మండలనేని వెంకటేశ్వర్లు స్వామి ఆధ్వర్యంలో మాఘ పౌర్ణమి పవిత్ర వేళ ఆ మహాశివుడు కొలువై ఉన్న అరుణాచల క్షేత్రంలో గిరి ప్రదక్షిణ చేయుటకు భక్తుల పయనం…

నాదెండ్ల మండలం గణపవరం గ్రామ వాస్తవ్యులు గణపవరం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం నిర్మాణ కార్యనిర్వాహకులు మండలనేని వెంకటేశ్వర్లు స్వామి ఆధ్వర్యంలో మాఘపౌర్ణమి సందర్భంగా 25వ అరుణాచల గిరి ప్రదక్షణకు స్వామివారి భక్తులు నాలుగు బస్సులలో సుమారు 200 మంది భక్తులు సిద్ధమయ్యారు.ఈ శుభ సందర్భంగా శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ , జనసేన పార్టీ యువ నాయకులు మండల నేని చరణ్ తేజ గణపవరం గ్రామంలోని శ్రీ వినాయక స్వామి ఆలయంలో వారి ప్రయాణం సుఖవంతం, శుభప్రదం కావాలని ఆ మహశివుని దర్శించుకుని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు.అనంతరం జెండా ఊపి బస్సు ప్రయాణాన్ని ప్రారంభించి భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అరుణాచలేశ్వర స్వామి కృప అందరికీ చేకూరాలని ఆకాంక్షిస్తూ భక్తులను గిరి ప్రదక్షణకు సాగనంపారు.ఈ దైవకార్యక్రమంలో గణపవరం గ్రామ మాజీ సర్పంచ్ వలేటి హిమవంతరావు , నాగభూషణం,తదితర భక్తులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply