అంకిరెడ్డి రమేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో మాజీ మంత్రి టీడీపీ శాసన సభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు పుట్టినరోజు వేడుకలు చిలకలూరిపేట పట్టణంలో అంకిరెడ్డి రమేష్ నాయుడు మిత్ర మండలి ఆధ్వర్యంలో మాజీ మంత్రి, చిలకలూరిపేట శాసన సభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి నాయకులకు, మిత్రులకు అందజేసిన అంకిరెడ్డి రమేష్ నాయుడు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్, టీడీపీ నాయకులు సదా శివరావు. ఈ కార్యక్రమంలో, జనసేన నాయకులు తోట రాజా రమేష్, టీడీపీ నాయకులు జంగా వినాయకరావు, షేక్ రియాజ్, బీజేపీ నాయకులు మల్లెల శివ నాగేశ్వరరావు, మిత్ర మండలి సభ్యులు, వరికూటి నాగేశ్వర రావు, సూరం రవి, శ్రీనివాస్, అంకిరెడ్డి శ్రీనివాస్, B C నాయకులు పృధ్వీ (సాయి), నవీన, అంకిరెడ్డి శేషాద్రి నాయుడు & ఫ్రెండ్స్ సర్కిల్, ఇతర టీడీపీ నాయకులు,…
Author: chilakaluripetalocalnews@gmail.com
శ్రీ దత్త సాయి సన్నిధిలో శాసనసభ్యులు శ్రీ పుల్లారావు గారి జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం– — చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజము మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసియున్న శ్రీ దత్త సాయి సన్నిధిలో ఈరోజు గురువారం పురస్కరించుకొని ప్రత్యేక అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు జరిగినాయి అనంతరం గౌరవ శాసనసభ్యులు , మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాన్యశ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వారి గోత్రనామాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగినాయి అనంతరం పుల్లారావు గారి పేరు మీదుగా వచ్చిన భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది, అనంతరం ట్రస్టు నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ చిలకలూరిపేట అభివృద్ధి ప్రదాత సేవా తత్పరులు ఎంతోమందికి కంటి చూపును ప్రసాదించి, నియోజకవర్గ ప్రజలను తమ సొంత కన్నబిడ్డలుగా…
ప్రత్తిపాటి గార్డెన్స్ లో ఘనంగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు జన్మదిన వేడుకలు చిలకలూరిపేట టీడీపీ ఆధ్వర్యంలో వేడుకల్లో పాల్గొన్న నాయకులు, నేతలు, కార్యకర్తలు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి నాయకులు కు అందించిన మాజీ మార్కెట్ చైర్మన్ సదా శివరావు, మున్సిపల్ చైర్మన్ రఫాని పేద ప్రజల మధ్య జరిగిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుట్టినరోజు వేడుకలు,సామూహికంగా శుభాకాంక్షలు తెలిపిన పేద ప్రజలు అనంతరం మెగా కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన పట్టణ వైద్యులు, టీడీపీ నాయకులు మెగా కంటి వైద్య శిబిరాన్ని కి అధిక సంఖ్యలో తరలివచ్చిన వృద్ధులు వృద్ధులు కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముమ్మర ఏర్పాట్లు చేసిన టీడీపి శ్రేణులు
చిలకలూరిపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు చిలకలూరిపేట పట్టణంలో ని స్టీల్ కోట్ల బజార్ భాస్కర్ ఫ్యాన్సీ వద్ద ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆర్యవైశ్య లంత పాల్గొని ఎమ్మెల్యే కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 100కేజీ ల లడ్డు ను ఏర్పాటు చేసి అందరికి పంచి పెట్టారు.లడ్డు తో పాటు మజ్జిక,జున్ను పేదవారికి అందించారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి చిలకలూరిపేట లో ఉన్న ఆర్యవైశ్య లందరికి అండగా ఉన్నారని, ఆర్యవైశ్య ల అభివృద్ధి కి ప్రత్తిపాటి పుల్లారావు కృషి చేశారని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. అందుకే చిలకలూరిపేట ఆర్యవైశ్య లాంత ప్రత్తిపాటి కి తోడు గా ఉన్నామని, రాబోయే రోజుల్లో కూడా అండగా ఉంటామని వారు స్పష్టంచేశారు.
ఘనంగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పుట్టినరోజు వేడుకలు, పేదలకు దుస్తులు పంపిణీ-చైర్మన్ రఫాని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పుట్టినరోజు సందర్భంగా చిలకలూరిపేట పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ స్కావెంజర్స్ వర్కర్స్ కు బట్టల పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్మన్ రఫాని నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు,జనసేన నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పుట్టినరోజు నాడు పేదలకు దుస్తులు పంపిణీ చేయడం సంతోషం గా ఉందని మున్సిపల్ చైర్మన్ రఫాని తెలిపారు.
వైస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన మదల కిరణ్ కుమార్ పిడుగురాళ్ల పట్టణ వైస్సార్సీపీ అధ్యక్షులుగా నియమించినందుకు గాను మాదల కిరణ్ కుమార్ , పిడుగురాళ్ల పట్టణ నాయకులు మరియు వైస్సార్సీపీ పార్టీ కార్యకర్తలు అందరూ కాసు మహేష్ రెడ్డి గారిని కలుసుకొని తనకు వైస్సార్సీపీ లో తాగు స్థానం కల్పించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి తమ పూర్తి మద్దతు అందిస్తామని,కాసు మహేష్ రెడ్డి గారి నేతృత్వంలో సమర్థవంతంగా పనిచేస్తామని వారు తెలిపారు.అలాగే గురజాల నియోజకవర్గం లో వైస్సార్సీపీ పార్టీ ని రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేస్తాను.
యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామ వాస్తవ్యులు బండ్లమూడి కళాధర్ గారి తండ్రి సాంబశివ ప్రసాద్ గారు స్వర్గస్తులైనారు.ఈ విషయం తెలుసుకొని వారి స్వగృహం వద్ద ఉన్న పార్థివ దేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనమండలి సభ్యుడు శ్రీ మర్రి రాజశేఖర్ గారు… ఈ కార్యక్రమంలో వారి వెంట కొమ్మినేని కోటయ్య గారు, ఘంటా మల్లేశ్వరరావు గారు, యడవల్లి శ్రీరామమూర్తి గారు, చాగంటి శ్రీధర్ గారు, ఘంటా వెంకటేశ్వరరావు గారు, ఘంటా శ్రీనివాస రావు గారు తదితరులున్నారు
చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని వేంకటేశ్వరుని వేడుకున్నాను : మాజీమంత్రి ప్రత్తిపాటి “రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న చంద్రబాబునాయుడి ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని, ఆయన నాయకత్వంలోని కూటమిప్రభుత్వంలో నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని కలియుగదైవం వేంకటేశ్వరుని వేడుకున్నట్టు మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మహానాడు చివరిరోజైన గురువారం ఉదయం ప్రత్తిపాటి తిరుమల శ్రీవారిని దర్శించుకొని, స్వామివారి సేవల్లో పాల్గొన్నారు. దర్శనానంతరం తిరుమల మాడవీధుల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమిప్రభుత్వంలో రాష్ట్రం దినదినాభివృద్ధి చెంది, దేశానికే గర్వకారణంగా నిలవాలని, ఆ దిశగా ఏపీ పురోగతిసాధనకు అవసరమైన శక్తియుక్తుల్ని ముఖ్యమంత్రికి ప్రసాదించాలని స్వామివారిని వేడుకున్నట్టు ప్రత్తిపాటి తెలిపారు. స్వామివారి అనుగ్రహంతోనే పార్టీ పండుగైన మహానాడు అనుకున్నదానికంటే ఎక్కువగా విజయవంతం అయిందని ప్రత్తిపాటి చెప్పారు. మహానాడులో తీర్మానాలన్నీ దిగ్విజయంగా అమలై లోకేశ్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తిరుగులేని విధంగా ఎదగాలని స్వామిని ప్రార్థించినట్టు ఆయన చెప్పారు. అలానే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు వినుకొండ శాసన సభ సభ్యులు & ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా – పల్నాడు జిల్లా – 31-05-2025|| 25+ ప్రముఖ కంపెనీలు వేదిక: బస్టాండ్ దగ్గరలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ,వినుకొండ ,పల్నాడు జిల్లా తేదీ: 31-05-2025 (శనివారం)సమయం: ఉదయం 09:00 గంటల నుండి విద్యా అర్హతలు:SSC, ఇంటర్మీడియట్ / ITI (ఏదైనా ట్రేడ్) / డిప్లొమా (ఏదైనా శాఖ) / ఏదైనా డిగ్రీ / B.Tech / B.Pharmacy / MBA వయస్సు: 18 నుండి 35 సంవత్సరాల మధ్య కంపెనీల సంఖ్య: 25+ఖాళీల సంఖ్య: 1500+ వెబ్సైట్ లింక్: https://forms.gle/a6tsT1iJkML8BtDCA గమనిక: ఆసక్తి కలిగిన అభ్యర్థులు పైన ఇవ్వబడిన వెబ్సైట్ లింకు లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవలెను. ఎమ్మెల్యే గారి కార్యాలయం : 77805 73…
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా మరోసారి ఎన్నికైన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. 1995 నుంచి 30 ఏళ్లుగా పార్టీ అధ్యక్షుడిగా అసమాన నాయకత్వంతో తెలుగుదేశం పార్టీని దేశంలోనే అగ్రగామి రాజకీయ శక్తిగా తీర్చిదిద్దిన చంద్రబాబు గారి నాయకత్వం అనితరసాధ్యం. చంద్రబాబు గారి నాయకత్వం, విజనరీ ఆలోచనలు, రాష్ట్రాభివృద్ధికి చేస్తున్న కృషి యావత్ తెలుగు జాతికి స్ఫూర్తిదాయకం. ఆయన నాయకత్వంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా పనిచేస్తూ రాష్ట్ర ప్రజలకు మరిన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలను అందించేందుకు పునరంకితం అవుతాం. జీవీ ఆంజనేయులుప్రభుత్వ చీఫ్ విప్,వినుకొండ శాసనసభ్యులు









