అలాగే రిజర్వేషన్ అమలు చేయటానికి విజ్ఞాపన పత్రం ఇవ్వటానికి సానా ప్రసాద్ ఎన్నో వ్యాయ ప్రయాసలకు ఓర్చుకొని తన ఆర్థిక స్తోమతను లెక్కచేయకుండా చిత్తూరు నుండి కడప కర్నూలు ఒంగోలు మీదగా చిలకలూరిపేటకు విచ్చేయడం జరిగింది. చిలకలూరిపేటకు విచ్చేసిన సానా ప్రసాద్కు ఘనస్వాగతం తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు నాయకులు తాను చేస్తున్న ఈ పోరాటానికి పూర్తి మద్దతు తెలియజేసి చిలకలూరిపేటలో ఉన్న కీర్తిశేషులు వంగవీటి మోహనరంగా విగ్రహాలకు పూలమాలలు వేసి తాను చేస్తున్న పోరాటం గురించి చిలకలూరిపేట కాపు నాయకులకు యువకులకు మహిళలకు తన పాదయాత్ర ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు సానా ప్రసాదు తన మిత్ర బృందం స్థానిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిరెడ్డి రమేష్ నాయుడు రాధా రంగా మిత్రమండలి కన్వీనర్ అచ్చు కోల మురళీకృష్ణ వైస్ ప్రెసిడెంట్ ఏనుగుల వెంకటేశ్వర్లు స్థానిక కాపు నాయకులు కటారి సుధాకర్ ఇర్రి రాఘవ ఊసా రమేష్ ఊస శేషు సనాతన కమిటీ చైర్మన్ తోట సతీష్ నాయుడు తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.