Author: chilakaluripetalocalnews@gmail.com

షేక్ మహబూబ్ సుభాని గారి కుమారుల (ఖుద్దూస్ గారి మనుమళ్ళ) అఖికా వేడుక చిలకలూరిపేట పట్టణంలోని జంపాని సినీ కళ్యాణమండపం నందు జరుగుచుండగా ఆ కార్యక్రమానికి హాజరై చిరంజీవులు మహమ్మద్ అష్రాఫ్, మహమ్మద్ అసాద్ లను ఆశీర్వదించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు… ఈ వేడుకలో వారి వెంట స్పెట్స్ కరిముల్లా గారు, AVM సుభాని గారు, భక్షు మేస్త్రి గారు, అత్తలూరి షరీఫ్ గారు తదితరులు ఉన్నారు.

Read More

దేశం ఆశ్చర్యపోయేలా, మోదీ గర్వించేలా ‘యోగాంధ్ర’ చరిత్రలో నిలవాలి : ప్రత్తిపాటి దేశం గర్వించేలా, రాష్ట్ర ప్రతిష్ఠ ఇనుమడించేలా చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ ల పేరు ప్రఖ్యాతులు పెంచేలా జూన్ 21న సాగరతీరాన జరిగే యోగాంధ్ర కార్యక్రమం చరిత్రలో నిలిచిపోవాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. యోగాంధ్ర నిర్వహణ విజయవంతంపై ఆదివారం ఆయన విశాఖపట్నంలోని గురజాడ కళాపరిషత్, స్థానిక వీ.ఆర్.డీ.ఎం.ఏ కార్యాలయంలో కూటమిపార్టీల శ్రేణులు, డ్వాక్రా, మెప్మా సంఘాల మహిళలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. యోగాంధ్ర బహిరంగ సభా నిర్వహణలో భాగంగా విశాఖపట్నం నార్త్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతల నిర్వహణకు ప్రతి ఒక్కరి సహాకారం కావాలని ఈ సందర్భంగా ప్రత్తిపాటి కోరారు. సూపర్-6 అమలుతో జగన్ అడ్రస్ గల్లంతే…తల్లికి వందనం అమలుతో చంద్రబాబు చరిత్ర సృష్టించారని, సూపర్ -6 అమలైతే జగన్ అడ్రస్సే గల్లంతవుతుందని, ప్రభుత్వ పథకాల ఫలాలు అందాక ప్రజలు…

Read More

కూటమి ప్రభుత్వం ఫీజుల నియంత్రణపై చర్యలు చేపట్టాలి . విద్యార్థులకు టీసీలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. అనుమతులు లేని కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలను రద్దు చేయాలి-బి.శ్రీను నాయక్. కూటమి ప్రభుత్వం ఫీజుల దోపిడీని అరికట్టాలని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి. శ్రీను నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని ఎన్నారై సెంటర్లోని గల సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు విద్యను వ్యాపారంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. పేద, బడుగు, బలహీన వర్గాల చెందిన విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో ఎంతో కొంత విద్యార్థుల ఫీజులపై నియంత్రణ ఉండేదని కనీసం ఆ విధంగా లేకపోవడం చాలా దారుణం అన్నారు. విద్యార్థుల ఫీజుల భారంగా మారడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల ఊబిలో కోరుకోవలసిన పరిస్థితి నెలకొందన్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే ఫీజుల నియంత్రణపై ప్రతిష్టమైన చర్యలు…

Read More

ఈనెల 18వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వర్యులు,వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటన నేపథ్యంలో ఈరోజు సత్తెనపల్లి రూరల్ మండలం రెంటపాళ్ల గ్రామంలో పార్టీ నేతలతో పాటు పర్యటించి రూట్ మ్యాప్ పరిశీలించిన మాజీ మంత్రి వర్యులు విడదల రజిని .

Read More

తెలగ ,కాపు, బలిజ కళ్యాణ మండపం పునర్నిర్మాణ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు మన కుల పెద్దలైన తంగేళ్ల లింగారావు మాస్టారు, పొన్నం చంద్రశేఖర్ గారు, తోట సత్యనారాయణ గారు, తోట రామచంద్ర ప్రసాద్ గారు మరియు వారి సోదరులు రాజా గారు, గోవింద శంకర్ శ్రీనివాస్ రావు గారిని గౌరవపూర్వకంగా కలిసి ఈ యొక్క కళ్యాణ మండపం పునర్నిర్మాణం గురించి వివరించి వారి యొక్క సలహాలు మరియు సహాయ సహకారాలు కోరడం జరిగింది . మేం కలిసిన ప్రతి ఒక్కరు సానుకూలంగా స్పందించి మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా వెన్నంటి మేము ఉండి చేస్తామని వారి యొక్క గొప్ప మనసు చాటుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోతురాజు హరీష్, ఉయ్యూరి నరసింహారావు, కమ్మిలి శివరామకృష్ణ, పొన్నం చంద్రశేఖర్ గారు, మండల నేని జగదీష్, మిరియాల లక్ష్మీనారాయణ , రామిశెట్టి శివప్రసాద్ తదితర కాపు నాయకులు ఈ పునర్నిర్మాణం లో…

Read More

తల్లికి వందనంపై వైకాపా విమర్శలు దివాళా కోరుతనానికి నిదర్శనం: జీవీ తల్లికివందనంపై వైకాపా విమర్శలు వారి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు చీఫ్‌ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. ఒకే రోజు 67.27 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10,091 కోట్లు జమ చేయడం దేశ చరిత్రలోనే ఒక రికార్డు అన్న జీవీ ఇంత పెద్ద ఎత్తున, ఇంత పారదర్శకంగా సంక్షేమ పథకంపై వైకాపా, జగన్ విమర్శలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయన్నారు. శనివారం ఈ మేరకు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో విపక్షంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారాయన. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే హామీల్లో 80% అమలు చేసి, ప్రజలకు నమ్మకం కల్పించిన ఘనత సాధించిందన్నా రు. మరీ ముఖ్యంగా సూపర్‌సిక్స్ హామీల్లో తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు గౌరవం, విద్యావ్యవస్థకు బలం, సామాజిక సంక్షేమానికి పట్టం కట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. నిజానికి తల్లికి…

Read More

పేటలో కంపోస్టు యార్డును పరిశీలించిన అధికారుల బృందం చిలకలూరిపేట: పురపాలక సంఘ పరిధిలోని కంపోస్టు యార్డును శనివారం నాడు ఎస్. ఈ.దాసరి శ్రీనివాసరావు.ఆర్.డి. ఎస్ హరికృష్ణ,ఈ.ఈ వెంకటేశ్వర్లు. పబ్లిక్ హెల్త్ రవికుమార్. ఎండి. శ్రీనివాసరావు. (ప్రాంతీయ ఉప కార్యనిర్వాహక ఇంజనీరు) మరియు మున్సిపల్ కమిషనర్ పీ. శ్రీహరి బాబు లు పరిశీలించారు.ఈ పరిశీలనలో యార్డు నిర్వహణ, వ్యర్థాల శుద్ధి ప్రక్రియ, పారిశుద్ధ్య పనులు తదితర అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. యార్డులో జరుగుతున్న పనుల పురోగతిని, వాటి నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కంపోస్టు యార్డు మెరుగుదలకు అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చినట్లు తెలిసింది. పారిశుద్ధ్య నిర్వహణలో కంపోస్టు యార్డు కీలక పాత్ర పోషిస్తున్నందున, దాని పనితీరును మరింత సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఈలు సానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Read More

బొప్పుడి కొండ పైన వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు పూజలు చేసి స్వామి వారి ఆశీసులు పొందిన భక్తులు వివిధ రకాల పూలతో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ని అలంకరించిన అర్చకులు పవన్ శ్రావణ నక్షత్రం సందర్భంగా బొప్పూడి కల్యాణ వెంక టేశ్వర స్వామివారికి ప్రత్యేకఅభిషేకాలు నిర్వహించారు

Read More

తల్లికి వందనం పథకాన్ని సమర్దవంతంగా అమలు పరచిన కూటమి ప్రభుత్వానికి మద్దతుగా కూటమి నేతలకు పాలాభిషేకం చేసిన 9 వ వార్డు పార్టీ నేతలుసూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఒక్కొక్క హామీని నిలబెట్టుకునే దిశగా పరుగులు తీస్తున్న కూటమి ప్రభుత్వం,ఇటివల అమలు పరచిన తల్లికి వందనం కార్యక్రమం ప్రతీ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిందని, దానిని పురస్కరించుకుని కూటమి ప్రభుత్వానికి మద్దతుగా 9 వ వార్డు పరిధిలోని నెహ్రూ నగర్ వద్ద ఉన్న NTR విగ్రహం వద్ద కూటమి పార్టీ నేతలు ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిత్ర పటాలకు పార్టీ నేతలు పాలాభిషేకం చేయడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ముందుగా పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ కరిముల్లా, పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, పార్టీ అధికార ప్రతినిధి మురకొండ మల్లిబాబు NTR విగ్రహానికి పూలమాలలు…

Read More

ప్రజా సమస్యలపై కాలనీ వాసులు ప్రత్తిపాటికి వినతి. చిలకలూరిపేట పట్టణ ములోని 38వ వార్డు జిడ్డు కాలనీ (గంగమ్మ సుగాలి కాలనీ) లో నెలకొన్న సమస్యల పై మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు కు శనివారం వార్డు నాయకులు వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం పడుతున్నా వర్షాలకు చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవసాయ భూమిలో నుంచి నీరు రోడ్లమీదకు ప్రవహిస్తుందని, రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుందన్నారు. రానున్న కాలంలో కాలని ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మురుగు కాలువల్లో నీరు పారుదల లేక అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. కల్వర్టులు, సీసీ రోడ్లు వేయాలని ప్రత్తిపాటి ని కోరారు. ప్రభుత్వం నుంచి బడ్జెట్ రాగానే చేయిస్తామన్నారు. ఈ సమస్యలు పరిష్కారం అయే విధంగా చూడాలని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ రమావతు సాలీబాయి, గిరిజన సంఘం నాయకులు…

Read More