Author: chilakaluripetalocalnews@gmail.com

ప్రభుత్వ చీఫ్ విప్ గారి కార్యాలయంలో ప్రజా దర్బార్ వినుకొండ పట్టణంలో ప్రభుత్వ చీఫ్ విప్ గారి కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీజీవీ ఆంజనేయులు గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు ప్రజల నుండి వినతులు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా చీఫ్ విప్‌ గారి కి తెలియజేయడంతో, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా దర్బార్‌కు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమం లో నాయకులు పాల్గొన్నారు.

Read More

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని గారిని కలిసిన శాసన సభ్యులు కన్నా లక్ష్మి నారాయణ గారు సత్తెనపల్లి శాసన సభ్యులుశ్రీ కన్నా లక్ష్మి నారాయణ గారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని. విజయవాడ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి. సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి గురించి.మరియు ఆరోగ్య శాఖకు .సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు

Read More

కొనసాగుతున్న విద్యుత్ మరమ్మత్తు పనులు పట్టణంలో ని 6వ వార్డులో ఎన్టీఆర్ కాలనీ మరియు లక్ష్మీ నరసింహ కాలనీ లో విద్యుత్ మరమ్మతులు చేపట్టిన సిబ్బంది. విద్యుత్ మరమ్మతులు నేపథ్యంలో కరెంట్ సరఫరా నిలిపి ఈ మరమ్మతులు చేశారు. లైట్లు పోయిన ప్రాంతాల్లో పాత లైట్లు,తొలగించి, ఆ స్థానంలో కొత్త లైట్లు వేశారు. శాసన సభ్యులు ప్రత్తిపాటి ఆదేశాలు తో ఈ మరమ్మతులు చేసినట్లు సిబ్బంది తెలిపారు .

Read More

యడ్లపాడు గ్రామ వాస్తవ్యులు జరుగుల వీరభద్ర రావు గారు నిన్న తుది శ్వాస విడిచారు. వారి పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి… అలాగే యడ్లపాడు గ్రామపంచాయతీ మాజీ వైస్ ప్రెసిడెంట్ ముత్తవరపు సుబ్బారావు గారి తల్లి జానకమ్మ గారు స్వర్గస్తులైనారు. వారి పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనమండలి సభ్యులు శ్రీ మరి రాజశేఖర్ గారు… ఈ కార్యక్రమములలో వారి వెంట కల్లూరి బుల్లియ్య గారు, కల్లూరి శ్రీనివాసరావు గారు, రాచమంటి చింతారావు గారు, మద్దాల హరిప్రసాద్ గారు, బండ్ల సాంబయ్య గారు, బండ్ల పున్నారావు గారు, మండెపూడి శ్రీనివాసరావు గారు, రావూరి నాగేశ్వరరావు గారు తదితరులున్నారు

Read More

మొక్కలు నాటిన ఎమ్మెల్యే డా”చదలవాడ అరవింద బాబు పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హరితాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నరసరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు డా”చదలవాడ అరవింద బాబు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ శంకరభారతి పురం ప్రభుత్వ పాఠశాల ఎస్ ఎస్&ఎన్ కళాశాలలో మొక్కలను నాటారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రకృతిని రక్షించుకునే బాధ్యత తీసుకుందామని ప్రతి ఒక్కరం మొక్కలు నాటి హరితాంధ్రప్రదేశ్ నిర్మించుకుందామని పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమలకు శ్రీకారం చేపట్టడం మంచి ఆలోచన అని స్వచ్ఛ ఆంధ్ర హరిత ఆంధ్ర యోగ ఆంధ్ర వంటి కార్యక్రమాలు విజయవంతగా జరుగుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమం పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు రాష్ట్ర గ్రంధాలయాలు చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నరు

Read More

మక్కెన గారిని అభినందించిన మర్రి రాజశేఖర్ గారు… జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా నేడు ప్రమాణం స్వీకారం చేసిన మక్కెన మల్లికార్జున రావు గారికి శుభాకాంక్షలు తెలియజేసి జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులతో ఉన్నారని వారికి అండగా ఉండాలని, వారికి రుణ సదుపాయాలు, ఎరువులు తదితర సహాయ సహకారాలు అందించాలని వారిని కోరిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు… ఈ కార్యక్రమంలో వారి వెంట నాయుడు రమేష్ గారు, గడిపూడి దసరామయ్య గారు, దొప్పలపూడి అప్పారావు గారు, చాపలమడుగు రవి గారు తదితరులున్నారు.

Read More

బక్రీద్ సందర్భంగా ఆవులను, దూడలను వధిస్తే చర్యలు తప్పవు.. వినుకొండ :- బక్రీద్ పండుగ ను పురస్కరించుకొని పురపాలక సంఘ పరిధిలో ఎక్కడ కూడాను ఆవులను,దూడలను వధించరాదని మునిసిపల్ కమిషనర్ యమ్. సుభాష్ చంద్ర బోస్ అన్నారు.గురునాడు పురపాలక సంఘ కార్యాలయ కమిషనర్ వారి ఛాంబర్ నందు సమావేశం సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వ్యవసాయానికి పనికిరాని జంతువులను మాత్రమే వెటర్నరీ వైద్యుల ధ్రువీకరణ పత్రం పొంది అధికారులు తెలిపిన ప్రాంతాలలో మాత్రమే వధించుకోవాలి అని ఆయన తెలిపారు. ఎక్కడపడితే అక్కడ రోడ్లపై వధించకూడదని తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారుల నిబంధనలను ఉల్లంఘిస్తే వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. బక్రీద్ పండగ సందర్భంగా మసీదుల దగ్గర ఎటువంటి అవాంఛనీలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తాము అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ ఇస్మాయిల్ మరియు మున్సిపల్ సిబ్బంది మరియు…

Read More

భారీ చోరీ కేసు ను ఛేదించిన పేట రూరల్ పోలీసులు.. రూ. 33.50 లక్షల సొత్తు స్వాధీనం. చిలకలూరిపేట రూరల్ చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 33.50 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఐదు చోరీ కేసులను ఛేదించినట్లు పల్నాడు జిల్లా పోలీసులు వెల్లడించారు.చిలకలూరిపేట మండలం కమ్మవారిపాలెం గ్రామంలో జరిగిన ఓ ఇంట్లో చోరీ కేసును ఛేదించడంలో రూరల్ పోలీసులు కీలక పాత్ర పోషించారు. ఈ కేసులో 380 గ్రాముల బంగారం, 6 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ. 33,50,000 ఉంటుందని అంచనా.ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన రూరల్ సీఐ సుబ్బానాయుడు, ఎస్సై అనిల్‌లను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు.

Read More

పల్నాడు జిల్లా మాచర్లలో గత నెల 24న జరిగిన ఇద్దరు టీడీపీ కార్యకర్తల హత్యలపై జిల్లా ఆఫీస్ లో ఎస్పి శ్రీనివాసరావు మీడియా సమావేశం మాచర్ల జంట హత్యల కేసులో ఇప్పటికీ ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసాం ఈ కేసులో సంబంధం ఉన్న మరో ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారు ..త్వరలోనే వారిని అరెస్టు చేస్తాం నిందితులను పట్టుకోవడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాము పరారీలో ఉన్న పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, పిన్నెల్లి వెంకట రామిరెడ్డి, వెంకట రెడ్డిని త్వరలోనే అరెస్టు చేస్తాం. కేసుని అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేస్తున్నాము.

Read More

హరి హర క్షేత్రం…. బోయపాలెం నేటి నుంచి మూడు రోజుల పాటు వార్షికోత్సవ వేడుకలు ఘనంగా బోయపాలెం గ్రామంలో వెంచేసి ఉన్న హరి హర క్షేత్ర 14వ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించాలని ముమ్మర ఏర్పాట్లు… వేడుకలు కు కుటుంబ సమేతంగా హాజరవ్వాలని ఇప్పటికే ఆహ్వానాలు మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలు కు ముస్తాబైన బోయపాలెం హరి హర క్షేత్రం ఈ నెల 6,7,8,తేదీలలో దేవస్థానంలో ప్రత్యేక పూజలు…. ప్రతి రోజు జరగనున్న అన్నదానాలు….తీర్ధ ప్రసాదాలు పంపిణీ కార్యక్రమాలు

Read More