సీఎం.ఆర్.ఎఫ్ సాయం వేలమంది ప్రాణాలు కాపాడింది. : ప్రత్తిపాటి

  • అత్యవసర వైద్యచికిత్సలు అవసరమైన వారికి ప్రభుత్వసాయం ఎంతో ఉపయోగపడుతోంది : ప్రత్తిపాటి.
  • ఆపత్కాలంలో మనకు అండగా నిలిచే ముఖ్యమంత్రి ఉండటం ప్రజలకు వరం : ప్రత్తిపాటి

అత్యవసర వైద్య చికిత్సలు అవసరమైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం ఎంతగానో ఉపయోగపడుతోందని, ఇప్పటికే వేలమంది ప్రాణాలు కాపాడిందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శుక్రవారం తన నివాసంలో ప్రభుత్వం నుంచి మంజూరైన సీఎం.ఆర్.ఎఫ్ చెక్కుల్ని ప్రత్తిపాటి లబ్ధిదారులకు, అనారోగ్యబాధితుల కుటుంబసభ్యులకు అందించారు. 43 మంది లబ్ధిదారులకు రూ.24.13 లక్షల విలువైన చెక్కుల్ని స్వయంగా అందచేసిన ప్రత్తిపాటి లబ్ధిదారులతో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనారోగ్య సమస్యలు… తీవ్రమైన జబ్బులు… ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న లక్షలాది పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎం.ఆర్.ఎఫ్) సాయం కొత్త వెలుగులు నింపుతోందని ప్రత్తిపాటి చెప్పారు. ఆర్థిక స్తోమత లేని పేద కుటుంబాల్లోని వారికి కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా ఖరీదైన వైద్యసేవలు అందిస్తున్న కూటమిప్రభుత్వంపై ప్రజలు చెక్కుచెదరని విశ్వాసంతో ఉండాలని ప్రత్తిపాటి సూచించారు. చంద్రబాబు ఆపత్కాలంలో సదా ప్రజలవెన్నంటి నిలుస్తున్నారని, అటువంటి నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం నిజంగా మనందరికి వరమనే వాస్తవాన్ని అందరూ గ్రహించాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, టీడీపీ నాయకులు జవ్వాజి మధన్ మోహన్, కామినేని సాయిబాబు, పఠాన్ సమాధ్ ఖాన్, మద్దుమలా రవి, నాయకులు తదితలున్నారు.

Share.
Leave A Reply