భారతీయ జనతా పార్టీ చేపట్టిన “పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ మండల ప్రశిక్షణ అభియాన్” తరగతుల సన్నాహక సమావేశం వన్ టౌన్ నరసరావుపేట మండలంలో పల్నాడు జిల్లా పార్టీ ఆఫీసులో నిర్వహించడం జరిగింది

ఈ సమావేశానికి బిజెపి జిల్లా మల్లెల శివ నాగేశ్వరరావు హాజరై కార్యక్రమం సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు అంజనా రెడ్డి, పల్నాడు జిల్లా ఎగ్జిక్యూటివ్ గాయత్రి, కిసాన్ మోర్చా త్రీ మెన్ కమిటీ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు, నరసరావుపేట వన్ టౌన్ పట్టణ అధ్యక్షులు గుండా రాజేష్ కుమార్ మరియు నరసరావుపేట వన్ టౌన్ ఉపాధ్యక్షులు దేవరశెట్టి విశ్వనాథం పాల్గొన్నారు. ఈనెల 14,15 తేదీలలో జరగబోయే కార్యక్రమం ఏర్పాట్లు, పాల్గొనబోయే కార్యకర్తలు, శిక్షణ విధానాలపై వివరాలను అందించారు. ఈ సందర్భంగా మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కీలక సూచనలు చేస్తూ “మహా ప్రశిక్షణ అభియాన్ ద్వారా పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, సేవా కార్యక్రమాలపై కార్యకర్తలకు అవగాహన పెంపొందించి బూతు స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని తెలిపారు

Share.
Leave A Reply