ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పీవీన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశి కుమార్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది
ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం లభించేలా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN మాధవ్ గారి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ ఏలూరి శశి కుమార్ గారి ఆధ్వర్యంలో “జనతా వారధి” కార్యక్రమం 3 వ సోమవారం ప్రజల నుండి వినతులు స్వీకరించటం తదుపరి సంబంధిత అధికారులకు సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలు అందించడం జరిగింది
పల్నాడు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ఆవరణలో ప్రజా సమస్యలను స్వీకరించిన సంబంధిత అధికారులకు సమర్పించడం జరిగింది
అలాగే రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు రెవెన్యూ సమస్యలపై రీ సర్వే తదితర సమస్యలపై పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది
ఈ కార్యక్రమం లో ముందుగా మీడియాతో జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారు మాట్లాడుతూ జిల్లాలోని సమస్యలను,ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులకు తెలియజేసి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బిజెపి పనిచేస్తుందని తెలిపారు.అలాగే జిల్లా లో బీజేపీ నాయకుల సమస్యలే కాకుండా ప్రజా సమస్యలు అన్నిటిని బీజేపీ జనతా వారధి జిల్లా కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తారు అని అన్నారు.గత రెండు వారాలుగా స్వీకరించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమస్యలు తిరిగి వారి నుండి రిప్లై కూడా వచ్చింది అని అన్నారు. ప్రతి శుక్రవారం పార్టీ కార్యాలయంలో అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం వినతులు స్వీకరిస్తారు అని అన్నారు
జనతావారధి ప్రారంభించి ఇది 3 వ సోమవారం కూడా వినతులు స్వీకరించాము అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ గారికి సుమారుగా 20 సమస్యలు దరఖాస్తు సమర్పించారు.
ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారు, జనతావారధి జిల్లా కమిటీ కన్వినర్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరావు గారు, జాతీయ కౌన్సిల్ సభ్యులు వల్లెపు కృపారావు గారు పల్నాడు జిల్లా మాజీ అధ్యక్షులు ఆలోకం సుధాకర్ బాబు గారు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు గారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు గట్ట హేమకుమార్ పల్నాడు జిల్లా ప్రోగ్రాం కో కన్వీనర్ గంజార్ల అది లక్ష్మి గారు జిల్లా ఉపాధ్యక్షుడు ఇత్తడి కిరణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



