రాచరికపు పోకడలు… ప్రచారపిచ్చితోనే సర్వేరాళ్లు, పాసు పుస్తకాలపై జగన్ తన బొమ్మలు వేయించుకున్నాడు : అనగాని
- భూ సమసలను ప్రాధాన్యతక్రమంలో పరిష్కరిస్తున్నాం
- 2027 నాటికి రీసర్వే సమస్యలకు ముగింపు పలుకుతాం
- రాజకీయాలపై నాకున్నఆసక్తి గమనించి ప్రత్తిపాటి నన్ను ప్రోత్సహించారు.
- ప్రపంచంలో ఒంగోలు జాతికి ఎదురులేదు.. చిలకలూరిపేటలో ప్రత్తిపాటికి తిరుగులేదు
- రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్
- రైతులు..వారి జీవనవిధానం.. వ్యవసాయమంటే ప్రత్తిపాటికి ఎంతో మక్కువ : అశోక్ రెడ్డి
- ప్రత్తిపాటి వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు మా జిల్లా రైతులకు ఎంతో మేలు చేశారు : ముళ్లపూడి బాపిరాజు
రాచరికపు పోకడలతో పాటు.. తనలోని ప్రచారపిచ్చివల్లే జగన్ భూహద్దులు నిర్ణయించే సర్వే రాళ్లు, రైతుల పట్టాదార్ పాస్ పుస్తకాలపై తన బొమ్మలేసుకున్నాడని అనగాని తెలిపారు. తవ్వకాల్లోని పురావస్తు విశేషాల్లో రాజుల చరిత్ర బయటపడినట్టు.. భవిష్యత్ లో తన గురించి ముందు తరాలు చెప్పుకోవాలన్న కాంక్షతోనే జగన్ పిచ్చిచర్యలకు పాల్పడ్డాడన్నారు.
రాష్ట్రంలోని భూ సమసలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నామని, 2027 నాటికి భూముల రీసర్వే తప్పకుండా పూర్తిచేస్తామని ఆయన స్పష్టంచేశారు
ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో, మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు నేతృత్వంలో చిలకలూరిపేటలో జరుగుతున్న జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీల్లో భాగంగా నాలుగోరోజు సాయంత్రం పోటీలకు ప్రత్యేక అతిథులుగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజులు విచ్చేశారు. ఈ సందర్భంగా వారిని సాదరంగా ఆహ్వానించి మాజీమంత్రి ప్రత్తిపాటి.. ఎడ్ల పందేల నిర్వాహకులు.. పత్తిపాటి ఫౌండేషన్ సభ్యులు అతిథులను ఘనంగా సన్మానించారు. సన్మానం అనంతరం అనగాని, ముత్తుముల, ముళ్లపూడి ఎడ్లపందేలకు విచ్చేసిన రైతులు.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
రాజకీయాలపై నాకున్నఆసక్తి గమనించి ప్రత్తిపాటి ప్రోత్సహించారు.
ఆరుగాలం శ్రమించే రైతుల కష్టాన్ని మరిపించేవి ఇలాంటి ఎడ్ల పందేలేనని, అలాంటి పోటీల నిర్వహణకు పూనుకున్న ప్రత్తిపాటి పుల్లారావును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు అనగాని తెలిపారు. తాను హైదరాబాద్ లో వ్యాపారం చేసేటప్పుడు.. పుల్లారావును కలిసి, రాజకీయాలపై నాకున్న ఆసక్తిని తెలియచేస్తే, ఆయన ఎంతగానో ప్రోత్సహించారని సత్యప్రసాద్ నాటి ఘటనను గుర్తుచేసుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులుగా 4 సార్లు, సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా, వ్యవసాయమంత్రిగా పనిచేసిన ఆయన అనుభవం..తమకెంతో ఉపయోగపడిందన్నారు. ఒంగోలు గిత్తలు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుప్రఖ్యాతులు పొందాయని, ఆ జాతికి ఎదురులేదని, అలానే చిలకలూరిపేటలో ప్రత్తిపాటికి తిరుగులేదని అనగాని స్పష్టంచేశారు.
రాష్ట్రం.. ప్రజలకోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ ల కష్టం
ఈ క్షణం కూడా దావోస్ పర్యటనలో పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి శ్రమిస్తున్నది మనందరి కోసం, రాష్ట్రం కోసమని, గత పాలకులు రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కు తీసుకెళితే, తిరిగి అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు చంద్రబాబు, లోకేశ్ లు పనిచేస్తున్నారని సత్యప్రసాద్ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తోందని, వాటికి కొనసాగింపుగా ప్రత్తిపాటి జాతీయస్థాయి ఎడ్ల పందేలు నిర్వహించడం నిజంగా అభినందనీయమన్నారు.
రైతులు.. వారి జీవన విధానమంటే ప్రత్తిపాటికి ఎంతో మక్కువ : ముత్తుమల అశోక్ రెడ్డి (శాసనసభ్యులు)
రైతులు, వారి జీవన విధానమంటే ప్రత్తిపాటి పుల్లారావుకి ఎంతో మక్కువని, వ్యవసాయమంత్రిగా ఉన్నప్పుడు రైతులు కోరిన యాంత్రీకరణ పరికరాలు, వివిధ రకాల పనిముట్లను వెంటనే అందచేశారని అశోక్ రెడ్డి తెలిపారు.
రెవెన్యూశాఖ మంత్రి సత్యప్రసాద్ గత ప్రభుత్వం రైతులకు చేసిన అన్యాయాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలకు అనుగుణంగా సరిదిద్దుతున్నారని అశోక్ రెడ్డి చెప్పారు.
ప్రత్తిపాటి మంత్రిగా ఉన్నప్పుడు మా జిల్లా రైతులకు మేలు చేశారు : ముళ్లపూడి బాపిరాజు (పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్)
తనకు గురు సమానులైన ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి ఎడ్ల పందేలను కళ్లారా చూడటం నిజంగా చెప్పలేని ఆనందాన్ని కలిగించిందని ముళ్లపూడి బాపిరాజు తెలిపారు. ప్రత్తిపాటి పుల్లారావు వ్యవసాయమంత్రిగా ఉన్నప్పుడు మా జిల్లా రైతుల పక్షాన ఏమికోరినా కాదనకుండా చేశారని బాపిరాజు గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో ప్రత్తిపాటి ఫౌండేషన్ నిర్వాహకులు, కూటమి నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.



